బ్లాక్‌బస్టర్ చిత్రాలను నిర్మించిన పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పుడు మరో…
‘ఇట్లు అర్జున’ సినిమా విషయంలో చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాము: నాగార్జున
కింగ్ నాగార్జున సమర్పణలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇట్లు అర్జున’. అనీష్ హీరోగా పరిచయం అవుతుండగా, అనస్వర రాజన్ కథానాయికగా నటిస్తున్నారు. మహేష్ ఉప్పల ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. దర్శకుడు వెంకీ కుడుముల ఈ సినిమాతో నిర్మాతగా కూడా పరిచయం అవుతున్నారు. ఆయన కొత్తగా ప్రారంభించిన వాట్ నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలని పెంచంది. ఎస్ తమన్ అందించిన పాటలన్నీ చార్ట్ బస్టర్ అయ్యాయి. ‘ఇట్లు అర్జున’ నవంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ మ్యూజికల్ కాన్సర్ట్ నిర్వహించారు. కింగ్ నాగార్జున, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, అఖిల్ అక్కినేని ముఖ్య అతిథులు పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.
మ్యూజికల్ కాన్సర్ట్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. కింగ్ నాగార్జున గారి ఫ్యాన్స్ కి, మా అభిమానులందరికీ థాంక్యూ సో మచ్. అనీష్ హీరోగా లాంచ్ కావడం చాలా ఆనందంగా ఉంది. తన తల్లిదండ్రులు చాలా అద్భుతమైన వ్యక్తులు. అనీష్‌కు సపోర్ట్ చేసిన వాళ్ల పేరెంట్స్‌కి థాంక్స్ చెప్తున్నాను. తనకు మరో పెద్ద సపోర్ట్ కింగ్ నాగార్జున గారు. నాగార్జున గారి లాంటి సపోర్ట్ ఉంటే తప్పు జరగడానికి అవకాశం లేదు. నాగార్జున గారు ఎప్పుడూ కొత్త టాలెంట్‌ను పరిచయం చేస్తూ, ప్రోత్సహిస్తున్నారు. ఇప్పుడు అనీష్‌ను కూడా ఎంకరేజ్ చేయడం ఆనందంగా వుంది. అలాగే ఈ సినిమాతో నిర్మాతగా పరిచయం అవుతున్న వెంకీకి, డైరెక్టర్ మహేష్‌కి ఆల్ ది బెస్ట్. అనస్వర చాలా అద్భుతమైన నటి. ‘కాకా’ సినిమాలో కూడా తను చాలా ముఖ్యమైన పాత్ర చేస్తున్నారు. ‘ఇట్లు అర్జున’తో తనకు ఒక బ్లాక్‌బస్టర్ వస్తుంది. అలాగే సంక్రాంతికి ‘కాకా’తో మరో బ్లాక్‌బస్టర్ వస్తుంది. ఇది రాసి పెట్టుకోండి. తమన్ విషయానికి వస్తే.. పవన్ కళ్యాణ్ గారి ‘ఓజీ’ సినిమాకైనా, అనిష్ ‘ఇట్లు అర్జున’కైనా సమానంగా మ్యూజిక్ చేస్తారు, తన మ్యూజిక్‌తో లక్షల మందిని కనెక్ట్ చేస్తాడు. అది పెద్ద హీరోనా, చిన్న హీరోనా అనేది చూడడు. అందరికీ ఒకేలా అద్భుతమైన మ్యూజిక్ ఇస్తాడు. ఇందులో పాటలన్నీ చాలా బాగున్నాయి. అనీష్‌కి సినిమా అంటే చాలా ఫ్యాషన్. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సీన్లు నాకు చూపించాడు. నేను నా ఫస్ట్ సినిమాకు ఎలా చేశానో తెలియదు కానీ, నాకంటే పది రెట్లు బెటర్‌గా చేశాడు. తన ప్రతి సీన్‌ను చాలా అద్భుతంగా చేశాడు. తనకు కచ్చితంగా చాలా పెద్ద ఫ్యూచర్ ఉంటుంది. మూగవాడిగా నటించినప్పటికీ అన్ని నవరసాలను పలికించాడు. ప్యూర్ యాక్టింగ్ ఉంటే తప్ప అంత అద్భుతంగా చేయలేం. నేను కూడా ‘రంగస్థలం’ సినిమాలో చెవిటివాడిగా నటించాను. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అంతకంటే పెద్ద విజయం ఈ సినిమాతో అనీష్‌కు రావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా తన కెరీర్లో పెద్ద అడుగు కావాలి. తన భవిష్యత్తు విజయాలకు ఇది మంచి పునాది కావాలి. అనీష్ తన తల్లిదండ్రులను, ప్రేక్షకులను గర్వపడేలా చేస్తాడని ఆశిస్తున్నాను.
