న్యాచురల్ స్టార్ నాని పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ది ప్యారడైజ్’. శ్రీకాంత్ ఓదెల…
‘ఇరుముడి’ రూ.250 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ.. నెట్‌ఫ్లిక్స్‌లో దేశవ్యాప్తంగా నంబర్ 1 ట్రెండింగ్
మాస్ మహారాజా రవితేజ, సెన్సిబుల్ డైరెక్టర్ శివ నిర్వాణ, ప్రముఖ పాన్-ఇండియా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ దగ్గర జనరేషనల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ఫలితాలను అందుకోవడంతో పాటు..ఇప్పటివరకు చూడని స్థాయిలో లాభాలను అందించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.250 కోట్లకు పైగా గ్రాస్ సాధించి.. రవితేజ కెరీర్‌లో తొలిసారి ఎలైట్ రూ.250 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన చిత్రంగా నిలిచింది. అలాగే రీజినల్ సినిమాల్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.
ఇప్పుడు ఈ బ్లాక్‌బస్టర్ ప్రపంచంలోని ప్రముఖ OTT ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లోనూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ప్రారంభమైనప్పటి నుంచి నంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతోంది. OTTలోనూ ‘ఇరుముడి’ ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటోంది. ముఖ్యంగా తండ్రీకూతుళ్ల అనుబంధాన్ని బలమైన ఎమోషనల్ కోర్‌గా తీసుకున్న కథ దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతోంది.
మిడిల్ క్లాస్ కుటుంబ నేపథ్యం, అయ్యప్ప దీక్షతో ముడిపడిన భక్తి అంశాలు, ఎమోషనల్‌గా ఆకట్టుకునే కథనం.. ఫ్యామిలీ ఆడియన్స్‌లో సినిమాకు మరింత ఆదరణ తీసుకొచ్చాయి. ఇప్పటికే రవితేజ డబ్బింగ్ సినిమాల ద్వారా ఆయనకు పరిచయమైన హిందీ ప్రేక్షకులు కూడా ఆయన నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తన కూతురిని ఎంతో ప్రేమించే తండ్రిగా.. ప్రతి ఆడబిడ్డను రక్షించేందుకు నిలబడే వ్యక్తిగా రవితేజ చూపించిన హార్ట్‌ఫెల్ట్ పెర్ఫార్మెన్స్ సోషల్ మీడియాలో విశేషంగా ప్రశంసలు అందుకుంటోంది.
దర్శకుడు శివ నిర్వాణ ఎమోషన్, ఇంటెన్సిటీ మధ్య మంచి బ్యాలెన్స్‌తో కథను తెరకెక్కించారు. హ్యూమన్ ఎమోషన్స్ సెన్సిటివ్‌గా చూపించడంలో మంచి గుర్తింపు పొందిన శివ నిర్వాణ.. ‘ఇరుముడి’తో మరింత ఇంటెన్స్ నేరేటివ్‌ను హ్యాండిల్ చేయగల తన సామర్థ్యాన్ని కూడా చూపించారు.
సినిమా టెక్నికల్, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఇంపాక్ట్‌ను మరింత పెంచాయి. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించగా.. నేషనల్ అవార్డు విన్నింగ్ కంపోజర్ జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం సినిమా హైలైట్స్‌లో ఒకటిగా నిలిచింది. ప్రియా భవానీ శంకర్ బలమైన నటనతో ఆకట్టుకోగా.. బేబీ నక్షత్ర తన క్యూట్ స్క్రీన్ ప్రెజెన్స్, పెర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. పలువురు ప్రముఖ నటీనటులు కూడా ఆమె నటనను ప్రశంసించారు.
వెటరన్ యాక్టర్ సాయికుమార్, సెన్సేషనల్ యాక్ట్రెస్ స్వాసిక విజయ్, అలాగే రమేష్ ఇందిర, అజయ్ ఘోష్, జబర్దస్త్ కొమరం తమదైన నటనతో మెప్పించారు. వీరి పెర్ఫార్మెన్స్‌కు కూడా ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి.
థియేట్రికల్‌తో పాటు OTTలోనూ ‘ఇరుముడి’ సాధిస్తున్న విజయం.. ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యే కథలకు ఉన్న రీచ్‌ను మరోసారి నిరూపిస్తోంది. బలమైన పెర్ఫార్మెన్స్, ఎంగేజింగ్ నేరేటివ్, యూనివర్సల్ థీమ్స్‌తో ఈ సినిమా దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు కనెక్ట్ అయింది.
ప్రస్తుతం ‘ఇరుముడి’ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

