Skip to content

‘AA23’పై స్పెషల్ అప్‌డేట్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తెరకెక్కించనున్న చిత్రం ‘AA23’. ఈ మూవీ ప్రకటనతో రీసెంట్‌గా సోషల్ మీడియాలో భారీ సందడి నెలకొన్న సంగ‌తి తెలిసిందే..ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచి దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. అల్లు అర్జున్, లోకేష్ కనక‌రాజ్ క్రేజీ కాంబినేషన్‌లో సినిమా రాబోతుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై హ్యూజ్ ఎక్స్‌పెక్టేష‌న్స్ క్రియేట్ అయ్యాయి. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేసిన‌ అనౌన్స్‌మెంట్ సాంగ్ విడుదలైన కొద్ది సేపటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులు, సినీ ప్రియుల మధ్య ఈ పాట హాట్ టాపిక్‌గా నిలిచింది. భారీ స్థాయిలో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్‌లో అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్, అనిరుధ్ వంటి స్టార్స్…

Read more

‘ICONZA’కు శ్రీకారం చుట్టిన అల్లు అర్జున్

న‌ట‌నా పరిధిని దాటి సరికొత్త సృజనాత్మక ప్రయాణానికి నాంది సుప్ర‌సిద్ధ న‌టుడు అల్లు రామ‌లింగ‌య్యగారి జ‌యంతి సంద‌ర్భంగా ఐకాన్ స్టార్ వేసిన అడుగుకు నెట్టింట ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్ తన సృజనాత్మక ప్రయాణంలో మరో కీలక అడుగు వేశారు. తన తాత, ప్రముఖ నటుడు అల్లు రామలింగయ్య గారి జయంతి సందర్భంగా ‘ICONZA’ పేరుతో తన కొత్త క్రియేటివ్ ఆఫీస్ స్పేస్‌ను ప్రారంభించారు. స‌రికొత్త ఆలోచనలు, అద్భుత‌మైన సృజ‌న‌, ప‌ర‌స్పర స‌హ‌కారానికి, సంయుక్త కార్యాచ‌ర‌ణ‌కు వేదికగా ‘ICONZA’ను తీర్చిదిద్దుతున్నారు. ఈ నూతన ప్రయాణాన్ని పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభించారు. అత్యంత ప్ర‌త్యేక‌మైన ఈ సందర్భాన్ని కుటుంబ సభ్యుల సమక్షంలో మొద‌లుపెట్టిన‌ట్టు ఐకాన్ స్టార్ గ్లింప్స్ షేర్ చేసి తెలిపారు…

Read more

తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. వ్యాపారవేత్తగా, తల్లిగా, ఫిట్‌నెస్‌ ప్రియురాలిగా, డిజిటల్ పర్సనాలిటీగా స్నేహా రెడ్డి తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నారు. సోషల్ మీడియాలో ఆమెకు 91 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. స్నేహా రెడ్డి నిర్వహిస్తున్న పికాబూ (Picaboo) స్టూడియో ఆమె వ్యాపార ప్రయాణంలో ముఖ్యమైన భాగంగా ఉంది. మరోవైపు ఫిట్‌నెస్, ఆరోగ్యంపై కూడా ఆమె ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. తరచూ తన వర్కౌట్స్, యాక్టివ్ లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. కుటుంబానికి కూడా స్నేహా రెడ్డి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. తన పిల్లలతో కలిసి…

Read more

రాకా కు గిన్నిస్ రికార్డు! మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ వినియోగం తో రికార్డు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్‌ వి. అరుణ్‌కుమార్ (అట్లీ) దర్శకత్వంలో సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ నిర్మిస్తోన్న భారీ చిత్రం ‘రాకా’. ఈ సినిమా ‘ఒకేసారి రియల్ టైమ్‌లో ఎక్కువ మంది వ్య‌క్తుల‌కు సంబంధించిన హావ‌భావాల‌ను క్యాప్చర్ చేయడం’ అనే సినీ సాంకేతికతలో అరుదైన ఘనతను సాధించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో చోటు దక్కించుకుని చ‌రిత్ర సృష్టించింది. ఈ రికార్డును ఏక కాలంలో 37 మంది కళాకారుల మోషన్‌ను రియల్ టైమ్‌లో క్యాప్చర్ చేయడం ద్వారా ‘రాకా’ సాధించటం విశేషం. భారతీయ సినీ పరిశ్రమలో సాంకేతికత పరంగా ఇదొక మైల్ స్టోన్. 2026 ఫిబ్రవరిలో సాధించిన ఈ ఘనతకుగానూ ‘రాకా’ చిత్రానికి సెప్టెంబర్ 15, 2026న అధికారిక…

