చిరంజీవి ‘కాకా’ 2027 జనవరి 13న రిలీజ్
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్లో మోస్ట్ అవైటెడ్ మూవీ #Mega158 / #ChiruBobby2, వెంకట్ కే నారాయణ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమా ప్రకటన నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా విడుదలైన టైటిల్ గ్లింప్స్ స్టైల్, యాక్షన్, రా మాస్ అప్పీల్‌తో ఆ అంచనాలను మరింత పెంచింది. కె. సత్యం, సూపర్వైజర్గా చిరంజీవి ఆక్వా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడంతో గ్లింప్స్ ప్రారంభమవుతుంది. చెన్నై టీమ్‌కు ఫోన్ చేసి లోడ్ సమయానికి వస్తుందని చెబుతూ అందరినీ పలకరిస్తారు. సునీల్ లీవ్ అడగగా, తమ టార్గెట్ ఫెస్టివల్ అని చెప్పి లీవ్‌ను తిరస్కరిస్తారు. గెటప్ శ్రీను స్కూటర్ కీస్ గురించి చెప్పగా సత్యం వాటిని విసరమని చెబుతారు. ఆ…
