ఈ నెల 27న విడుదల కానున్న “డేంజర్ బాయ్స్”
వికాస్ ఉత్తయ్య, రాధా భగవతి, అశ్విన్ హసన్, రాఘవ్ కొడబాద్రి, మిథున్ తీర్ధహళ్లి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా “డేంజర్ బాయ్స్”. ఈ చిత్రాన్ని యశశ్విని క్రియేషన్స్ వి.జి.మంజునాథ్ – పూర్ణిమ ఎమ్.గౌడ్ నిర్మించారు. అభిజిత్ తీర్ధహళ్లి దర్శకత్వం వహించారు. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాకు సునాద్ గౌతమ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ అందించారు. ఈ నెల 27న “డేంజర్ బాయ్స్” సినిమా తెలుగులో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. శనివారం సాయంత్రం హైదరాబాద్ లో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో వికాస్ ఉత్తయ్య మాట్లాడుతూ - మా సినిమా కథాంశం దట్టమైన అటవీ ప్రాంతంలో జరుగుతుంది. ఇలాంటి నేపథ్య చిత్రాల షూటింగ్ చాలా వరకు…
