Skip to content

‘గీతాంజలి’ నాగార్జున బర్త్‌డే సందర్భంగా 4Kలో ఆగస్టు 28న వరల్డ్‌వైడ్ రీ-రిలీజ్

కింగ్ నాగార్జున ఎవర్‌గ్రీన్ క్లాసిక్స్‌లో ఒకటి’ గీతాంజలి’. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన ఈ క్లాసిక్ లవ్‌స్టోరీ ఇప్పుడు మరోసారి థియేటర్లలో తన మ్యాజిక్‌ను చూపించడానికి రెడీ అవుతోంది. ఆగస్టు 28న నాగార్జున బర్త్‌డే సందర్భంగా ‘గీతాంజలి’ తెలుగు, తమిళ భాషల్లో 4K ఫార్మాట్‌లో ప్రపంచవ్యాప్తంగా రీ-రిలీజ్ కానుంది. రక్షాబంధన్ స్పెషల్ కూడా కావడంతో ఈ రీ-రిలీజ్ మరింత ప్రత్యేకంగా మారింది. శ్రీ పద్మిని సినిమాస్ బ్యానర్‌పై బూర్లె శివ ప్రసాద్ ఈ ఎవర్‌గ్రీన్ క్లాసిక్‌ను లేటెస్ట్ టెక్నాలజీతో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

‘గీతాంజలి’ అంటే ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తొచ్చేది అందమైన ప్రేమకథ, మనసును తాకే సంగీతం, అద్భుతమైన విజువల్స్, గుర్తుండిపోయే పెర్ఫార్మెన్స్. నాగార్జునను ఎంతో చార్మింగ్‌గా, ఎమోషనల్‌గా చూపించిన ఈ సినిమా ఆయన కెరీర్‌లోనే ప్రత్యేకమైన చిత్రంగా నిలిచింది. మణిరత్నం తనదైన స్టోరీటెల్లింగ్‌తో ఈ ప్రేమకథను ఒక అందమైన కవితలా తెరకెక్కించారు. ఇళయరాజా అందించిన సంగీతం సినిమాకు మరో బలంగా నిలిచి ‘గీతాంజలి’ని క్లాసిక్‌గా మార్చింది. నాగార్జున సరసన గిరిజ హీరోయిన్‌గా నటించారు.

ఈసారి 4K ఫార్మాట్‌లో ‘గీతాంజలి’ని చూడటం ఈ రీ-రిలీజ్‌లో ప్రధాన ఆకర్షణ కానుంది. మరింత క్లారిటీ, డీటెయిలింగ్‌తో విజువల్స్‌ను ప్రేక్షకులు కొత్త అనుభూతితో ఎక్స్‌పీరియన్స్ చేయబోతున్నారు. అప్పట్లో థియేటర్లలో ‘గీతాంజలి’ని చూసిన వారికి ఇది మరోసారి ఆ రోజులను గుర్తుచేసే నాస్టాల్జిక్ జర్నీ కానుంది. ఇక ఈ సినిమాను థియేటర్లలో చూడని నేటి జనరేషన్‌కు మాత్రం ఒక ఎవర్‌గ్రీన్ క్లాసిక్‌ను బిగ్ స్క్రీన్‌పై ఎక్స్‌పీరియన్స్ చేసే అవకాశం దక్కనుంది. ఆగస్టు 28న 4Kలో ‘గీతాంజలి’ మరోసారి థియేటర్లలో మ్యాజిక్ క్రియేట్ చేయనుంది.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.