Skip to content

వర్షిక పుట్టినరోజు సందర్భంగా “సర్కారు బాయి” సినిమా నుంచి బర్త్ డే పోస్టర్ రిలీజ్

శ్రీరామ్ నిమ్మల, వర్షిక హీరో హీరోయన్స్ గా నటిస్తున్న సినిమా “సర్కారు బాయి”. ఈ చిత్రాన్ని డెక్కన్ ఫిలింస్ సమర్ఫణలో ప్రొడ్యూసర్ తుమ్మల ప్రఫుల్ రాం రెడ్డి నిర్మిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ప్రాంతంలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా దర్శకుడు లారా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అప్పటి తెలంగాణ సమాజాన్ని ప్రతిబింబిస్తూ నీటి సమస్యలు, కుల వివక్ష, అణగారిన వర్గాల జీవిత పోరాటం వంటి అంశాలను దర్శకుడు లారా కళ్లకు కట్టినట్లు తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది.

ఈ రోజు బ్యూటిఫుల్, టాలెంటెడ్ హీరోయిన్ వర్షిక పుట్టినరోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ మూవీ టీమ్ బర్త్ డే పోస్టర్ రిలీజ్ చేశారు. “సర్కారు బాయి” సినిమాలో వర్షిక కల్పన టీచర్ పాత్రలో నటిస్తోంది. ఈ బర్త్ డే పోస్టర్ లో చీరకట్టులో ట్రెడిషనల్ లుక్ లో వర్షిక కనిపించి ఆకట్టుకుంటోంది. ఈ సినిమాతో వర్షిక హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకుంటుందనే అంచనాలు ఏర్పడుతున్నాయి.

ప్రస్తుతం “సర్కారు బాయి” సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఇటీవలే చేగుంట సమీపంలోని రెడ్డిపల్లి, పరిసర ప్రాంతాల్లో భారీ షెడ్యూల్ కంప్లీట్ చేశారు. మరోవైపు ఎడిటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. హీరో శ్రీరామ్ నిమ్మల, హీరోయిన్ వర్షిక, బాహుబలి ప్రభాకర్, నాగ మహేష్ లాంటి ప్రధాన నటీనటులు పాల్గొన్న ఈ లెంగ్తీ షెడ్యూల్ లో చాలా వరకు సినిమా చిత్రీకరించారు. త్వరలోనే “సర్కారు బాయి” సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రొడ్యూసర్ తుమ్మల ప్రఫుల్ రాం రెడ్డి ఈ చిత్రాన్ని మంచి ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నారు. డైరెక్టర్ లారా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా సినిమా రూపొందిస్తున్నారు. వీలైనంత త్వరగా “సర్కారు బాయి” సినిమాను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు మూవీ టీమ్ ప్రయత్నిస్తున్నారు.

నటీనటులు – శ్రీరామ్ నిమ్మల, వర్షిక, బాహుబలి ప్రభాకర్, వివ రెడ్డి, నాగ మహేష్, చలాకీ చంటి, నుపూర్ ముఖర్జీ, జ్యోతి, దేవరాజ్ పాలమూరు, మాధవి, కవిత, తదితరులు

టెక్నికల్ టీమ్
—————————–
డీవోపీ – అమర్.జి
మ్యూజిక్ – శివా.కె
ఎడిటర్ – బి.యన్.రెడ్డి
పబ్లిసిటీ డిజైనర్ – వివారెడ్డి
మేనేజర్ – మధు.సి.హెచ్
కాస్ట్యూమ్ డిజైనర్: కె. మాధురి
కో డైరెక్టర్ – లక్ష్మణ్
నిర్మాత: తుమ్మల ప్రఫుల్ రాంరెడ్డి
రచన, దర్శకత్వం: లారా

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.