Skip to content

‘ఇట్లు అర్జున’ ప్రేక్షకుల ఆశీస్సులు పొందడం నిజంగా గొప్ప విషయం: మెగాస్టార్ చిరంజీవి

  • అనీష్‌ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. ఇంత గొప్ప విజయాన్ని అందించిన తెలుగు సినిమా ప్రేక్షకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు: కింగ్ నాగార్జున

కింగ్ నాగార్జున సమర్పణలో వచ్చిన లేటెస్ట్ హార్ట్‌బస్టర్ ‘ఇట్లు అర్జున’. అనీష్ హీరోగా పరిచయమైన ఈ చిత్రంలో అనస్వర రాజన్ కథానాయికగా నటించింది. మహేష్ ఉప్పల ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. దర్శకుడు వెంకీ కుడుముల వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘ఇట్లు అర్జున’ నవంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న నేపథ్యంలో చిత్ర బృందం థాంక్ యూ మీట్ నిర్వహించింది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.

థాంక్ యూ మీట్ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఇక్కడి వాతావరణం చూస్తుంటే నిజమైన సక్సెస్ అంటే ఏంటో మీ ఉత్సాహంలోనే తెలుస్తోంది. ఈ ఎనర్జీ చూస్తుంటేనే సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అర్థమవుతోంది. హీరో అనీష్ చాలా అదృష్టవంతుడు. ఇండస్ట్రీలో ఉన్న ఎంతోమంది హీరోలు ఒక డెబ్యూ హీరోకు ఈ స్థాయిలో సపోర్ట్ చేయడం చాలా అరుదు. అది ఒక్క అనీష్‌కే దక్కింది. ఈ సినిమాలోని ఒక సాంగ్‌ను నాని రిలీజ్ చేశారు. ట్రైలర్‌ను తారక్ రిలీజ్ చేశారు. కింగ్ నాగార్జున గారు ఈ సినిమాకు వెన్నుముకలా నిలిచారు. రామ్ చరణ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చారు. ఇప్పుడు నేను ఈ వేడుకకు వచ్చాను. అంతేకాదు, ఈ సినిమా ప్రీమియర్స్‌కు వెంకటేష్ గారితో పాటు ఎంతోమంది వచ్చి అనీష్‌ను అభినందించారు. ఇంతమంది ఈ సినిమాను ఎందుకు ప్రేమిస్తున్నారు? ఇంతగా ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? అనే ఆలోచన మీకు రావచ్చు. దానికి కారణం నా మిత్రుడు మహేష్ రెడ్డి. ఆయన చేసుకున్న పుణ్యం, బాబాపై ఆయనకున్న భక్తి, సినిమా మీద ఆయనకున్న ప్రేమ, అభిమానం ఇవన్నీ ఈ సినిమాకు ఇంతటి సపోర్ట్ రావడానికి కారణమయ్యాయి. వ్యాపారంలో ఎంతో గొప్ప స్థాయిలో ఉన్నప్పటికీ సినిమాపై ఆయనకున్న ప్రేమ, భక్తిభావం ప్రత్యేకమైనవి. నాగార్జున గారితో ఆయనకు ఉన్న అనుబంధం, గతంలో కలిసి చేసిన సినిమాల వల్ల ఈ సినిమా పట్ల కూడా ఆయనకు ప్రత్యేకమైన మక్కువ ఏర్పడింది. వాళ్ల అబ్బాయికి కూడా సినిమాలపై ఆసక్తి కలగడం, నటన వైపు రావడం, తల్లిదండ్రులు అతన్ని ఎంకరేజ్ చేయడం జరిగింది. ఇంత అద్భుతమైన టాలెంట్, ఆసక్తి ఉన్న అనీష్ ను మనం కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ అతని వెనుక నిలబడ్డారు. ప్రేక్షకులు కూడా సినిమా కంటెంట్ నచ్చి విజయాన్ని అందించారు. ‘ఇట్లు అర్జున’ యూనిట్‌లోని ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక అభినందనలు. గతంలో పెద్ద ఈవెంట్ సినిమాలు ఉన్నప్పుడే ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లే పరిస్థితి కనిపించేది. కానీ గత రెండేళ్లుగా చిన్న సినిమాలు, మంచి కంటెంట్ ఉన్న సినిమాలను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఇప్పుడు పరిశ్రమ కొత్తవాళ్లతో కళకళలాడుతోందంటే దానికి కారణం యంగ్ టాలెంట్. యంగ్ రైటర్స్, డైరెక్టర్స్ సినిమా పరిశ్రమకు కొత్త ఉత్సాహాన్ని, ఊపును తీసుకొచ్చి ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తున్నారు. అందుకే యంగ్ రైటర్స్, డైరెక్టర్స్‌కు నా అభినందనలు. సీనియర్ డైరెక్టర్లు ఇండస్ట్రీకి గౌరవం తీసుకురావచ్చు. కానీ కొత్త కథలతో, కొత్త ఆలోచనలతో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే బాధ్యతను యంగ్ టాలెంట్ కూడా అద్భుతంగా నిర్వహిస్తోంది. ‘ఇట్లు అర్జున’ సినిమా వెనుక కూడా మంచి యంగ్ టీమ్ ఉంది. హీరో అనీష్, హీరోయిన్ అనస్వర, ప్రొడ్యూసర్ వెంకీ కుడుముల, డైరెక్టర్ మహేష్.. ఇలా అందరూ మంచి యంగ్ టాలెంట్. ఈ సినిమా ఇంత పెద్ద విజయం సాధించడానికి వీళ్లంతా ఎంతో కష్టపడ్డారు. ఇలాంటి కొత్త టాలెంట్ ఇంకా రావాలి. ఈ పరిశ్రమ ఒక జీవనదిలా నిరంతరం కొనసాగుతుంటే ఎంతోమంది బాగుపడతారు, అభివృద్ధిలోకి వస్తారు. ఈరోజు మధ్యాహ్నమే సినిమా చూశాను. అనీష్ తన హావభావాలతో, బాడీ లాంగ్వేజ్‌తో ఆద్యంతం అందరినీ ఆకట్టుకున్నాడు. మాటలు లేకుండా తనవైపు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడం ఒక కొత్త నటుడికి చాలా కష్టం. ‘గీతాంజలి’లో నాగార్జున గారు క్యాన్సర్ పేషెంట్‌గా, ‘పున్నమినాగు’ నేను చేసిన పాత్ర, వినికిడి లోపం ఉన్న పాత్రలో ‘రంగస్థలం’లో చరణ్, లెనిన్ లో అఖిల్, మొన్నటికి మొన్న సూర్య సీన్ లో బ్లైండ్ క్యారెక్టర్‌లో.. ఇలా హీరో పాత్రల్లో ఏదైనా లోపం ఉండేలా చూపించడం ఒక ఛాలెంజ్. వాళ్లంతా తమ అనుభవంతో ఆ ఛాలెంజ్‌ను నిరూపించుకున్నారు. కానీ అలాంటి ఛాలెంజింగ్ రోల్ అనీష్‌కు తొలి సినిమాకే రావడం, దాన్ని అద్భుతంగా నిరూపించుకోవడం, ప్రేక్షకుల ప్రేమ, ఆశీస్సులు పొందడం నిజంగా గొప్ప విషయం. తొలి సినిమాతోనే ఆ అదృష్టాన్ని అనీష్ పొందగలిగాడు. తనకు హ్యాట్సాఫ్. ఇలాంటి మరిన్ని మంచి, అద్భుతమైన పాత్రలతో ముందుకు వెళ్తూ ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకోవాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ అద్భుతంగా చేశారు. అనస్వర తన పాత్రలోని విభిన్న కోణాలను చాలా బాగా ప్రజెంట్ చేసింది. ఆమె నటన నాకు చాలా నచ్చింది. అలాగే ఈ సినిమాను డైరెక్టర్ మహేష్ చాలా వైవిధ్యంగా తెరకెక్కించి ప్రేక్షకుల మెప్పు పొందాడు. సినిమాలో ప్రేమకథను బ్లెండ్ చేసిన విధానం, స్క్రీన్‌ప్లే చాలా బాగున్నాయి. అందుకే మొదటి సీన్ నుంచి చివరి సీన్ వరకు సినిమా మనల్ని కట్టిపడేస్తుంది. మహేష్‌కు చాలా గొప్ప భవిష్యత్తు ఉంది. తమన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. తను ‘కాకా’ సినిమా కూడా చేస్తున్నాడు. కచ్చితంగా ఆ సినిమాతో కూడా కొడతాం. ఇట్లు అర్జున్ థియేటర్లలో చూడండి. రెండున్నర గంటల ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారంటీ. ఈ సినిమా ఎంత బాగుంటే నాగార్జున గారు అంతగా భుజాన వేసుకుంటారు. వెంకీ కుడుముల ఈ సినిమాతో ప్రొడ్యూసర్‌గా మారాడు. నిజానికి తన సినిమాలంటే నాకు చాలా ఇష్టం. నాతో ఒక సినిమా చేయమని కూడా అడిగాను. మంచి కథతో వస్తానని చెప్పాడు (నవ్వుతూ). తను నిర్మాతగా కూడా మంచి విజయం సాధించాడు. మరిన్ని సినిమాలు నిర్మించాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరూ అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. అందరికీ హృదయపూర్వక అభినందనలు. జైహింద్!

