‘ధర్మన్’లో నయనతార కొత్త పోస్టర్ రిలీజ్
సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘ధర్మన్’ సినిమా నుంచి మేకర్స్ మరో ఆసక్తికరమైన అప్డేట్ ఇచ్చారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో లేడీ సూపర్‌స్టార్ నయనతార చేరినట్లు ప్రకటిస్తూ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. రజనీకాంత్, నయనతార మరోసారి జతకట్టడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ సమర్పణలో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా ఎంటర్టైనర్ను కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ నిర్మిస్తుండగా, అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌తో సినిమా అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందులో రజనీకాంత్ ఓ మిస్టీరియస్ డాక్టర్‌గా, చేతిలో రక్తపు మరకలున్న స్కాల్పెల్తో ‘ది డెడ్లీ డాక్టర్’ అనే విభిన్నమైన అవతార్‌లో కనిపించారు. తాజాగా విడుదల చేసిన పోస్టర్లో రజనీకాంత్, నయనతార భారీ…
