రాకా కు గిన్నిస్ రికార్డు! మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ వినియోగం తో రికార్డు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ వి. అరుణ్‌కుమార్ (అట్లీ) దర్శకత్వంలో సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ నిర్మిస్తోన్న భారీ చిత్రం ‘రాకా’. ఈ సినిమా ‘ఒకేసారి రియల్ టైమ్‌లో ఎక్కువ మంది వ్యక్తులకు సంబంధించిన హావభావాలను క్యాప్చర్ చేయడం’ అనే సినీ సాంకేతికతలో అరుదైన ఘనతను సాధించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో చోటు దక్కించుకుని చరిత్ర సృష్టించింది. ఈ రికార్డును ఏక కాలంలో 37 మంది కళాకారుల మోషన్‌ను రియల్ టైమ్‌లో క్యాప్చర్ చేయడం ద్వారా ‘రాకా’ సాధించటం విశేషం. భారతీయ సినీ పరిశ్రమలో సాంకేతికత పరంగా ఇదొక మైల్ స్టోన్. 2026 ఫిబ్రవరిలో సాధించిన ఈ ఘనతకుగానూ ‘రాకా’ చిత్రానికి సెప్టెంబర్ 15, 2026న అధికారిక…