కింగ్ నాగార్జున మాట్లాడుతూ.. “మీ హుషారు, ఎనర్జీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా గురించి ఇప్పటికే పలుమార్లు మాట్లాడాను. ఈ సినిమాను నేను ప్రజెంట్ చేశాను. చాలా సంతోషంగా ఉంది. అనీష్ విషయంలో చాలా గర్వంగా ఉంది. అలాగే అనస్వర, మహేష్‌తో పాటు ప్రతి ఒక్కరికీ కంగ్రాట్యులేషన్స్. ఈ వేడుకలో అనీష్ అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరినీ పిలిచి థాంక్స్ చెప్పడం నాకు చాలా నచ్చింది. తెలుగు సినిమా ప్రేక్షకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు. కొత్త టాలెంట్‌ను, కొత్తదనాన్ని వాళ్లు ఎంతో ఎంకరేజ్ చేస్తారు. చిరంజీవి గారి అబ్బాయి రామ్ చరణ్ నన్ను అన్నా అని పిలుస్తాడు. మా అబ్బాయి అఖిల్ ఏమో చిరంజీవి గారిని పెదనాన్న అంటాడు. మరి ఆయన్ని నేను ఏమని పిలవాలో అర్థం కావడం లేదు (నవ్వుతూ). సో.. ఈరోజు బాస్ ఇక్కడికి రావడం చాలా హ్యాపీగా ఉంది. రామ్ చరణ్ నన్ను అన్నా అంటాడు కాబట్టి, నేను కూడా చిరంజీవి గారిని అన్నా అని పిలుస్తాను. చిరంజీవి గారు ఈ వేడుకకు వచ్చి టీంను బ్లెస్ చేయడం చాలా ఆనందంగా ఉంది.

