‘ఇరుముడి’ సినిమా యూనివర్సల్‌గా కనెక్ట్ అవుతుంది: ప్రియా భవానీ శంకర్
మాస్ మహారాజా రవితేజ మోస్ట్ అవైటెడ్ మూవీ 'ఇరుముడి'. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం గ్లింప్స్, ట్రైలర్, పాటలతో ఇప్పటికే భారీ అంచనాలు రేకెత్తించింది. ఆగస్టు 21న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులకు ఎమోషన్స్, యాక్షన్‌తో కూడిన డిఫరెంట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించబోతుంది. ఈ సందర్భంగా హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. ఇరుముడిలో కావేరి పాత్ర ఎలా ఉండబోతుంది? -మీరు ట్రైలర్ చూస్తే కథ గురించి ఇప్పటికే ఒక ఐడియా వచ్చి ఉంటుంది. కావేరి సింపుల్ ఫ్యామిలీ ఉమెన్. భర్త, కూతురు ఇద్దరే తన ప్రపంచం. ఫ్యామిలీని ఎంతో…
