Skip to content

‘ధర్మన్’లో నయనతార కొత్త పోస్టర్‌ రిలీజ్‌

సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘ధర్మన్’ సినిమా నుంచి మేకర్స్ మరో ఆసక్తికరమైన అప్‌డేట్ ఇచ్చారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో లేడీ సూపర్‌స్టార్ నయనతార చేరినట్లు ప్రకటిస్తూ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. రజనీకాంత్, నయనతార మరోసారి జతకట్టడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ సమర్పణలో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా ఎంటర్‌టైనర్‌ను కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ నిర్మిస్తుండగా, అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌తో సినిమా అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందులో రజనీకాంత్ ఓ మిస్టీరియస్ డాక్టర్‌గా, చేతిలో రక్తపు మరకలున్న స్కాల్‌పెల్‌తో ‘ది డెడ్లీ డాక్టర్’ అనే విభిన్నమైన అవతార్‌లో కనిపించారు.

తాజాగా విడుదల చేసిన పోస్టర్‌లో రజనీకాంత్, నయనతార భారీ కిటికీ ముందు ఎదురెదురుగా నిలబడి కనిపించారు. కిటికీ నుంచి ప్రసరిస్తున్న బంగారు కాంతి మధ్యలో వారి సిల్హౌట్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ పోస్టర్‌లోని విజువల్స్‌తో పాటు, సినిమాలో వారి పాత్రలు ఎలా ఉండబోతున్నాయనే ఆసక్తి కూడా పెరిగింది.

రజనీకాంత్, నయనతార కలిసి నటించడం ఇది ఐదోసారి. గతంలో వీరిద్దరూ ‘చంద్రముఖి’, ‘కథానాయకుడు’, ‘దర్బార్’, ‘పెద్దన్న’ సినిమాల్లో కలిసి నటించారు. ఇప్పుడు ‘ధర్మన్’తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుండటంతో ఈ క్రేజీ పెయిర్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.

ఈ చిత్రానికి రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రదీప్ ఈ. రాఘవ్ ఎడిటింగ్. ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్లు అన్బరివ్ ఈ సినిమా యాక్షన్ సీక్వెన్స్‌లను రూపొందిస్తున్నారు.

రజనీకాంత్‌ను మిస్టీరియస్ డాక్టర్‌గా పరిచయం చేసిన ఫస్ట్ లుక్, ఇప్పుడు నయనతార ఎంట్రీతో ‘ధర్మన్’పై ఆసక్తి మరింత పెరిగింది. విభిన్నమైన కథాంశం, టాప్ స్టార్స్, సాంకేతిక నిపుణుల కలయికతో ఈ సినిమా ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.