కింగ్ నాగార్జున మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. కొత్తదనాన్ని ఎప్పుడూ ఆహ్వానించే తెలుగు సినిమా ప్రేక్షకులకు థాంక్యూ. ఈ వేడుకకు వచ్చిన రామ్ చరణ్‌కి థాంక్యూ. తను చాలా హంబుల్ పర్శన్. మా పెద్దబ్బాయి తారక్ ఇక్కడికి రాలేకపోయాడు. తనుఈ సినిమా ట్రైలర్‌ను లాంచ్ చేశాడు. థాంక్యూ తారక్. అనీష్ గ్లింప్స్ తీసుకొచ్చి వాయిస్ ఓవర్ చేయమని అడిగాడు. తన సినిమాలో మూగవాడిగా నటిస్తున్నాడు. తొలి సినిమాకే ఇలాంటి ఛాలెంజింగ్ రోల్ చేయడం అవసరమా అని అడిగాను. రామ్ చరణ్ ఒక చెవిటి పాత్ర చేయడానికి పదేళ్లు పట్టింది. అఖిల్ ఆరో సినిమాకు బ్లైండ్ క్యారెక్టర్ చేశాడు. అయితే ‘ఇట్లు అర్జున’ కథ మీద అనీష్‌కు చాలా నమ్మకం ఉంది. నాకు సినిమా చూపించారు. సినిమా చూసి చాలా సర్ప్రైజ్ అయ్యాను. అనీష్ అద్భుతంగా తన పాత్రలో లీనమైపోయాడు. సినిమా చాలా బాగుంది. తన కళ్లతో మాట్లాడాడు. తన సైలెన్స్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. అద్భుతంగా పెర్ఫార్మ్ చేశాడు. అనీష్, అనస్వర కెమిస్ట్రీ సినిమాలో చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. అలాగే తమన్ ఇచ్చిన ప్రతి పాట హిట్ అయింది. నవంబర్ 13న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అనీష్ ప్రేమ మీ అందరికీ వినిపిస్తుంది. ఈ సినిమాను ప్రెజెంట్ చేయడం చాలా గర్వంగా ఉంది. సినిమా విషయంలో నేను చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. ఈ సినిమా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ థాంక్యూ సో మచ్.
హీరో అఖిల్ అక్కినేని మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. డైరెక్టర్ మహేష్ చాలా కొత్త కథ రాశారు. మాటలు లేకుండా హీరో సినిమా చేయడం అనేది చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది. అసలు దీన్ని ఎలా చేయబోతున్నారు అనుకున్నాను. నేను సినిమా చూశాను. అనీష్ చాలా అద్భుతంగా చేశాడు. సినిమాను కూడా చాలా అద్భుతంగా తీశారు. ఇది చాలా కమర్షియల్ సినిమా. థియేటర్లో చాలా అద్భుతంగా ఉంటుంది. అనీష్, అనస్వర కెమిస్ట్రీ ఈ సినిమాలో చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. తమన్ నాకు ‘లెనిన్’ సినిమాకు ఇచ్చినట్టే ‘ఇట్లు అర్జున’కు కూడా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా ఉంది. అనీష్ సినిమా కోసం చాలా కష్టపడతాడు. తనకు సినిమా అంటే చాలా గౌరవం. తన తొలి సినిమాకే ఇంత అద్భుతంగా చేయడం చాలా ఇన్స్పిరేషన్గా ఉంది. ఈ సినిమా గట్టిగా కొట్టబోతున్నాడు. అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్.
