Skip to content

డిసెంబర్ 11న’ రీ-రిలీజ్ కానున్న “ఆరుగురు పతివ్రతలు” టీజర్ లాంచ్ చేసిన ఆర్యన్ రాజేష్

దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో 2004లో విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకున్న చిత్రం ‘ఆరుగురు పతివ్రతలు’. ఈ చిత్ర రీ-రిలీజ్ ట్రైలర్‌ను ఈవీవీ తనయుడు, నటుడు ఆర్యన్ రాజేష్ లాంచ్ చేశారు. పోచమ్మ ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ సినిమా మరోసారి డిసెంబర్ 11న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి కమలాకర్, జనార్ధన్, మహర్షి, నాగిరెడ్డి కీలక బాధ్యతలు నిర్వహించారు. బోల్డ్ కామెడీ కంటెంట్‌తో అప్పట్లో ప్రేక్షకులను అలరించిన ఈ సినిమాలో అమృత, లహరి, చలపతి రావు, ఎల్.బి. శ్రీరామ్, శ్రీకృష్ణ కౌశిక్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

భార్యాభర్తల మధ్య అనుబంధం, వివాహేతర సంబంధాలు, లైంగిక సమస్యలు, బలవంతపు పెళ్లిళ్లు, సైకో మనస్తత్వం కలిగిన భర్తల ప్రవర్తన వంటి విభిన్న అంశాలతో పాటు ప్రేమ, భావోద్వేగాలు, హాస్యాన్ని మేళవిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

ట్రైలర్ లాంచ్ సందర్భంగా ఆర్యన్ రాజేష్ మాట్లాడుతూ.. “మా నాన్న ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో 2004లో విడుదలైన ‘ఆరుగురు పతివ్రతలు’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఇప్పుడు మరోసారి ఈ సినిమాను డిసెంబర్ 11న థియేటర్లలో చూసి ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను. ఈ చిత్రాన్ని రీ-రిలీజ్ చేస్తున్న పోచమ్మ ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూషన్ వారికి నా ధన్యవాదాలు” అని తెలిపారు.

మరోసారి వెండితెరపై సందడి చేయనున్న ‘ఆరుగురు పతివ్రతలు’ చిత్రానికి ప్రేక్షకులు ఎలాంటి ఆదరణ అందిస్తారో చూడాలి.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.