Skip to content

ఈ నెల 27న విడుదల కానున్న “డేంజర్ బాయ్స్”

వికాస్ ఉత్తయ్య, రాధా భగవతి, అశ్విన్ హసన్, రాఘవ్ కొడబాద్రి, మిథున్ తీర్ధహళ్లి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా “డేంజర్ బాయ్స్”. ఈ చిత్రాన్ని యశశ్విని క్రియేషన్స్ వి.జి.మంజునాథ్ – పూర్ణిమ ఎమ్.గౌడ్ నిర్మించారు. అభిజిత్ తీర్ధహళ్లి దర్శకత్వం వహించారు. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాకు సునాద్ గౌతమ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ అందించారు. ఈ నెల 27న “డేంజర్ బాయ్స్” సినిమా తెలుగులో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. శనివారం సాయంత్రం హైదరాబాద్ లో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

హీరో వికాస్ ఉత్తయ్య మాట్లాడుతూ – మా సినిమా కథాంశం దట్టమైన అటవీ ప్రాంతంలో జరుగుతుంది. ఇలాంటి నేపథ్య చిత్రాల షూటింగ్ చాలా వరకు సెట్స్ లో చేస్తారు. మేము మాత్రం నిజమైన అడవిలో షూటింగ్ చేశాం. ఈ సినిమా కన్నడలో 40 సినిమాలతో పోటీ పడుతూ రిలీజై ఆరు వారాలు హౌస్ ఫుల్స్ తో ప్రదర్శింపబడింది. ఇది ఓటీటీలో కాదు థియేటర్ లో ఎక్సిపీరియన్స్ చేయాల్సిన సినిమా. అందుకే ఓటీటీకి ఇవ్వకుండా తెలుగు ఆడియెన్స్ ముందుకు తీసుకొస్తున్నాం.అన్నారు.

నటి హరిణి మాట్లాడుతూ – నేను ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ లో మీకు కనిపించలేదు. నేను ఎలాంటి క్యారెక్టర్ ఈ సినిమాలో చేశాను అనే సందేహం రావొచ్చు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండే పాత్రలో మిమ్మల్ని ఆకట్టుకోబోతున్నా. అన్నారు.

నటుడు మిథున్ తీర్థహళ్లి మాట్లాడుతూ – నేను ఈ చిత్రంలో గాబ్రి అనే క్యారెక్టర్ లో నటించాను. ఏమాత్రం ధైర్యం లేకుండా పిరికివాడిగా కనిపించే పాత్ర నాది. ప్రతి విషయంలో భయపడే అతను ఈ కథలో జరిగే అనేక సంఘటనల్లో ఎలా రియాక్ట్ అవుతాడు అనేది ఆసక్తికరంగా ఉంటుంది. నా క్యారెక్టర్ మీ అందరికీ నచ్చుతుంది. అన్నారు.

నటుడు అశ్విన్ హాసన్ మాట్లాడుతూ – ఆర్టిస్టులుగా అంతగా పేరు లేని మాకు ఈ సినిమా కన్నడలో మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఈ సినిమా కంటెంట్ మీద నమ్మంతో మా ప్రొడ్యూసర్ ఎవరికీ రైట్స్ అమ్మకుండా ఆయనే రిలీజ్ చేసుకుంటున్నారు. ఈ నెల 27న మార్నింగ్ షో మా సినిమా ఫ్రీగా మీరు చూడొచ్చు. అన్నారు.

డిస్ట్రిబ్యూటర్ అచ్చిబాబు మాట్లాడుతూ – ఈ సినిమా కంటెంట్ మీద గట్టి నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నాం. ఈ సినిమా కన్నడలాగే తెలుగులో కూడా ఆదరణ పొందుతుందని ఆశిస్తున్నాం. అన్నారు

డైరెక్టర్ వి సముద్ర మాట్లాడుతూ – కన్నడ నుంచి మనకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు తెలుగులోకి వచ్చి విజయాలు సాధిస్తున్నాయి. “డేంజర్ బాయ్స్” సినిమా కర్ణాటక అంతటా ఘన విజయం సాధించింది. ఈ సినిమాకు తెలుగు ఆడియెన్స్ కూడా సక్సెస్ చేస్తారని అనుకుంటున్నా. ఈ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ నెల 27న మార్నింగ్ షోస్ అన్ని థియేటర్స్ లో ఫ్రీగా చూపించబోతున్నారు. అన్నారు.

డైరెక్టర్ అభిజీత్ తీర్థహళ్లి మాట్లాడుతూ – నాకు తెలుగు సినిమా అంటే ఇష్టం. ఇలాంటి పెద్ద పరిశ్రమ ఉన్న తెలుగులో మా సినిమా రిలీజ్ చేయాలని ముందుకొచ్చాం. “డేంజర్ బాయ్స్” కన్నడలో పెద్ద విజయం సాధించింది. ప్రేక్షకులు హ్యూజ్ రెస్పాన్స్ ఇచ్చారు. తెలుగు ఆడియెన్స్ కూడా మా సినిమాను బాగా ఆదరిస్తారని నమ్ముతున్నాం. మా సినిమాలోని ముగ్గురు కుర్రాళ్లు మా కర్ణాటకలో జాతిరత్నాలు లాంటి వాళ్లు. ఈ నెల 27న థియేటర్స్ లో “డేంజర్ బాయ్స్” చూడండి. అన్నారు.

ప్రొడ్యూసర్ వి.జి. మంజునాథ్ మాట్లాడుతూ – మా “డేంజర్ బాయ్స్” సినిమా ట్రైలర్, ప్రమోషనల్ కంటెంట్ మీ అందరి నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. థియేటర్స్ లో కూడా ఇదే రెస్పాన్స్ మా మూవీకి అందిస్తారని నమ్ముతున్నాను. కన్నడలో దక్కిన విజయమే తెలుగులోనూ రిపీట్ కావాలని కోరుకుంటున్నా. తెలుగు ఆడియెన్స్ మంచి కంటెంట్ ను ఎప్పుడూ సక్సెస్ చేస్తుంటారు. మా సినిమాను కూడా సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ నెల 27న మార్నింగ్ షోస్ అన్ని థియేటర్స్ లో ఫ్రీగా ప్రేక్షకులకు చూపించబోతున్నాం. అన్నారు.
ఈ చిత్రాన్ని ఎమ్ జి మూవీస్ అచ్చిబాబు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తున్నారు.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.