హీరో అనీష్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. చిరంజీవి గారి అభిమానులకు, అక్కినేని నాగార్జున గారి అభిమానులకు థాంక్యూ సో మచ్. నాగార్జున గారిది చాలా పెద్ద మనసు. ఆయనను కలిసినప్పటి నుంచి నాకు అందించిన సపోర్ట్, ప్రోత్సాహాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇది నాకు జీవితాంతం గుర్తుండిపోయే మెమరీ. ప్రతి ఇంట్లో చిరంజీవి గారి పేరు వినిపిస్తుంది. ఎవరైనా సినిమాల్లోకి వెళ్లాలన్నా, యాక్టర్ అవ్వాలన్నా ‘నువ్వు ఏమైనా చిరంజీవి అన్నా?’ అని అంటుంటారు. ఆయన ఎంతోమందికి ఇన్‌స్పిరేషన్. అలాంటి వారిలో నేను కూడా ఒకడిని. ఆయన సమక్షంలో ఈ వేదికపై నిలబడి మాట్లాడటం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. తన అమూల్యమైన సమయాన్ని కేటాయించి మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన చిరంజీవి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇట్లు అర్జున’ రెండేళ్ల జర్నీ. ఈ ప్రయాణంలో చాలా విషయాలు నేర్చుకున్నాను. మా టీమ్‌లోని ప్రతి ఒక్కరికీ థాంక్యూ. సినిమా చూసిన వాళ్లందరూ చాలా బాగుందని చెప్తున్నారు. ముఖ్యంగా యాక్షన్ బాగుందని, మ్యూజిక్ బాగుందని అభినందిస్తున్నారు. వందమంది సినిమా చూస్తే అందులో 90 మందికి అర్జున్ ప్రేమ వినిపించింది. ఈ క్యారెక్టర్ నేను చేయగలనని నమ్మిన వెంకీ అన్నకు థాంక్యూ. ఇలాంటి మంచి కథ రాసి నన్ను నమ్మిన మా డైరెక్టర్ మహేష్‌కు థాంక్యూ. ఈ జర్నీలో ఆయన నాకు ఎన్నో విషయాలు నేర్పించారు. మా సినిమాకు అద్భుతమైన మ్యూజిక్ అందించిన తమన్ ప్రతి పాట కోసం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కోసం ప్రాణం పెట్టి పనిచేశారు. ఈ సినిమా జర్నీలో నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. తారక్ అన్న, చరణ్ అన్న, నాని అన్న.. ఇలా అందరికీ థాంక్యూ. మహేష్ బాబు గారి లాంటి సూపర్‌స్టార్స్‌తో పాటు ఎంతోమంది నటీనటులు మా సినిమా గురించి ట్వీట్ చేశారు. అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ఒక కొత్త హీరో సినిమాకు ఇంత సపోర్ట్ రావడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఇంకా థియేటర్లలో మా సినిమాను చూస్తారని కోరుకుంటున్నాను. ఇది నా తొలి అడుగు. నన్ను ఇంతగా ప్రోత్సహించిన, నాపై నమ్మకం ఉంచిన నా తల్లిదండ్రులకు కృతజ్ఞతలు.

మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. చిరంజీవి గారికి, నాగార్జున గారికి ధన్యవాదాలు. ఈ మధ్యకాలంలో యూనానిమస్‌గా ఇంత మంచి రివ్యూ రావడం ‘ఇట్లు అర్జున’కు దక్కింది. అనీష్ ఈ సినిమాతో చాలా మంచి ఆరంభం చేశాడు. తనకు యూనివర్స్ మొత్తం సపోర్ట్ చేసినట్లు అనిపిస్తోంది. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు. ‘ఇట్లు అర్జున’ నా మనసుకు చాలా దగ్గరైన సినిమాల్లో ఒకటి. ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించడం చాలా ఆనందంగా ఉంది. అనస్వర రాజన్ అద్భుతంగా నటించింది. ఈ సినిమా ఆడియో ఆల్బమ్ కూడా చాలా పెద్ద హిట్ అయింది. అందరికీ థాంక్యూ. నాగార్జున గారు ఈ సినిమాకు వెన్నుముకలా నిలిచారు. తన సపోర్ట్ మొత్తం అందించారు. ఒక సినిమా సక్సెస్ అయితే ఇండస్ట్రీ మొత్తానికి సక్సెస్ వచ్చినట్టే. అందరికీ మంచి ఎనర్జీ వస్తుంది. నవంబర్‌లో చాలా మంచి విజయాలు రావడం చాలా ఆనందంగా ఉంది. బాస్ చిరంజీవి గారు ఈ వేడుకకు రావడం చాలా సంతోషంగా ఉంది. ‘కాకా’ కోసం ఇప్పుడే సాంగ్ పూర్తి చేసుకుని ఇక్కడికి వచ్చారు. నేను ఆ సినిమా వీడియో కోసం ఎదురుచూస్తున్నా. చిరంజీవి గారు ఎప్పుడూ కొత్త టాలెంట్‌ను ప్రోత్సహిస్తుంటారు. ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు.”

