నవంబర్ 27న థియేటర్లలోకి రాబోతున్న ‘డేంజర్ బాయ్స్’
యువతతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే సరికొత్త కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘డేంజర్ బాయ్స్’ (చాప్టర్ క్లోజ్). వికాస్, రాధాభగవతి, అశ్వని హాసన్ ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రానికి ప్రతిభావంతుడైన దర్శకుడు అభిజిత్ తీర్థహళ్లి రచన, దర్శకత్వం వహించారు. ఈ క్రమంలో సినిమా అధికారిక విడుదల తేదీని ప్రకటిస్తూ మేకర్స్ సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. నవంబర్ 27వ తేదీన ఈ చిత్రాన్ని థియేటర్లలో అత్యంత ఘనంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. విడుదలైన పోస్టర్‌లో ప్రధాన పాత్రధారులు రాత్రివేళ దట్టమైన అటవీ ప్రాంతంలో చేతిలో కాగడాలు, లాంతరు పట్టుకుని ఓ మిస్టరీని ఛేదించేందుకు వెతుకుతున్నట్లుగా కనిపించి.. సినిమాపై ఆసక్తిని పెంచేస్తున్నారు. ఉత్కంఠభరితమైన ఈ లుక్ సినిమాలోని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ను కళ్లకు…
