'నవరసరాయ' డా. నరేష్ విజయ కృష్ణ, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, రాజ్ వెడ్స్ రాంబాయి…
#RT78 టైటిల్ ‘తులాభారం’- పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా లాంచ్- క్రియేటివ్ టైటిల్ డాక్యుమెంటరీ రిలీజ్
మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబినేషన్ లో మోస్ట్ ఎవైటెడ్ #RT78 తెరపైకి వస్తోంది. రవితేజ ట్రేడ్‌మార్క్ ఎనర్జీ, వివేక్ ఆత్రేయ యూనిక్ స్టయిల్ స్టోరీ టెల్లింగ్ కలగలిసి క్రైమ్, డ్రామా, ఎంటర్‌టైన్‌మెంట్‌తో సరికొత్త అనుభూతిని అందించనున్నాయి. బ్లాక్‌బస్టర్ ‘ఇరుముడి’ విజయంతో జోరు మీదున్న రవితేజ.. ఈ ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించేందుకు సిద్ధమవుతున్నారు. బ్రిడ్జ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై లక్ష్మణ్, శ్రీనిరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తునారు.
ఈ సినిమా టైటిల్‌ను రివిల్ ను మేకర్స్ వినూత్నంగా రూపొందించిన ‘ది టైటిల్ డాక్యుమెంటరీ’ వీడియోను విడుదల చేశారు. వివేక్ ఆత్రేయ తనదైన స్టయిల్ లో రూపొందించిన ఈ వీడియోను మై హోమ్ రామ్ విడుదల చేశారు. ‘తులాభారం’ టైటిల్‌ను ఎంపిక చేసే ప్రక్రియ వెనుక జరిగిన సరదా, వినోదభరితమై సంభాషణలను ఈ వీడియో ద్వారా చూపించారు. విలక్షణమైన క్రియేటివ్ వరల్డ్ ను పరిచయం చేస్తూ ఈ టైటిల్ డాక్యుమెంటరీ ఆకట్టుకుంటోంది.
ఈ వీడియోలో సినిమాలోని కీలక పాత్రలను కూడా పరిచయం చేశారు. జడేజాగా అనిల్ కరెళ్ల, రాబిన్‌గా రవి ఆంటోనీ, సౌండ్‌గా అనస్వర రాజన్, దేవరాజ్‌గా తరుణ్ భాస్కర్, శివాజీ రావుగా జేడీ చక్రవర్తి, కృష్ణవేణిగా ప్రియాంక మోహన్ కనిపించనున్నారు.
దశాబ్దాలుగా రవితేజ తనదైన ఎనర్జీ, పవర్ ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ‘మాస్ మహారాజా’గా ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. అయితే ‘తులాభారం’తో ఆయన సరికొత్త ఐడెంటిటీ ని సొంతం చేసుకోబోతున్నారు. ఇందులో ‘మాస్ మహారాజా’కు బదులుగా ‘క్రైమ్ మహారాజా’గా పరిచయం అవుతున్నారు. ‘నవ రవితేజం’గా కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతూ విడుదల చేసిన టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియో.. రవితేజను పూర్తిగా భిన్నమైన అవతార్‌లో చూపించబోతోందనే ఆసక్తిని పెంచుతోంది. ఈ క్రేజీ కాంబినేషన్‌లో ఎలాంటి ప్రత్యేకమైన కథను చూపించబోతున్నారనే క్యురియాసిటీ ప్రేక్షకుల్లో నెలకొంది.
చిత్ర బృందం ఈరోజు సినిమా పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంతో సినిమా అధికారికంగా ప్రారంభమై, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్‌లోకి అడుగుపెట్టనుంది. ముహూర్తం సందర్భంగా వీవీ వినాయక్ చిత్ర బృందానికి స్క్రిప్ట్‌ను అందజేశారు. చందు కెమెరా స్విచ్ ఆన్ చేయగా, శ్రీ విష్ణు క్లాప్ కొట్టారు. శివ నిర్వాణ, బాబీ కలిసి తొలి షాట్‌కు దర్శకత్వం వహించారు. ఈ కార్యక్రమంలో మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ యెర్నేని, వై. రవిశంకర్‌తో పాటు పలువురు అతిథులు పాల్గొన్నారు.
ఈ చిత్రానికి ట్యాలెంటెడ్ టెక్నికల్ టీం పనిచేస్తున్నారు. వివేక్ ఆత్రేయతో తరచుగా కలిసి పనిచేసే వివేక్ సాగర్ సంగీతాన్ని అందిస్తున్నారు. తేని ఈశ్వర్ ISC సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రవితేజ గిరిజాల ఎడిటర్‌గా, జీఎం శేఖర్ ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.
త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ ఆసక్తికరమైన కాంబినేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్స్ రానున్న రోజుల్లో వెల్లడించనున్నారు.
నటీనటులు: మాస్ మహారాజా రవితేజ, తరుణ్ భాస్కర్, ప్రియాంక మోహన్, అనస్వర రాజన్, జేడీ చక్రవర్తి, అనిల్ కరెళ్ల, రవి ఆంటోనీ
సాంకేతిక బృందం:
రచన, దర్శకత్వం: వివేక్ ఆత్రేయ
నిర్మాతలు: లక్ష్మణ్, శ్రీనిరావు
బ్యానర్: బ్రిడ్జ్ ప్రొడక్షన్స్
సంగీతం: వివేక్ సాగర్
సినిమాటోగ్రఫీ: తేని ఈశ్వర్ ISC
ఎడిటర్: రవితేజ గిరిజాల
ఆర్ట్ డైరెక్టర్: జీఎం శేఖర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎన్. నరసింహారావు
కాస్ట్యూమ్ డిజైనర్: నాని కమార్సు
మేకప్ చీఫ్: ఐ. శ్రీనివాసరాజు
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: వాల్స్ అండ్ ట్రెండ్స్



