Skip to content

‘పళ్ళబురుసు’ అనౌన్స్‌మెంట్- 2026 ఆగస్టు14న గ్రాండ్ రిలీజ్

అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న వినూత్న చిత్రం ‘పళ్ళబురుసు’ను అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ చిత్రాన్ని 2026 ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఈ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. తెలుగు సంస్కృతి, ప్రాంతీయతను ప్రతిబింబించే ఈ చిత్రం వినోదభరితమైన కామెడీ-డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తండ్రీకొడుకులుగా ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, ప్రజ్వల్ , గోమతి రెడ్డి, కిరణ్ మాచా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఫస్ట్ లుక్ పోస్టర్‌లో జిల్లా కోర్టు ఆవరణలో పెద్ద టూత్‌బ్రష్‌ను త్రాసులా రూపొందించి, దానిపై వెన్ను వెన్నుకు ఆనుకుని కూర్చున్న ఇద్దరు ప్రధాన పాత్రధారులను చూపించడం ఆకట్టుకుంది. ఈ వినూత్న విజువల్ సినిమా కథపై ఆసక్తిని రేకెత్తిస్తూ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది.

ఈ చిత్రానికి ఉదయ్ చౌహాన్ కథ, దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా సమర్పిస్తూ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణాని (ఎపిక్ స్టూడియోస్) నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

ట్యాలెంటెడ్ టెక్నికల్ టీం ఈ సినిమాకి పనిచేస్తున్నారు. వినోద్ కె. బంగారి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, పవన్ సీహెచ్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. క్షితిజ్ జీవన్ రంధీర్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు.

వినూత్న కాన్సెప్ట్‌, ఆకట్టుకునే ఫస్ట్ లుక్‌తో ఇప్పటికే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ‘పళ్ళబురుసు’ నుంచి త్వరలోనే మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్‌ను విడుదల చేయనున్నారు.

నటీనటులు: సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, కిరణ్ మచా, ప్రజ్వల్ యాద్మ, గోమతి రెడ్డి

నిర్మాతలు: అన్నపూర్ణ స్టూడియోస్, ఆదిత్య పిట్టి, వివేక్ కృష్ణాని

సమర్పణ: అన్నపూర్ణ స్టూడియోస్ & EPIC స్టూడియోస్

గ్లింప్స్ మ్యూజిక్: పవన్ CH
రచయిత & దర్శకత్వం: ఉదయ్ చౌహాన్
సినిమాటోగ్రాఫర్: వినోద్ కె బంగారి
సంగీతం: పవన్ CH
ఎడిటర్: సృజన అడుసుమిల్లి
ప్రొడక్షన్ డిజైనర్: క్షితిజ్ జీవన్ రణధీర్
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఆనంద్ రెడ్డి కర్నాటి
క్రియేటివ్ ప్రొడ్యూసర్: అధిప్ అయ్యర్
కాస్ట్యూమ్ డిజైనర్: ప్రిన్సి వైద్
కొరియోగ్రాఫర్: విష్ణు
సాహిత్యం: సురేష్ గంగుల
లైన్ నిర్మాత: సంఘమిత్ర గడ్డం
డైరెక్షన్ టీమ్: సందీప్ మద్ది, వరుణ్ రామ్, నాని, చరణ్కుమార్ చేలేటి, విష్ణు, ప్రత్యూష
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: లక్ష్మీపతి కంటిపూడి
సినిమాటోగ్రఫీ టీమ్: నవాజ్ ఆలం, మిథైల్ బైరీ, చంద్రకాంత్
పబ్లిసిటీ డిజైనర్: ఎల్లోటూత్స్
మార్కెటింగ్: అన్నపూర్ణ స్టూడియోస్
PRO: వంశీ శేఖర్

పోస్ట్ ప్రొడక్షన్: అన్నపూర్ణ స్టూడియోస్
DI, మిక్స్ & VFX: అన్నపూర్ణ స్టూడియోస్
టెక్నికల్ హెడ్: C V రావు
కలర్స్: ఆయుష్
సౌండ్ మిక్స్: కన్నన్ గణపత్
సౌండ్ ఎఫెక్ట్స్ (SFX): నాగార్జున తాళ్లపల్లి
విజువల్ ఎఫెక్ట్స్ సూపర్‌వైజర్: వెంకటేష్ ఆళ్లగడ్డ

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.