హీరో అనీష్ మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. అక్కినేని ఫ్యాన్స్‌కి, మెగా ఫ్యాన్స్‌కి థాంక్యూ. తమన్ గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ప్రతి పాట ఒక బ్యాంగర్ గా నిలిచింది. నన్ను ఇంతగా బిలీవ్ చేసిన నిర్మాత వెంకీ అన్నకి థాంక్యూ. మా ప్రొడక్షన్ టీమ్‌లోని ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. నన్ను నమ్మి ఇంత మంచి కథ రాసిన డైరెక్టర్ మహేష్‌కి థాంక్యూ. ఆయన నాకు ఎంతో సపోర్ట్ చేశారు. అలాగే మా డీఓపీ రాజా గారు మీ అందరినీ సర్ప్రైజ్ చేస్తారు. మా టీమ్ మెంబర్స్ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. అఖిల్ అన్నకి థాంక్యూ. నాగార్జున గారు తన అనుభవంతో మాకు ఎన్నో విషయాలు నేర్పించారు. ఆయన మా సినిమాను ప్రెజెంట్ చేయడం చాలా గర్వంగా ఉంది. చరణ్ అన్న అంటే నాకు చాలా ఇష్టం. ఆయన ఒక నటుడిగా ఎంతో స్ఫూర్తినిస్తుంటారు. ఈ వేడుకకు ఆయన రావడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. అలాగే మా ట్రైలర్ లాంచ్ చేసిన తారక్ అన్నకి థాంక్యూ. ఆయన చెప్పిన ప్రతి మాట నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చింది. చాలా కష్టపడి ఈ సినిమా చేశాను. ఆ కష్టాన్ని మీరు నవంబర్ 13న చూస్తారు. ఈ సందర్భంగా నా తల్లిదండ్రులకు కృతజ్ఞతలు. ఇది నా తొలి సినిమా. ఇంకా చాలా నేర్చుకోవాలి, చాలా దూరం వెళ్లాలి. ఇది నా తొలి అడుగు మాత్రమే. మీరందరూ నవంబర్ 13న థియేటర్‌కు వచ్చి సినిమా చూసి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. అర్జున్ మాట్లాడలేకపోవచ్చు కానీ, తన ప్రేమ మీ అందరికీ వినిపిస్తుంది.
హీరోయిన్ అనస్వర రాజన్ మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. మా టీమ్‌లోని ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. అందరూ అద్భుతంగా సపోర్ట్ చేశారు. తమన్ గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. మాకు ఎంతో సపోర్ట్ చేశారు. డైరెక్టర్ మహేష్ గారు చాలా గొప్ప విజన్‌తో ఈ సినిమాను తీశారు. అనీష్ ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశారు. అర్జున్ క్యారెక్టర్‌కు తన బెస్ట్ ఇచ్చారు. కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. నాగార్జున గారు ఈ సినిమాను ప్రెజెంట్ చేయడం నాకు మరింత ఆనందాన్ని ఇచ్చింది. ఇందులో నేను చేసిన కీర్తి క్యారెక్టర్ ప్రేక్షకుల మనసులకు చాలా దగ్గరవుతుంది. తప్పకుండా ఈ సినిమాను అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను.
మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. మూగవాడిగా ఒక సినిమా చేయడం అనేది చాలా ఛాలెంజ్. అలాంటి ఛాలెంజ్‌ను తన తొలి సినిమాకే అనీష్ తీసుకున్నాడు. నేను కూడా మ్యూజికల్‌గా ఛాలెంజ్ తీసుకున్నాను. పాటలన్నింటినీ ప్రేక్షకులు చాలా బాగా ఆదరించారు. ఇది చాలా సర్ప్రైజింగ్ ఫిల్మ్. ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ మహేష్‌కి, నిర్మాత వెంకీకి థాంక్యూ. ఈ వేడుకకు వచ్చిన చరణ్ గారికి, అఖిల్‌కి, నాగార్జున గారికి థాంక్యూ. ఈ మ్యూజికల్ కాన్సర్ట్ కోసం పనిచేసిన నా టీమ్‌లోని ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది.
నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ: ఈ వేడుక చూస్తుంటే కన్నుల పండుగగా ఉంది. ఎన్టీఆర్ గారు ఈ సినిమాను ప్రశంసించారు. తెలుగు సినిమాలో చాలాకాలం గుర్తుండిపోయే సినిమా అవుతుందని ఆయన చెప్పడం చాలా సంతోషంగా అనిపించింది. ఆయన మాటలు విన్నాక ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకం కలిగింది. అనిష్ చాలా అద్భుతంగా చేశాడు. సినిమాకు చాలా మంచి బ్లెస్సింగ్స్ ఉన్నాయి. సినిమా కూడా చాలా అద్భుతంగా వచ్చిందని విన్నాను. 13న మా సినిమా కూడా వస్తోంది. దానికంటే ఇంకా బెటర్ గా చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
TFDC చైర్మన్, నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. కొత్త దర్శకులను, కొత్త హీరోలను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్న నాగార్జున గారికి ధన్యవాదాలు. అనిష్ కొత్త హీరోలా లేడు పాటలు గ్లింప్స్ లో అద్భుతంగా ఉన్నాడు. ఈ సినిమా కోసం వెంకీ కుడుముల, తమన్ ఇలా అద్భుతమైన టీమ్ పనిచేశారు. ఈ సినిమా నవంబర్ 13న థియేటర్లలోకి వస్తుంది. మంచి కంటెంట్‌తో వస్తున్న ఈ సినిమాకు మంచి సక్సెస్ ఇద్దాం. టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్.
