‘గీతాంజలి’ ఆగస్టు 28న వరల్డ్‌వైడ్ రీ-రిలీజ్
కింగ్ నాగార్జున ఎవర్‌గ్రీన్ క్లాసిక్స్‌లో ఒకటి' గీతాంజలి’. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన ఈ క్లాసిక్ లవ్‌స్టోరీ ఇప్పుడు మరోసారి థియేటర్లలో తన మ్యాజిక్‌ను చూపించడానికి రెడీ అవుతోంది. ఆగస్టు 28న నాగార్జున బర్త్‌డే సందర్భంగా ‘గీతాంజలి’ తెలుగు, తమిళ భాషల్లో 4K ఫార్మాట్‌లో ప్రపంచవ్యాప్తంగా రీ-రిలీజ్ కానుంది. రక్షాబంధన్ స్పెషల్ కూడా కావడంతో ఈ రీ-రిలీజ్ మరింత ప్రత్యేకంగా మారింది. శ్రీ పద్మిని సినిమాస్ బ్యానర్‌పై బూర్లె శివ ప్రసాద్ ఈ ఎవర్‌గ్రీన్ క్లాసిక్‌ను లేటెస్ట్ టెక్నాలజీతో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ‘గీతాంజలి’ అంటే ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తొచ్చేది అందమైన ప్రేమకథ, మనసును తాకే సంగీతం, అద్భుతమైన విజువల్స్, గుర్తుండిపోయే పెర్ఫార్మెన్స్. నాగార్జునను ఎంతో చార్మింగ్‌గా, ఎమోషనల్‌గా చూపించిన ఈ సినిమా…
