‘తొలిసారి చూశాక నిన్నే.. మునిగాను నీ మాయలోనే నడిచాక నీ దారిలోనే.. కలిసేశాను సరికొత్త నన్నే…
డిసెంబర్ రెండో వారంలో ‘మొహబ్బత్’

సంతోష్ రాజా, శ్రేయాస్ సేన్ జంటగా రూపొందుతున్న చిత్రం ‘మొహబ్బత్’. ఏబీఎస్ ప్రొడక్షన్స్ పతాకంపై మ్యాక్ దర్శకత్వంలో అఫ్రోజ్ షేక్ నిర్మిస్తున్న ఈ మూవీ డిసెంబర్ రెండో వారంలో విడుదలకు సిద్దం అవుతోంది. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్ అన్నీ కూడా ఆడియెన్స్‌లో అంచనాల్ని పెంచేశాయి. నవదీప్, దర్శకుడు కరుణ కుమార్ వంటి ప్రముఖులు టీజర్‌ని చూసి ప్రశంసలు కురిపించారు. అద్బుతమైన కంటెంట్‌తో మేకర్స్ సినిమాని ఆడియెన్స్‌కి అందించేందుకు రెడీగా ఉన్నారు.
డిసెంబర్ రెండో వారంలో సినిమాని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసిన మేకర్స్.. త్వరలోనే ప్రమోషన్స్ ప్రారంభించబోతోన్నారు. ఈ క్రమంలో మ్యూజికల్ ప్రమోషన్స్‌ని ముందుగా ప్రారంభించబోతోన్నారు. మొదటగా పాటల్ని విడుదల చేసి ప్రేక్షకుల్లో మరింత బజ్ క్రియేట్ చేసి.. చివరకు ట్రైలర్‌తో అందరినీ ఆశ్చర్యపరిచేందుకు టీం సిద్దంగా ఉంది. ఓ వినూత్నమైన ప్రేమ కథా చిత్రంగా ‘మొహబ్బత్’ రానున్న సంగతి తెలిసిందే.
ఈ చిత్రంలో ఈశ్వర్ సాయి, మనోజ్, సాత్విక్, శ్రేయాస్ సేన్, సంతోష్ రాజా, అజయ్ ఘోష్, సంతోషి, దుర్గ తదితరులు కీలక పాత్రలను పోషించారు. ఈ మూవీకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా సలీమ్ షేక్, సినిమాటోగ్రఫర్‌గా వైఎస్ కృష్ణ, రచయితగా కలాం, సంగీత దర్శకుడిగా సునీల్ కశ్యప్, ఎడిటర్‌గా శ్రీ వర ప్రసాద్ వర్క్ చేశారు.
నటీనటులు : సంతోష్ రాజా, ఈశ్వర్ సాయి, మనోజ్, సాత్విక్, శ్రేయాస్ సేన్, అజయ్ ఘోష్, సంతోషి, దుర్గ తదితరులు
టెక్నికల్ టీం
బ్యానర్ : ఏబీఎస్ ప్రొడక్షన్స్
నిర్మాత : అఫ్రోజ్ షేక్
దర్శకుడు : మ్యాక్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : సలీం షేక్
సంగీతం : సునీల్ కశ్యప్
కెమెరా : వైఎస్ కృష్ణ
ఎడిటింగ్ : శ్రీ వర ప్రసాద్
పీఆర్వో : ఏలూరు శ్రీను, మాడూరి మధు

