Skip to content

‘కింగ్ 100’ 30 డేస్ కౌంట్‌డౌన్ పోస్టర్ రిలీజ్

కింగ్ నాగార్జున అక్కినేని ప్రతిష్టాత్మక 100వ సినిమా ‘కింగ్ 100’ కోసం కౌంట్‌డౌన్ మొదలైంది. ఈ సినిమా డిసెంబర్ 24న క్రిస్మస్ సీజన్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానున్నట్లు మేకర్స్ మరోసారి కన్ఫర్మ్ చేశారు. రా కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తోంది. టబు, అశోక్ సెల్వన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సినిమా రిలీజ్ డేట్‌పై వస్తున్న సందేహాలకు తెరదించుతూ, అనుకున్న షెడ్యూల్ ప్రకారమే సినిమా రిలీజ్ అవుతుందని టీమ్ స్పష్టం చేసింది. థియేటర్లలోకి సినిమా రావడానికి సరిగ్గా 30 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ సందర్భంగా మేకర్స్ ప్రత్యేక కౌంట్‌డౌన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. దీంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

ఈ పోస్టర్‌లో నాగార్జున స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఇంటెన్స్ రెడ్ బ్యాక్‌డ్రాప్‌లో డార్క్ సూట్, సన్‌గ్లాసెస్‌తో ఆయన లుక్ ఆకట్టుకుంటోంది. వెనుక ఒక వింటేజ్ కారు ఉండగా, నాగార్జున తనదైన ప్రత్యేకమైన స్టైల్‌లో ఆకట్టుకున్నారు. రెడ్ టోన్ విజువల్, క్లాసిక్ కారు, డ్రమాటిక్ సిల్హౌట్ పోస్టర్‌కు అదిరిపోయే రెట్రో లుక్‌ను తీసుకొచ్చాయి. 30 డేస్ కౌంట్‌డౌన్‌కు వింటేజ్ ఫ్లేవర్‌ను జోడించాయి.

‘కింగ్ 100’ ఇప్పటికే తన ప్రమోషనల్ కంటెంట్‌తో మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటివరకు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లు, పాత్రల గ్లింప్స్‌కు మంచి స్పందన వచ్చింది. సినిమాలోని క్యారెక్టర్లు, కథ నేపథ్యం, కథనం ఎలా ఉండబోతున్నాయనే ఆసక్తి ప్రేక్షకుల్లో పెరిగింది. నాగార్జున కెరీర్‌లో ఇది 100వ సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమాకు రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. రాజా మహదేవన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, నవీన్ నూలి ఎడిటింగ్ చేస్తున్నారు.

సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. మిగిలిన పనులను పూర్తి చేస్తూనే, భారీ ప్రమోషనల్ క్యాంపెయిన్‌కు టీమ్ సిద్ధమవుతోంది.

నటీనటులు: కింగ్ నాగార్జున, టబు, అశోక్ సెల్వన్.

టెక్నికల్ టీమ్:
రచన, దర్శకత్వం: రా కార్తీక్
బ్యానర్: అన్నపూర్ణ స్టూడియోస్
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ: రాజా మహదేవన్
ఎడిటర్: నవీన్ నూలి
ప్రొడక్షన్ డిజైనర్: సతీష్ కుమార్ ఎన్
పీఆర్వో: వంశీ-శేఖర్

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.