హీరోయిన్ అనస్వర రాజన్ మాట్లాడుతూ.. “ఇది చాలా బ్యూటిఫుల్ జర్నీ. గత కొన్ని రోజులుగా మేము థియేటర్లను విజిట్ చేస్తున్నాం. అన్ని చోట్ల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. మా సినిమాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్‌కు, ప్రొడ్యూసర్‌కు థాంక్యూ. మేము థియేటర్ విజిట్స్‌కు వెళ్లినప్పుడు అనీష్ పర్ఫార్మెన్స్‌ను ఆడియన్స్ అప్రిషియేట్ చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. తను ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. తను మరిన్ని అద్భుతమైన సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. చిరంజీవి గారు మనందరికీ ఇన్‌స్పిరేషన్. ఆయన ఈ వేడుకకు వచ్చి బ్లెస్ చేయడం మాకు ఎంతో ఆనందాన్నిచ్చింది. నాగార్జున గారు మా సినిమాను ప్రజెంట్ చేయడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఆయనతో కలిసి వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు.”

నిర్మాత వెంకీ కుడుముల మాట్లాడుతూ.. “చిరంజీవి గారికి, నాగార్జున గారికి నా కృతజ్ఞతలు. డైరెక్టర్ మహేష్ చాలా జెన్యూన్ ఫిల్మ్ మేకర్. తనని సపోర్ట్ చేయాలనిపించింది. మాటలు రాని మూగవాడి పాత్రతో ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. తన విషయంలో చాలా గర్వంగా ఉంది. అనీష్ హార్డ్ వర్క్, క్రమశిక్షణ, ప్యాషన్ చూస్తే చాలా ముచ్చటేసింది. తనతో చాలా కనెక్ట్ అయ్యాను. యాక్షన్ సీన్స్ కూడా తనే సొంతంగా చేశాడు. ఎక్కడా డూప్‌ను ఉపయోగించలేదు. తొలి సినిమాకే మూగవాడి పాత్ర కోసం ఎంతో ప్రిపరేషన్ అయ్యి అద్భుతంగా నటించాడు. సినిమా చూసిన అందరూ సర్‌ప్రైజ్ అవుతున్నారు. తన విషయంలో చాలా గర్వంగా ఉంది. తన లైఫ్‌లో చాలా దూరం వెళ్తాడు. తనని నా చేతుల మీదుగా లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాకు పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. నాగార్జున గారికి థాంక్ యు. ఆయన గైడెన్స్ మాకు ఎంతగానో హెల్ప్ అయ్యింది. చిత్రరంగంలో జీవితాంతం గుర్తుండిపోయే విజేత మా మెగాస్టార్ చిరంజీవి గారు. నేను డైరెక్టర్ కావడానికి నన్ను ఇన్‌స్పైర్ చేసిన ఒకే ఒక్క పదం ‘జై చిరంజీవ’. ఆయన నా ‘ఛలో’ సినిమాకు వచ్చి బ్లెస్ చేశారు. అలాగే ‘భీష్మ’ సినిమాను ఆయనతో కలిసి చూసే అవకాశం నాకు దక్కింది. నేను నిర్మించిన తొలి సినిమాను బ్లెస్ చేయడానికి ఆయన రావడం ఎంతో ఆనందంగా ఉంది. ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ సినిమా కలెక్షన్స్ రోజురోజుకీ పెరుగుతున్నాయి. తప్పకుండా మీరందరూ ఈ సినిమాను చూడండి. చాలా సర్‌ప్రైజ్ అవుతారు.”

డైరెక్టర్ మహేష్ ఉప్పల మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. నాగార్జున గారికి, చిరంజీవి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. నన్ను ఇంతగా నమ్మిన మా నిర్మాత వెంకీ గారికి ధన్యవాదాలు. నా మొదటి సినిమాను నాగార్జున గారు ప్రజెంట్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నాలాంటి ఎంతోమందికి స్ఫూర్తినిచ్చిన చిరంజీవి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. చిరంజీవి గారు, నాగార్జున గారి లాంటి ఇద్దరు గొప్ప వ్యక్తులు నా సినిమా చూడటం మాటల్లో చెప్పలేని ఆనందాన్ని ఇస్తోంది. నాపై ఎంతో నమ్మకం పెట్టుకుని నన్ను ప్రోత్సహించారు. ఆయన నమ్మకమే అందరినీ సర్‌ప్రైజ్ అయ్యేలా చేసింది. అనీష్ థియేటర్లలో అందరినీ సర్‌ప్రైజ్ చేశాడు. తను భవిష్యత్తులో మరెన్నో అద్భుతమైన సినిమాలు చేస్తాడు. మా టీమ్‌లోని ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.