Skip to content

2027 సంక్రాంతి రిలీజ్ కు వస్తున్న “వేట్టువం” మూవీ

సరికొత్త కథా నేపథ్యాలతో అద్భుతమైన మేకింగ్ తో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసే దర్శకుడు పా. రంజిత్ “వేట్టువం” టైటిల్ తో మరో భారీ యాక్షన్ చిత్రాన్ని మన ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమాలో ఆర్య, వి.ఆర్. దినేష్, శోభిత ధూళిపాళ్ల, కలైయరాసన్, మైమ్ గోపి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. “వేట్టువం” సినిమాను లెర్న్ అండ్ టీచ్ ప్రొడక్షన్, నీలమ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై ప్రొడ్యూసర్స్ ఎస్. సాయి దేవానంద్, ఎస్. సాయి వెంకటేశ్వరన్, పా.రంజిత్ నిర్మిస్తున్నారు. భారీ పాన్ ఇండియా యాక్షన్ మూవీగా “వేట్టువం” తెరకెక్కుతోంది. ఈ రోజు మేకర్స్ ఈ సినిమా రిలీజ్ అనౌన్స్ మెంట్ చేశారు. వచ్చే సంక్రాంతి పండక్కి ఈ సినిమాను వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో 2027 సంక్రాంతి బాక్సాఫీస్ బరిలో మరో ఇంట్రెస్టింగ్ మూవీ చేరినట్లయింది.

“వేట్టువం” సినిమా నేపథ్యాన్ని, పాత్రల స్వభావాలను, ఎంత భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారో వివరిస్తూ ఇటీవల రిలీజ్ చేసిన ‘వరల్డ్ ఆఫ్ వేట్టువం’ వీడియో హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ వీడియోకు తెలుగులో రానా దగ్గుబాటి, మలయాళంలో సౌబిన్ షాహిర్, కన్నడ వెర్షన్ కు కిచ్చా సుదీప్, తమిళంలో పా. రంజిత్ వాయిస్ అందించడం క్రేజ్ తీసుకొచ్చింది.

విభిన్న సమూహాల మధ్య ఉండే సంఘర్షణలు, పోరాటాలు, ఊహకందని సంఘటనలను ప్రధానాంశంగా తీసుకుని దర్శకుడు పా. రంజిత్ “వేట్టువం” సినిమాను రూపొందిస్తున్నారు. “వేట్టువం” పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులకు ఒక సరికొత్త సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ అందించబోతోంది.

నటీనటులు – ఆర్య, వి.ఆర్. దినేష్, శోభిత ధూళిపాళ్ల, కలైయరాసన్, మైమ్ గోపి, గురు సోమసుందరం, షబీర్ కల్లరక్కల్, జాన్ విజయ్, సాయి దీన, ఆనంద్ సామి, హరీశ్ ఉత్తమన్, లిజీ, లింగేష్ ప్రేమ్ కుమార్, కవిత భారతి, అర్ుజన్, శాంతకుమార్, మెలొడీ మనీషా, నిమ్మి, రాఫేల్, విక్రమ్, నవీన్, ప్రకాశ్, తదితరులు

టెక్నీషియన్స్
———————-
యాక్షన్ – దిలీప్ సుబ్బరాయన్
ఆర్ట్ డైరెక్టర్ – ఎస్ఎస్ మూర్తి
ఎడిటర్ – సెల్వ ఆర్.కె.
డీవోపీ – రూపేష్ షాజి
మ్యూజిక్ – జి.వి.ప్రకాష్ కుమార్
కో రైటర్స్ – సంతోష్ నారాయణన్ చెందిల్ కుమార్
బ్యానర్స్ – లెర్న్ అండ్ టీచ్ ప్రొడక్షన్, నీలమ్ ప్రొడక్షన్స్
ప్రొడ్యూసర్స్ – ఎస్. సాయి దేవానంద్, ఎస్. సాయి వెంకటేశ్వరన్, పా.రంజిత్
స్క్రిప్ట్, డైరెక్షన్ – పా. రంజిత్
పీఆర్ఓ – సురేష్ (ఎస్ కే మీడియా)

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.