Skip to content

‘RX’ మూవీ రెజీనా కసాండ్రా ఫస్ట్ లుక్ రిలీజ్

భారతీయ సినిమా రంగంలోని రెండు ప్రముఖ సంస్థలు చేతులు కలిపి ఓ ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాయి. దర్శకుడు లోకేష్ కనగరాజ్‌ G Squad, ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి ‘RX’ చిత్రాన్ని రూపొందిస్తోంది. రెజీనా కసాండ్రా, నాజర్, రమేష్ తిలక్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను దీపావళి సందర్భంగా విడుదల చేశారు.

వివిధ భాషల్లో తన నిర్మాణ సంస్థ పరిధిని విస్తరిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్, తమిళ చిత్రసీమలోనూ తనదైన ముద్ర వేస్తోంది. అజిత్ కుమార్ నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’, ‘ Modha Rathri’ వంటి చిత్రాలతో తమిళంలోనూ అలరించింది. వివిధ భాషల్లో సినిమాలు నిర్మిస్తూ పాన్ ఇండియా స్థాయిలో తన నిర్మాణ ప్రస్థానాన్ని విస్తరించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది.

‘RX’ కోసం లోకేష్ కనగరాజ్‌కు చెందిన G Squadతో కలిసి పనిచేయడం ద్వారా విభిన్నమైన కథలను ప్రోత్సహించడంతో పాటు, కొత్త క్రియేటివ్ పార్ట్‌నర్‌షిప్స్‌కు మద్దతు ఇవ్వాలనే మైత్రీ మూవీ మేకర్స్ నిబద్ధత మరోసారి స్పష్టమవుతోంది.

‘RX’ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో రెజీనా కసాండ్రా ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ‘ట్రూత్ ఆల్వేస్ డిమాండ్స్ ఎ వాయిస్!’ అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో విడుదలైన ఈ పోస్టర్ మిస్టరీ, ఉత్కంఠను పెంచుతోంది.

ప్రింటెడ్ బ్లౌజ్‌తో కూడిన సంప్రదాయ మస్టర్డ్ ఎల్లో కలర్ చీరలో రెజీనా రద్దీగా ఉన్న రైలులో ప్రయాణికుల మధ్య నిలబడి కనిపిస్తున్నారు. ఆమె ముఖంలో కనిపిస్తున్న సీరియస్‌నెస్ ఏదో ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్న పాత్రలా అనిపిస్తోంది. పోస్టర్‌పై కనిపించే ECG తరహా గీతలు కూడా సస్పెన్స్‌ను మరింత పెంచుతున్నాయి. రెజీనా పవర్‌ఫుల్ లుక్ ఆమె పాత్రపై ఆసక్తిని కలిగిస్తోంది. పోస్టర్ డిజైన్ చూస్తుంటే ఈ సినిమా రా అండ్ రియలిస్టిక్, గ్రిప్పింగ్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అందించనుందని అనిపిస్తోంది.

‘సిల నేరంగళిల్ సిల మనిధర్గల్’, ‘బాంబ్’ వంటి చిత్రాలతో తనదైన కథన శైలికి గుర్తింపు తెచ్చుకున్న విశాల్ వెంకట్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. హరిహరన్ రాజు అందించిన కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఆశమీర అయ్యప్పన్ సంభాషణలు రాశారు.

ఈ చిత్రంలో నాజర్, రమేష్ తిలక్, శ్రీజ రవి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తుండగా, ఎస్.కె. సెల్వకుమార్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జి.కె. ప్రసన్న ఎడిటర్‌గా, కె. మనోజ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.

ప్రతిష్టాత్మక మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని లోకేష్ కనగరాజ్ G Squadతో కలిసి నిర్మిస్తున్నారు. ప్రదీప్ భూపతి కో-ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ మొత్తాన్ని చెన్నైలో పూర్తి చేశారు. దీంతో ప్రధాన చిత్రీకరణ విజయవంతంగా ముగిసింది.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ అనుభవం, లోకేష్ కనగరాజ్ క్రియేటివ్ ఇనిషియేటివ్ G Squad, విశాల్ వెంకట్ నేతృత్వంలోని ప్రతిభావంతమైన బృందం.. ఇలా ఆసక్తికరమైన కలయికలో ‘RX’ రూపొందుతోంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన అప్‌డేట్స్ త్వరలో వెల్లడించనున్నారు.

నటీనటులు: రెజీనా కసాండ్రా, నాజర్, రమేష్ తిలక్

సాంకేతిక బృందం:
బ్యానర్లు: మైత్రీ మూవీ మేకర్స్, G Squad
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, లోకేష్ కనగరాజ్
దర్శకత్వం: విశాల్ వెంకట్
కథ: హరిహరన్ రాజు
సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్
సినిమాటోగ్రఫీ: సెల్వకుమార్ ఎస్.కె.
ఎడిటర్: ప్రసన్న జి.కె.
ఆర్ట్ డైరెక్టర్: మనోజ్ కుమార్ కె.
సంభాషణలు: ఆశమీర అయ్యప్పన్
చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: ఎ. జై సంపత్, దినేష్ నరసింహన్
కో-ప్రొడ్యూసర్: ప్రదీప్ భూపతి
కాస్ట్యూమ్స్: జీవా కరుణ్య
పబ్లిసిటీ డిజైనర్: వియాకి
మార్కెటింగ్: ఫస్ట్ షో
పీఆర్వో: వంశీ-శేఖర్

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.