Skip to content

నవంబర్ 27న థియేటర్లలోకి రాబోతున్న ‘డేంజర్‌ బాయ్స్’

యువతతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే సరికొత్త కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘డేంజర్‌ బాయ్స్‌’ (చాప్టర్ క్లోజ్). వికాస్, రాధాభగవతి, అశ్వని హాసన్ ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రానికి ప్రతిభావంతుడైన దర్శకుడు అభిజిత్ తీర్థహళ్లి రచన, దర్శకత్వం వహించారు. ఈ క్రమంలో సినిమా అధికారిక విడుదల తేదీని ప్రకటిస్తూ మేకర్స్ సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. నవంబర్ 27వ తేదీన ఈ చిత్రాన్ని థియేటర్లలో అత్యంత ఘనంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

విడుదలైన పోస్టర్‌లో ప్రధాన పాత్రధారులు రాత్రివేళ దట్టమైన అటవీ ప్రాంతంలో చేతిలో కాగడాలు, లాంతరు పట్టుకుని ఓ మిస్టరీని ఛేదించేందుకు వెతుకుతున్నట్లుగా కనిపించి.. సినిమాపై ఆసక్తిని పెంచేస్తున్నారు. ఉత్కంఠభరితమైన ఈ లుక్ సినిమాలోని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ను కళ్లకు కడుతోంది.

ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. ‘‘కుటుంబ భావోద్వేగాలతో నిండిన ఒక విలక్షణమైన యాక్షన్ థ్రిల్లర్‌గా దర్శకుడు అభిజిత్ తీర్థహళ్లి ఈ చిత్రాన్ని అద్భుతంగా మలిచారు. ఇందులో ప్రతి సన్నివేశం ప్రేక్షకులకు వంద శాతం వినోదాన్ని పంచుతుంది. ముఖ్యంగా హీరో పాత్ర చిత్రణ తెరపై మునుపెన్నడూ చూడని రీతిలో సరికొత్తగా సాగుతుంది. నేటి తరం ప్రేక్షకులు కోరుకునే ఆసక్తికర కథనం, సస్పెన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఇందులో సమపాళ్లలో ఉన్నాయి. ఇంతటి మంచి కంటెంట్ ఉన్న సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నందుకు ఎంతో సంతోషంగా, గర్వంగా ఉంది. నవంబర్ 27న థియేటర్లలో విడుదలవుతున్న మా ‘డేంజర్‌ బాయ్స్’ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఆదరించి పెద్ద విజయం చేస్తారని ఆశిస్తున్నాం” అని అన్నారు.

వికాస్, రాధాభగవతి, అశ్వని హాసన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి
మ్యూజిక్, సినిమాటోగ్రఫీ: సునాద్ గౌతమ్
రచన – దర్శకత్వం: అభిజిత్ తీర్థహళ్లి
నిర్మాతలు: వి.జి. మంజునాథ్ – పూర్ణిమ గౌడ్

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.