‘రియాలిటీ’ చిత్రం నుంచి ‘భజ గోవిందం’ వీడియో సాంగ్ రిలీజ్
ప్రామిసింగ్ హీరో కిరణ్ అబ్బవరం తన ప్రతిష్టాత్మక చిత్రం ‘రియాలిటీ’తో నిత్యజీవితంలోని సహజమైన భావోద్వేగాలను, మన చుట్టూ ఉండే చిన్న చిన్న ఆనందాలను అందంగా ప్రజెంట్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ‘క’, ‘కె-రాంప్’ చిత్రాల విజయాలతో జోరుమీదున్న ఆయన, ఈ సినిమాకు హీరోగా నటించడంతో పాటు కథ, స్క్రీన్‌ప్లే అందించి దర్శకత్వం కూడా వహిస్తున్నారు. తన కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని జాయ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై సుధాకర్ చాగంటి నిర్మిస్తుండగా, సురేష్ యెర్రా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మేకర్స్ తాజాగా ఈ సినిమా సంగీత ప్రయాణాన్ని ప్రారంభిస్తూ తొలి పాట ‘భజ గోవిందం’ ఫుల్ వీడియోను విడుదల చేశారు. గతంలో విడుదలైన టైటిల్ గ్లింప్స్‌కు మంచి స్పందన లభించగా, ఈ పాట…