నిర్మాత వెంకీ కుడుముల మాట్లాడుతూ: మాటలు లేకుండా సినిమా అనుకున్నప్పుడు అందరూ రిస్క్ అని అన్నారు. ఈ సందర్భంగా నాగార్జున గారి గురించి చెప్పాలి. ఆయన తన కెరీర్లోనే ఎక్కువ రిస్క్ తీసుకున్న హీరో. స్టార్ హీరో అయి ఉండి కూడా ఎంతోమంది కొత్తవారితో పని చేశారు. అలా ఆయన రిస్క్ తీసుకోవడం వల్ల మాకు ‘శివ’ లాంటి క్లాసిక్ సినిమా వచ్చింది. అలాగే అఖిల్ గారు కూడా వైవిధ్యమైన సినిమాలు చేస్తున్నారు. ఈ సంవత్సరం ‘లెనిన్’ లాంటి సినిమాతో సూపర్ బ్లాక్‌బస్టర్ కొట్టారు. అలాగే మెగాస్టార్ గారి లెగసీ కంటిన్యూ చేయడానికి చరణ్ గారు సినిమాల్లోకి రావడం కూడా చాలా పెద్ద రిస్క్. తన హార్డ్ వర్క్, డెడికేషన్‌తో చిరంజీవి గారి అభిమానులు, ప్రేక్షకులు గర్వంగా ఫీల్ అయ్యే స్థాయిలో ఉన్నారు. వీళ్లందరూ రిస్క్ తీసుకుని, హార్డ్ వర్క్ చేసి ఇక్కడి వరకు వచ్చారు. వీళ్లందరినీ చూస్తున్నప్పుడు మేము ఎందుకు రిస్క్ తీసుకోకూడదు అనిపించింది. అనీష్ తన తొలి సినిమాకే డైలాగులు లేకపోయినా, తన ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్‌ను ప్రేక్షకులు చూస్తారనే కాన్ఫిడెన్స్‌తో ఈ సినిమా చేశాడు. అలాగే మహేష్ కూడా చాలా అద్భుతమైన కథ రాసుకున్నాడు. తమన్ గారు ఇచ్చిన మ్యూజికే మా సినిమాకు ఇన్విటేషన్ అయింది. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి టెక్నీషియన్‌కు థాంక్యూ. నవంబర్ 13న అందరూ ఈ సినిమాను థియేటర్లలో చూడాలని కోరుకుంటున్నాను.
డైరెక్టర్ మహేష్ మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. ఇప్పటివరకు విడుదలైన ప్రతి కంటెంట్‌ను ఆడియన్స్ ఎంకరేజ్ చేశారు. అనీష్ డైరెక్టర్ ఏం చెప్పారో, ఆ పాత్రకు తగ్గట్టుగా చేశాడు. డైలాగులు లేకుండా కూడా యాక్షన్ చేశాడు. తన క్యారెక్టర్‌కు పూర్తి న్యాయం చేశాడు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. తమన్ గారు అద్భుతమైన పాటలు ఇచ్చారు. ఆర్ఆర్ ఇంకా అద్భుతంగా ఉంటుంది. నాగార్జున గారికి, అఖిల్ గారికి, చరణ్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. నాగార్జున గారు ఇచ్చిన సజెషన్స్ సినిమాకు చాలా హెల్ప్ అయ్యాయి. నవంబర్ 13న ఈ సినిమా మీ ముందుకు వస్తుంది. తప్పకుండా అందరూ థియేటర్లలో చూడాలని కోరుకుంటున్నాను.
డీఓపీ రాజా మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. ‘ఇట్లు అర్జున’ నా తొలి తెలుగు సినిమా. ఇది నాకు చాలా స్పెషల్. వెంకీ కుడుముల గారి ద్వారా నాకు ఈ అవకాశం వచ్చింది. ఈ సందర్భంగా ఆయనకు ధన్యవాదాలు. అలాగే డైరెక్టర్ మహేష్ గారికి, అనీష్‌కు థాంక్యూ. వాళ్లు నా నమ్మకాన్ని నిలబెట్టారని అనుకుంటున్నాను. తమన్ గారి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో సినిమా నెక్స్ట్ లెవల్‌కు వెళ్లింది. నాగార్జున గారు ఈ సినిమాలో భాగం కావడం వల్ల సినిమా మరో స్థాయికి వెళ్లింది. ఆయన కొత్తవాళ్లకు అవకాశాలు ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఆయన అవకాశాలు ఇవ్వడం వల్లే ‘కింగ్ 100’ సినిమా కూడా చేస్తున్నాను. ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు. తప్పకుండా ఈ సినిమాను మీరందరూ థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ వేడుకలో మూవీ యూనిట్ అందరూ పాల్గొన్నారు.

