Skip to content

#KA13 టైటిల్ ‘రియాలిటీ’- ఫుల్ మీల్ ఫీస్ట్ టైటిల్ గ్లింప్స్ రిలీజ్

హీరో కిరణ్ అబ్బవరం వరుస విజయాల తర్వాత మరో విభిన్నమైన ప్రయత్నంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘క’, ‘కె-రాంప్’ చిత్రాల విజయాల తర్వాత ఆయన తన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా #KA13 చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వ బాధ్యతలు కూడా కిరణ్ అబ్బవరం స్వయంగా చేపట్టడంతో పాటు హీరోగా నటిస్తున్నారు. జాయ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై సుధాకర్ చాగంటి నిర్మిస్తుండగా, సురేష్ యెర్రా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. మచిలీపట్నంలో చిత్రీకరణ జరుగుతోంది. ఇప్పటికే విడుదలైన క్విర్కీ ఫస్ట్ లుక్ అనౌన్స్‌మెంట్ ఆసక్తిని పెంచగా, ఆ తర్వాత వచ్చిన బీహైండ్ ది సీన్స్ వీడియో షూటింగ్ సెట్‌లోని సందడి వాతావరణాన్ని చూపించింది. తాజాగా మేకర్స్ సినిమా టైటిల్‌ను ప్రకటిస్తూ విడుదల చేసిన గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఈ సినిమాలో ఆనందం అనే బాధ్యతగల యువకుడిగా కిరణ్ అబ్బవరం కనిపించనున్నారు. ఎంతో అంకితభావంతో ఆనందం హోటల్ నడుపుతూ, తన చేతులతో వండిన ఆహారాన్ని అందరికీ వడ్డించడంలోనే ఆనందాన్ని వెతుక్కుంటుంటాడు. జీవితంలో తనకు నిజమైన హై ఎప్పుడు వస్తుందో కూడా అతను చాలా సింపుల్‌గా చెబుతాడు. తన కుటుంబానికి ఉన్న అప్పులన్నీ తీర్చిన రోజే తనకు అసలైన హై అని అంటాడు. ఈ ఆలోచన మధ్యతరగతి కుటుంబాల జీవితాలకు ఎంతో దగ్గరగా అనిపిస్తుంది. అందుకే సినిమాకు ‘రియాలిటీ’ అనే టైటిల్ కూడా కథకు చక్కగా సరిపోయేలా ఉంది.

ఫ్యామిలీ ఆడియన్స్ పల్స్‌ను బాగా అర్థం చేసుకున్న కిరణ్ అబ్బవరం, నిత్య జీవితంలోని సాధారణ పరిస్థితుల ఆధారంగా కథను రూపొందించినట్లు గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది. సింపుల్‌గా కనిపించే సన్నివేశాల్లోనే బలమైన ఎమోషన్‌ను చూపించారు. తన అప్పులన్నీ తీర్చేశానంటూ స్నేహితులతో ఆనందాన్ని పంచుకునే సన్నివేశం, ఆ తర్వాత టెర్రస్‌పై కుటుంబ సభ్యులతో కలిసి అప్పడాలు చేసుకుంటూ గడిపే సన్నివేశాలు కుటుంబ బంధాలు, ఆనందం, అనుబంధాల విలువను హైలైట్ చేస్తున్నాయి.

నటుడిగా కూడా కిరణ్ అబ్బవరం తన పాత్రలో పూర్తిగా ఒదిగిపోయారు. కుటుంబాన్ని చూసుకునే బాధ్యతగల యువకుడిగా ఆయన పాత్ర సహజంగా, ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఉంది. దేవికా భట్ కథానాయికగా నటిస్తుండగా, శరత్ కుమార్, సాయికుమార్, రోహిణి, అన్నపూర్ణమ్మ, సుధర్శన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

సినిమాటోగ్రాఫర్ విశ్వాస్ డేనియల్ కథా ప్రపంచాన్ని ప్రేక్షకులు లీనమయ్యేలా చిత్రీకరిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం సినిమాకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తీసుకొస్తోంది. ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపించిన భజ గోవిందం ట్రాక్ గ్లింప్స్‌లోని ఫీల్‌గుడ్ మూమెంట్స్‌ను మరింత ఎలివేట్ చేసింది. జాయ్ ఫిల్మ్స్ నిర్మాణ విలువలు కథకు తగినట్టుగా ఉన్నతంగా ఉన్నాయి. సుధీర్ మాచర్ల ప్రొడక్షన్ డిజైనర్‌గా, సంతోష్ నాయుడు ఎడిటర్‌గా, రాజేష్ కామర్సు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు.

‘రియాలిటీ’ టైటిల్ గ్లింప్స్ ఫుల్ మీల్ ఫీస్ట్‌లా అనిపించింది. కథలోని రిలేటబుల్ వరల్డ్, కుటుంబ భావోద్వేగాలు, సాధారణ జీవితంలోని ఆనందాలను గ్లింప్స్ ఆసక్తికరంగా పరిచయం చేసింది. దీంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

‘రియాలిటీ’ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25, 2026న థియేటర్లలో విడుదల కానుంది.

తారాగణం: కిరణ్ అబ్బవరం, దేవికా భట్, శరత్ కుమార్, సాయి కుమార్, రోహిణి, అన్నపూర్ణమ్మ, సుదర్శన్

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: కిరణ్ అబ్బవరం
నిర్మాత: సుధాకర్ చాగంటి
బ్యానర్: జాయ్ ఫిల్మ్స్
సహ నిర్మాత: సురేష్ యర్రా
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
DOP: విశ్వాస్ డేనియల్
ప్రొడక్షన్ డిజైనర్: సుధీర్ మాచర్ల
ఎడిటర్: సంతోష్ నాయుడు
కాస్ట్యూమ్ డిజైనర్: రాజేష్ కామర్సు
PRO: వంశీ-శేఖర్
మార్కెటింగ్: వాల్స్ & ట్రెండ్స్

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.