Skip to content

‘పళ్ళ బురుసు’ సినిమా చూస్తున్నంతసేపూ నవ్వుతూనే ఉన్నాను: కింగ్ నాగార్జున

అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా సమర్పిస్తూ నిర్మిస్తున్న చిత్రం పళ్ళబురుసు. ఉదయ్ చౌహాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, ప్రజ్వల్ యాద్మా, గోమతి రెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది, ‘పళ్ళ బురుసు’ ఆగస్టు 14న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ వేడుకకు కింగ్ నాగర్జున ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రెస్ మీట్ లో కింగ్ నాగార్జున మాట్లాడుతూ: “అందరికీ నమస్కారం. అన్నపూర్ణ స్టూడియోస్‌కు ఇది 50వ సంవత్సరం. నాన్నగారు ప్రారంభించిన ఈ సంస్థలో ఎన్నో అద్భుతమైన చిత్రాలను నిర్మించాం. జాతీయ అవార్డులు…

Read more

‘పళ్ళబురుసు’ నుంచి కొత్త సోకు సాంగ్ రిలీజ్

అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న వినూత్న చిత్రం 'పళ్ళబురుసు' ఫస్ట్ గ్లింప్స్‌కు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి తొలి పాట 'కొత్త సోకు' లిరికల్ వీడియోను విడుదల చేశారు. పల్లె వాతావరణం, జానపద సంగీతం, పండుగ సందడిని ఆవిష్కరిస్తూ వచ్చిన ఈ పాట సినిమా ప్రపంచాన్ని మరోసారి ప్రేక్షకులకు పరిచయం చేస్తోంది. కథానాయకుడి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా రూపొందిన 'కొత్త సోకు' పాట సరదా సాహిత్యం, ఆకట్టుకునే బీట్‌తో అలరించింది "అంగి జూడే... ఆతడి పొంగు జూడే... దోతి రంగు జూడే..." అనే క్యాచీ హుక్ లైన్ ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ, పళ్ళబురుసు ప్రపంచానికి ఓ అందమైన పరిచయాన్ని ఇస్తోంది. సురేష్ గంగుల సాహిత్యం…

Read more

‘పళ్ళబురుసు’ అనౌన్స్‌మెంట్- 2026 ఆగస్టు14న గ్రాండ్ రిలీజ్

అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న వినూత్న చిత్రం 'పళ్ళబురుసు'ను అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ చిత్రాన్ని 2026 ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. తెలుగు సంస్కృతి, ప్రాంతీయతను ప్రతిబింబించే ఈ చిత్రం వినోదభరితమైన కామెడీ-డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తండ్రీకొడుకులుగా ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, ప్రజ్వల్ , గోమతి రెడ్డి, కిరణ్ మాచా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో జిల్లా కోర్టు ఆవరణలో పెద్ద టూత్‌బ్రష్‌ను త్రాసులా…

Read more