Read more

హెచ్ పీవీ వ్యాక్సిన్ పై అవగాహన కల్పించిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్

సొసైటీ బాగు కోసం ముందడుగు వేస్తూ తమ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రత్యేకతను చాటుకుంటోంది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA). కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వస్థ్ నారీ వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా హెచ్ పీవీ వ్యాక్సినేషన్, సర్వైకల్ క్యాన్సర్ నివారణపై దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాల్లో 820 స్కూల్ అవేర్ నెస్ ఈవెంట్స్ కు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ మద్ధతుగా నిలిచింది. ఈ కార్యక్రమాల ద్వారా 3 లక్షలమంది యువతులకు చేరువైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిస్సా, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, అండమాన్ నికోబార్ ఐల్యాండ్స్ వంటి రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో నేరుగా స్కూల్స్, కమ్యూనిటీల్లో ఈ అవగాహన కార్యక్రమాలను ఎఎఎఫ్ఎ నిర్వహించింది. సామాజిక బాధ్యత గల…

Read more

ఫోర్బ్స్ ఇండియా షోస్‌టాప‌ర్స్‌ 2026 ఎడిషన్ కవర్‌పై అల్లు అర్జున్

జాతీయ అవార్డు గ్రహీత, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. భారతదేశంలోని టాప్ 100 ప్రముఖ సెలబ్రిటీలను సెలబ్రేట్ చేస్తూ రూపొందించిన ఎంతో ప్రతిష్టాత్మకమైన ఫోర్బ్స్ ఇండియా ‘షోస్‌టాపర్స్ 2026’ ఎడిషన్ కవర్‌పై ఆయన త‌న‌దైన స్టైల్లో మెరిశారు. ఈ కవర్ పేజీ ద్వారా సెలబ్రిటీల ప్రభావం, క్రేజ్‌కు సంబంధించి అల్లు అర్జున్ అగ్రస్థానంలో నిలిచారు. ఆయన స్టార్‌డమ్ స్థాయి, బాక్సాఫీస్ వద్ద సత్తా, అలాగే ఒక స్టార్‌గా ఆయన అసాధార‌ణ‌మైన‌ బ్రాండ్ వేల్యూ ఈ గుర్తింపుతో మరోసారి స్పష్టమైంది. తెలుగు సినిమా నుంచి నిజమైన పాన్ ఇండియా ఫినామినన్‌గా అల్లు అర్జున్ ప్రభావం ఎంత దూరం విస్తరించిందో చెప్ప‌టానికి ఇదొక గొప్ప తిరుగులేని గుర్తింపు. నటన,…

Read more

7 రాష్ట్రాల్లో 400కు పైగా హెచ్ పీవీ అవేర్ నెస్ కార్యక్రమాలకు సపోర్ట్ గా నిలిచిన AAFA

సమాజ హిత కార్యక్రమాల్లో ముందుంటూ తమ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రత్యేకతను చాటుకుంటోంది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA). కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వస్థ్ నారీ వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా హెచ్ పీవీ వ్యాక్సినేషన్, సర్వైకల్ క్యాన్సర్ నివారణపై దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లో 400లకు పైగా అవగాహన కార్యక్రమాలకు మద్ధతుగా నిలిచింది అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్. తాజాగా ఈ కార్యక్రమాల ద్వారా లక్ష మంది యువతులకు చేరువైంది. సామాజిక బాధ్యత గల అల్లు అర్జున్ అభిమానులంతా సమష్టి కృషితో ఈ ఘనతను సాధించారు. హెచ్ పీవీ వ్యాక్సినేషన్, సర్వైకల్ క్యాన్సర్ నివారణపై అవగాహన కల్పించడంలో బాలికలకు, యువతులకు ఆరోగ్యకరమైన భవితను అందించేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్న…

