న్యాచురల్ స్టార్ నాని పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ది ప్యారడైజ్’. శ్రీకాంత్ ఓదెల…
గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించి చరిత్ర సృష్టించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, సన్ పిక్చర్స్ మూవీ ‘రాకా’

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ వి. అరుణ్‌కుమార్ (అట్లీ) దర్శకత్వంలో సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ నిర్మిస్తోన్న భారీ చిత్రం ‘రాకా’. ఈ సినిమా ‘ఒకేసారి రియల్ టైమ్‌లో ఎక్కువ మంది వ్యక్తులకు సంబంధించిన హావభావాలను క్యాప్చర్ చేయడం’ అనే సినీ సాంకేతికతలో అరుదైన ఘనతను సాధించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో చోటు దక్కించుకుని చరిత్ర సృష్టించింది. ఈ రికార్డును ఏక కాలంలో 37 మంది కళాకారుల మోషన్‌ను రియల్ టైమ్‌లో క్యాప్చర్ చేయడం ద్వారా ‘రాకా’ సాధించటం విశేషం. భారతీయ సినీ పరిశ్రమలో సాంకేతికత పరంగా ఇదొక మైల్ స్టోన్.
2026 ఫిబ్రవరిలో సాధించిన ఈ ఘనతకుగానూ ‘రాకా’ చిత్రానికి సెప్టెంబర్ 15, 2026న అధికారిక గుర్తింపు లభించింది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సీనియర్ అడ్జుడికేటర్ స్వప్నిల్ డాంగ్రికర్ దీనికి సంబంధించిన అధికారిక సర్టిఫికేట్‌ను ఐకాన్ స్టార్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు వి.అరుణ్‌కుమార్‌కు అధికారిక సర్టిఫికెట్‌ను అందజేశారు. చిత్రానికి చెందిన ముఖ్య తారాగణం, సాంకేతిక బృందం సభ్యుల సమక్షంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో వీరు ఈ సర్టిఫికెట్‌ను అందుకున్నారు.
ఈ చిత్రం కోసం నిర్వహించిన ప్రత్యేక మోషన్ క్యాప్చర్ ప్రక్రియలో 4 ఏళ్ల చిన్నారి నుంచి 70 ఏళ్ల వయసున్న వ్యక్తి వరకు మొత్తం 37 మంది కళాకారుల పెర్ఫార్మెన్స్‌ను ఒకే సెషన్‌లో, ఒకేసారి రియల్ టైమ్‌లో క్యాప్చర్ చేశారు. ఈ ప్రక్రియలో ఎదురైన ప్రధానమైన సవాలేంటంటే.. ఒకే క్యాప్చర్ వాల్యూమ్‌లో 37 మంది వ్యక్తుల ప్రత్యేక పెర్ఫార్మెన్స్‌ను ఏకకాలంలో కచ్చితంగా రికార్డ్ చేసి, వాటి సహజత్వాన్ని ఏమాత్రం దెబ్బతినకుండా కాపాడటం. దాన్ని విజయవంతంగా కంప్లీట్ చేయటం విశేషం.
ఈ అరుదైన ఘనతను సాధించటానికి చిత్ర వీఎఫ్‌ఎక్స్ ప్రొడ్యూసర్, ‘రాకా’ భారీ స్థాయికి, సాంకేతిక అవసరాలకు అనుగుణంగా తగినట్లు ప్రత్యేకమైన మోషన్ క్యాప్చర్ పైప్‌లైన్, వర్క్‌ఫ్లోను రూపొందించారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నంలో భాగంగా 92 ఆప్టికల్ మోషన్ క్యాప్చర్ కెమెరాలను వినియోగించారు. క్యాప్చర్, కాలిబ్రేషన్, నెట్‌వర్కింగ్, సింక్రనైజేషన్, రియల్ టైమ్ అన్‌రియల్ విజువలైజేషన్, అందుకు ఆధారమైన కెమెరాలు, ఫేషియల్ క్యాప్చర్‌తో పాటు పలువురు నిపుణుల బృందాలతో కూడిన అత్యాధునిక సాంకేతిక వ్యవస్థను ఇందుకోసం ఏర్పాటు చేశారు.
ఈ అరుదైన ఘనత వెనుక సన్ పిక్చర్స్ భారీ స్థాయి నిర్మాణం, అట్లీ విజన్, పెర్ఫార్మెన్స్‌లో కొత్త హద్దులను చూపించాలనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంకితభావం, యాపిల్ ఆర్ట్ స్టూడియో సాంకేతిక నైపుణ్యం, అత్యాధునిక వీఎఫ్‌ఎక్స్ వర్క్‌ఫ్లో, టెక్నాలజీతో పాటు మొత్తం చిత్ర బృందం సమిష్టి కృషి ఉంది. వీరందరి సమన్వయంతోనే ఈ రికార్డు స్థాయి మోషన్ క్యాప్చర్ సాధ్యమైంది.
ఈ రికార్డుకు మించి, ‘రాకా’ సాధించిన ఈ ఘనత ప్రపంచ వేదికపై భారతీయ సినిమాకు మరో ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. సమకాలీన భారతీయ చిత్ర పరిశ్రమలో పెరుగుతున్న నిర్మాణ స్థాయి, సాంకేతిక సామర్థ్యం, సరికొత్త ఆలోచనలకు ఇది నిదర్శనంగా నిలుస్తోంది. భారతీయ సృజనాత్మక, సాంకేతిక ప్రతిభతో రూపొందుతున్న ఓ భారీ ప్రొడక్షన్‌కు ప్రపంచస్థాయిలో గుర్తింపు రావడం విశేషం. అత్యాధునిక సినీ సాంకేతికతలో సరికొత్త ఆవిష్కరణకు భారతీయ ప్రతిభ చాటిన సినిమాగా ‘రాకా’ నిలిచింది.
‘రాకా’ సినిమాతో భారతీయ సినిమా మరో కీలక అడుగు ముందుకు వేసింది. భారతీయ చిత్ర పరిశ్రమలోని సృజనాత్మకతతో పాటు సాంకేతికతకు ఉన్న విస్తృత అవకాశాలను ప్రపంచ వేదికపై చాటిచెప్పింది.

