Skip to content

‘ఇట్లు అర్జున’ ప్రేక్షకుల ఆశీస్సులు పొందడం నిజంగా గొప్ప విషయం: మెగాస్టార్ చిరంజీవి

అనీష్‌ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. ఇంత గొప్ప విజయాన్ని అందించిన తెలుగు సినిమా ప్రేక్షకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు: కింగ్ నాగార్జున కింగ్ నాగార్జున సమర్పణలో వచ్చిన లేటెస్ట్ హార్ట్‌బస్టర్ ‘ఇట్లు అర్జున’. అనీష్ హీరోగా పరిచయమైన ఈ చిత్రంలో అనస్వర రాజన్ కథానాయికగా నటించింది. మహేష్ ఉప్పల ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. దర్శకుడు వెంకీ కుడుముల వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘ఇట్లు అర్జున’ నవంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న నేపథ్యంలో చిత్ర బృందం థాంక్ యూ మీట్ నిర్వహించింది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరైన ఈ వేడుక…

Read more

కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన చిరంజీవి, రాంచరణ్ ఏఐ, డీప్‌ ఫేక్‌లను అరికట్టాలని వినతి

కళాకారులను లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన, మార్ఫింగ్ చేసిన వీడియోలను రూపొందించడంపై ఇటీవల ఎక్స్‌ వేదికగా తన ఆందోళనను వ్యక్తం చేసిన మెగాస్టార్ చిరంజీవి.. ఈ అంశంపై మరో కీలక అడుగు వేశారు. ఈ రోజు హైదరాబాద్‌లో గౌరవ కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా గారిని కలిసి, ఏఐ దుర్వినియోగం, డీప్‌ఫేక్ సమస్యలను వివరించారు. ఈ భేటీలో చిరంజీవి గారితో పాటు రామ్ చరణ్ కూడా పాల్గొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్‌ఫేక్ టెక్నాలజీలను దుర్వినియోగం చేస్తున్న తీరును స్వయంగా వివరించేందుకు చిరంజీవి ఈ భేటీకి అపాయింట్‌మెంట్ కోరారు. ఈ సాంకేతికతల దుర్వినియోగం కళాకారుల హక్కులు, గౌరవం, క్రియేటివ్ కంటెంట్‌కు ముప్పుగా మారుతోందని ఆయన వివరించారు. ఈ సమస్యను కేవలం సోషల్ మీడియా వేదికకే…

Read more

చిరంజీవి ‘చిరంజీవీస్ మెగావర్స్’తో నెట్‌ఫ్లిక్స్‌లోకి ఎంట్రీ

దశాబ్దాలుగా తన అద్భుతమైన నటనతో భారతీయ సినిమా ప్రేక్షకులని అలరిస్తున్న మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు మరో కొత్త శకంలోకి అడుగుపెడుతున్నారు. ‘చిరంజీవీస్ మెగావర్స్’తో నెట్‌ఫ్లిక్స్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. భారతీయ సినిమాలో అత్యంత అభిమానాన్ని సంపాదించుకున్న దిగ్గజాల్లో ఒకరైన చిరంజీవి, ప్రపంచంలోనే ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌తో చేతులు కలపడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆసక్తికరమైన సంభాషణలు, ఆకట్టుకునే కథలు, చిరంజీవి చరిష్మా, చమత్కారం, తరతరాల ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయన ప్రత్యేకమైన వ్యక్తిత్వంతో ఈ షో సాగనుంది. ఇది ఆయన సుదీర్ఘ సినీ ప్రస్థానానికి మరో ప్రత్యేకమైన కోణాన్ని జోడించనుంది. తరతరాల ప్రేక్షకులతో విడదీయలేని అనుబంధం కలిగిన మెగాస్టార్ చిరంజీవి తన ఆప్యాయత, స్పాంటినిటీ, ఆకట్టుకునే వ్యక్తిత్వంతో ఈ కొత్త వేదికపై కనిపించనున్నారు. దీంతో ప్రేక్షకులు…

Read more

‘రౌడీ అల్లుడు’ 35 ఇయర్స్ సెలెబ్రేషన్స్

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ‘రౌడీ అల్లుడు’ చిత్రానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. తెలుగు సినిమా చరిత్రలోనే చిరస్మరణీయమైన కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లలో ఒకటైన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ నిర్మించిన సంగతి తెలిసిందే. 'రౌడీ అల్లుడు' 35 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గీతా ఆర్ట్స్ సంస్థలో ప్రత్యేకంగా వేడుకల్ని నిర్వహించారు. 1991లో విడుదలైన 'రౌడీ అల్లుడు' చిరంజీవి కామెడీ టైమింగ్, స్టైల్, స్వాగ్, డ్యాన్స్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. ఆయన ద్విపాత్రాభినయం, చిత్రంలోని ఆసక్తికరమైన కథనం, గుర్తుండిపోయే సంగీతం కలసి ‘రౌడీ అల్లుడు’ ప్రేక్షకుల అభిమాన చిత్రంగా నిలిచిపోయింది. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో సత్యానంద్ రచనతో రూపొందిన ఈ చిత్రం తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిలుపుకుంది. గీతా…

