ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రైమ్ థ్రిల్లర్ ‘డాయ్‌రా’ చిత్ర బృందం న్యూ అప్డేట్ ఇచ్చింది. కరీనా…
రవితేజ #SVC64 సంక్రాంతికి థియేట్రికల్ రిలీజ్

‘ఇరుముడి’ సంచలన బ్లాక్‌బస్టర్ విజయంతో దూసుకుపోతున్న మాస్ మహారాజా రవితేజ, ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌కు సిద్ధమయ్యారు. దర్శకుడు హసిత్ గోలితో కలిసి రవితేజ ఓ హార్డ్‌కోర్ ఎంటర్‌టైనర్ చేయనున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
రవితేజ, హసిత్ గోలి, ఎస్వీసీ కాంబినేషన్‌పై ఇప్పటికే ఆసక్తి నెలకొంది. తన ఎనర్జీ, కామెడీ టైమింగ్‌తో కమర్షియల్ ఎంటర్‌టైనర్లను రవితేజ మరో స్థాయికి తీసుకెళ్తే.. వైవిధ్యమైన కథలు, హ్యూమర్ తో హసిత్ గోలి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ ఇద్దరి కలయికలో రాబోతున్న సినిమా అంచనాలు పెంచింది.
తాజాగా సినిమా విడుదల తేదీని కూడా మేకర్స్ ప్రకటించారు. #SVC64 సంక్రాంతి కానుకగా 2027 జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. దీంతో వచ్చే సంక్రాంతికి రవితేజ నుంచి ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్ ప్రేక్షకులను అలరించనుంది.
హసిత్ గోలి రూపొందించనున్న ఈ కామెడీ డ్రివెన్ కాన్సెప్ట్‌లో రవితేజ సరికొత్తగా కనిపించబోతున్నారు. హ్యూమర్, ఎనర్జీ, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రం పుల్ లెంత్ ఎంటర్‌టైనింగ్ ఎక్స్‌పీరియన్స్ అందించనుంది.
ఈ చిత్రానికి సంబంధించిన మిగతా నటీనటులు, సాంకేతిక బృందం వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. సినిమా టైటిల్‌ను కూడా త్వరలోనే ప్రకటించనున్నారు.
తారాగణం: రవితేజ
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: హసిత్ గోలి
నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
PRO: వంశీ-శేఖర్

