ప్రేమతో చేసిన ‘లెనిన్’ సినిమాకి ఆడియెన్స్ కూడా అదే ప్రేమను తిరిగి ఇస్తారని ఆశిస్తున్నాను – కింగ్ నాగార్జున
‘లెనిన్’ను నిజాయితీగా చేశాం.. మా కంటెంట్ మాట్లాడుతుంది - రిలీజ్ ప్రెస్ మీట్‌లో అఖిల్ అక్కినేని అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగ వంశీ నిర్మించిన చిత్రం 'లెనిన్'. ఈ సినిమాకి మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. ఈ మూవీ జూలై 10న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ క్రమంలో బుధవారం నాడు రిలీజ్ ప్రెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో.. కింగ్ నాగార్జున మాట్లాడుతూ .. ‘‘నందు ఈ కథ శ్రీరామపురంలో జరుగుతుందని చెప్పగానే నాకు మా నాన్న గారు గుర్తొచ్చారు. నందు ఈ కథను అద్భుతంగా రాశారు. డైలాగ్స్ గొప్పగా…
