‘ఇరుముడి’ రూ.250 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ.. నెట్‌ఫ్లిక్స్‌లో దేశవ్యాప్తంగా నంబర్ 1 ట్రెండింగ్
మాస్ మహారాజా రవితేజ, సెన్సిబుల్ డైరెక్టర్ శివ నిర్వాణ, ప్రముఖ పాన్-ఇండియా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ దగ్గర జనరేషనల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ఫలితాలను అందుకోవడంతో పాటు..ఇప్పటివరకు చూడని స్థాయిలో లాభాలను అందించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.250 కోట్లకు పైగా గ్రాస్ సాధించి.. రవితేజ కెరీర్‌లో తొలిసారి ఎలైట్ రూ.250 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన చిత్రంగా నిలిచింది. అలాగే రీజినల్ సినిమాల్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు ఈ బ్లాక్‌బస్టర్ ప్రపంచంలోని ప్రముఖ OTT ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లోనూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ప్రారంభమైనప్పటి నుంచి నంబర్ 1 స్థానంలో ట్రెండ్…
