Skip to content

‘చీన్ టపాక్ డుండుం’ నుంచి ‘మరొక్కసారి’ సాంగ్ రిలీజ్

విలేజ్ టాకీస్ బ్యానర్ మీద శ్రీను నాగులపల్లి నిర్మాణంలో శ్రీనివాస్ గవిరెడ్డి, బ్రిగిడ సాగా ప్రధాన పాత్రల్లో వై.ఎన్. లోహిత్ తెరకెక్కించిన చిత్రం ‘చీన్ టపాక్ డుండుం’. ఈ మూవీకి సంబంధించిన మ్యూజికల్ ప్రమోషన్స్‌ని ప్రారంభించారు. ఈ క్రమంలోనే ‘మరొక్కసారి’ అంటూ సాగే ఫీల్ గుడ్, లవ్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాటకు తిరుపతి జవ్వాన సాహిత్యం, పిఆర్ (పెద్దపల్లి రోహిత్) బాణీ చక్కగా కుదిరాయి. ఇక మెలోడీ పాటలకు కేరాఫ్ అడ్రస్ అయిన సింగర్ కార్తీక్ గాత్రం ఈ పాటను మరో స్థాయికి తీసుకు వెళ్లాయి.

‘మరొక్కసారి’ అంటూ సాగే ఈ పాట లిరికల్ వీడియో ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. కొరియోగ్రాఫర్ విష్ణు ప్రెజర్వర్ కంపోజ్ చేసిన హుక్ స్టెప్ కూడా బాగుంది. లీడ్ పెయిర్ ఫ్రెష్‌గా కనిపిస్తున్నారు. గ్రామీణ వాతావరణాన్ని ఈ పాటలో చక్కగా చూపించారు. ఇదొక విలేజ్, లవ్, కామెడీ ఎంటర్టైనర్‌గా రాబోతోందని పాటని చూస్తే అర్థం అవుతోంది. త్వరలోనే మేకర్స్ ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్‌ని ప్రకటించనున్నారు.

ఈ ‘చీన్ టపాక్ డుండుం’ మూవీకి సెంథిల్ కుమార్ కెమెరామెన్‌గా, ప్రవీణ్ పూడి ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు. ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పని చేస్తున్నారు. పీఆర్ పాటలకు సంగీతం అందింస్తుండగా.. సురేష్ బొబ్బిలి నేపథ్య సంగీతాన్ని అందిస్తున్నారు.

నటీనటులు : శ్రీనివాస్ గవిరెడ్డి, బ్రిగిడ సాగా

టెక్నికల్ టీం
బ్యానర్ : విలేజ్ టాకీస్
నిర్మాత : శ్రీను నాగులపల్లి
దర్శకుడు :వై.ఎన్. లోహిత్
సంగీతం : పిఆర్ (పెద్దపల్లి రోహిత్)
నేపథ్య సంగీతం : సురేష్ బొబ్బిలి
కెమెరా : సెంథిల్ కుమార్
ఎడిటర్ : ప్రవీణ్ పూడి
పీఆర్వో : వంశీ కాకా

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.