Read more

డీవోపీ విజయ్ కార్తీక్ కన్నన్ ను అభినందించిన చిరంజీవి

బ్లాక్‌బస్టర్ ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ బాబీ కొల్లి మరోసారి కలిసి చేస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కాకా’. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కే నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలను నెలకొల్పుతోంది. టైటిల్ గ్లింప్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి విజయ్ కార్తీక్ డీవోపీ పని చేస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి, విజయ్ కార్తీక్, ఆయన టీమ్‌ను అభినందించారు. విజయ్ కార్తీక్ డీవోపీ గా పని చేసిన జైలర్ 2 ఇటీవలే విడుదలై విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా జైలర్ 2 కోసం వారు చేసిన అద్భుతమైన వర్క్ ను ప్రశంసించారు మెగాస్టార్. ప్రస్తుతం కాకా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో…

Read more

‘కాకా’ కీలక పాత్రలో అనురాగ్ కశ్యప్

బ్లాక్‌బస్టర్ ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ బాబీ కొల్లి మరోసారి కలిసి చేస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కాకా’. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కే నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలను నెలకొల్పుతోంది. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా బాలీవుడ్ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్ 'కాకా' చిత్రంలోకి అడుగుపెట్టారు. సినిమాలో ఆయన కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. అనురాగ్ కశ్యప్ చిత్రంలో భాగమైన విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ఫొటోలో దర్శకుడు బాబీ కొల్లి అనురాగ్ కశ్యప్‌కు ఓ సన్నివేశాన్ని వివరిస్తుండగా, ఆయన ఎంతో ఏకాగ్రతతో వింటూ కనిపించారు. అనురాగ్…

Read more

సింగీతం శ్రీనివాసరావు గారు మరణం లేని మహనీయుడు: అశ్వినీదత్

దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గారి మరణం పట్ల ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సింగీతం శ్రీనివాసరావు గారి మృతికి సంతాపం తెలియజేస్తూ భావోద్వేగంతో నివాళులు అర్పించారు. ''తెలుగు సినిమాకే వెలుగులు పంచిన విజయా సంస్థ దర్శక వారసుడు సింగీతం శ్రీనివాసరావు గారు వెళ్ళిపోయారు. గుండె కలచివేసింది. కళ్ళు చెమర్చాయి. కళాఖండాలను రూపొందించినా, నిరాడంబరుడిగానే చివరివరకూ మసలిన దార్శనిక ముని ఆయన. ఒకప్పుడు ఆయనతో చేద్దామనుకున్నా కథ కలిసి రాలేదు. కానీ నా కల ఆగిపోలేదు. 'సింగ్ గీతం' రూపంలో వైజయంతీ పతాకం మీద శాశ్వతంగా వెలుగుతూనే ఉంటుంది. మరణం లేని మహనీయుడు. ఆయనకి నా కన్నీటి వీడ్కోలు'' -అశ్వినీదత్ చలసాని

Read more

‘సిగ్మా’ ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని నమ్ముతున్నాను: చిరంజీవి

సందీప్ కిషన్ యాక్షన్-అడ్వెంచర్ హీస్ట్ కామెడీ ఎంటర్టైనర్ ‘సిగ్మా’. ఈ సినిమాతో జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఫారియా అబ్దుల్లా హీరోయిన్. ప్రతిష్టాత్మక లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించిన ఈ చిత్రంపై ప్రమోషనల్ కంటెంట్‌తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. కోస్తాంధ్ర, తెలంగాణలో మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ లిమిటెడ్ ఈ చిత్రాన్ని విడుదల చేస్తుండగా, సీడెడ్ ప్రాంతంలో ఎన్వీఆర్ సినిమా విడుదల చేస్తుంది. అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది. ప్రీరిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ...అందరికీ నమస్కారం. నేను నేరుగా కాకా షూటింగ్…

Read more

మెగాస్టార్ చిరంజీవి ‘కాకా’ డబ్బింగ్ ప్రారంభం

బ్లాక్‌బస్టర్ ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ బాబీ కొల్లి మరోసారి కలిసి చేస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కాకా’. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కే నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలను నెలకొల్పుతోంది. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ‘కాకా’ డబ్బింగ్ పనులు పూజా కార్యక్రమంతో ప్రారంభమయ్యాయి. షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఏకకాలంలో శరవేగంగా జరుగుతున్నాయి. THE BLOODY BENCHMARK సెట్ చేసేందుకు చిత్ర బృందం ఫుల్ స్పీడ్‌లో వర్క్ చేస్తోంది. ఈ చిత్రంలో అనస్వర రాజన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఎస్. థమన్ సంగీతం అందిస్తుండగా, విజయ్ కార్తీక్ కన్నన్…

Read more

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కాకా’- కదిరి కాళిదాసుగా తన పాత్ర పేరును లీక్ చేసిన మెగాస్టార్

బ్లాక్‌బస్టర్ ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ బాబీ కొల్లి మరోసారి కలిసి చేస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కాకా’. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కే నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలను నెలకొల్పుతోంది. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచే అప్‌డేట్ వచ్చింది. ఓ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి స్వయంగా తన క్యారెక్టర్ పేరును రివీల్ చేశారు. ‘కాకా’లో చిరంజీవి ‘కదిరి కాళిదాస్’గా కనిపించబోతున్నారు. ఈ పవర్‌ఫుల్ పేరు వినగానే సినిమాలో ఆయన క్యారెక్టర్ ఎలా ఉండబోతుందనే ఆసక్తి మరింత పెరుగుతోంది. ‘కాకా’ హై-ఇంటెన్సిటీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ…

Read more