Read more

విశాఖ‌పట్నం ఇనార్బిట్ మాల్‌లో స‌రికొత్తగా గ్రాండ్ సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వ‌నున్న AAA సినిమాస్‌

ప్రీమియం సినిమా అనుభూతికి పేరుగాంచిన AAA సినిమాస్..విశాఖపట్నంలోని ఇనార్బిట్ మాల్‌లో గ్రాండ్‌గా ప్రారంభమైంది. అత్యాధునిక టెక్నాలజీ, వరల్డ్‌క్లాస్ సినిమా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో పాటు ప్రీమియం హాస్పిటాలిటీని ఒకే చోట అందిస్తూ ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించేందుకు AAA సినిమాస్ సిద్ధమైంది. ఈ AAA సినిమాస్ గ్రాండ్ లాంచ్ కార్యక్రమానికి వ్యాపార, సినీ పరిశ్రమల‌కు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. దీంతో విశాఖపట్నం ఎంటర్‌టైన్‌మెంట్ ల్యాండ్‌స్కేప్‌లో AAA సినిమాస్‌ మరో కొత్త ల్యాండ్‌మార్క్‌గా నిలిచింది. ఈ కార్యక్రమానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ప్ర‌ముఖ నిర్మాత‌లు అల్లు అరవింద్, ఏషియన్ సునీల్ నారంగ్, భారత్ నారంగ్, సిమ్రన్ నారంగ్, జ్యేష్ఠ్ నారంగ్, మురళీమోహన్, ఆర్కిటెక్ట్ ఎర్రన్న యెక్బోటే, నిర్మాత బన్నీ వాస్, విశాఖపట్నం నార్త్…

Read more

అల్లు అర్జున్ ఫ్రెండ్‌షిప్ డే సందేశం

నిజమైన విజయమంటే మన స్నేహితులను కూడా మనతో పాటు ముందుకు తీసుకెళ్లడమే.. సినిమా రంగంలో విజయం మ‌న చుట్టూ ఉన్న చాలా విషయాలను మార్చేస్తుంది. ఈ క్ర‌మంలో మన కెరీర్‌లు మారుతాయి. మన బంధాలు, సంబంధాల సమీకరణాలు మారిపోతాయి. స్నేహాలు జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. అయితే నిజమైన విజయం అంటే కేవలం అత్యుతన్న స్థానాన్ని చేరుకోవడం మాత్రమే కాదని..మనవాళ్లను కూడా మనతో పాటు తీసుకెళ్లడమే అని గుర్తు చేసే వారుంటారు. అలాంటి అరుదైన వ్య‌క్తే అల్లు అర్జున్‌. ఆయ‌న ఎలాంటి హంగామా లేకుండా నిశ్శబ్దంగా అదే చేసి చూపించారు. కొన్ని నెలల క్రితం అల్లు అర్జున్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో AA23 చిత్రాన్ని ప్రకటించినప్పుడు, సహజంగానే అందరి దృష్టి ఆ ప్రాజెక్ట్ భారీ…

Read more

స్పైడర్-మ్యాన్‌తో అల్లు అర్జున్ క్రేజ్

ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూసిన ‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ విడుదల సందర్భంగా హైదరాబాద్‌లోని అల్లు సినిమాస్ (భారతదేశంలోనే అతిపెద్ద, అత్యాధునిక డాల్బీ సినిమా స్క్రీన్)లో గ్రాండ్ ప్రీమియర్ నిర్వహించారు. ఈ ప్రత్యేక ప్రీమియర్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన భార్య స్నేహా రెడ్డి, పిల్లలతో కలిసి హాజరై సందడి చేశారు. అభిమానులు ఈ అరుదైన ఫ్యామిలీ మూమెంట్‌ను ఆసక్తిగా స్వాగతించగా, సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి. ఈ వేడుకకు అల్లు అరవింద్, అల్లు శిరీష్, బన్నీ వాస్, దర్శకులు చందూ మొండేటి, సాయి రాజేష్, హరీష్ శంకర్, బోయపాటి శ్రీను, నటి రష్యా గోరక్, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత రవి, హారిక & హాసిని…

Read more