తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కల్ట్ సీక్వెల్ ‘ENE Repeat' లో విశ్వక్ సేన్, అభినవ్…
“కొరివి” టైటిల్ అనౌన్స్ మెంట్
డైరెక్టర్ శ్రీధర్ గాదె బర్త్ డే సందర్భంగా “కొరివి” సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్, గ్లింప్స్ రిలీజ్ చేసిన మేకర్స్
“ఎస్ఆర్ కళ్యాణమండపం” చిత్రంతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించి..దర్శకుడిగా ప్రతిభ చాటుకున్న డైరెక్టర్ శ్రీధర్ గాదె రూపొందిస్తున్న కొత్త చిత్రానికి “కొరివి” టైటిల్ అనౌన్స్ చేశారు. శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్ పై ఆది సాయి కుమార్ తో చుట్టాలబ్బాయ్ వంటి ఫ్యామిలీ మూవీ, ఆనంద్ దేవరకొండతో “హైవే” వంటి యూనిక్ థ్రిల్లర్ మూవీని నిర్మించిన ప్రొడ్యూసర్ వెంకట్ తలారి..తమ ప్రొడక్షన్ నెం.3గా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఈ “కొరివి” చిత్రంలో “కమిటీ కుర్రోళ్లు” మూవీ ఫేమ్ ఈశ్వర్ రాచి రాజు హీరోగా నటిస్తుండగా, నందు మురళీధర్, లిఖిత హీరోయిన్స్ గా నటిస్తున్నారు. పూజిత పొన్నాడ, సింధు కాసారం ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం “కొరివి” సినిమా శరవేగంగా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది.
ఈ రోజు దర్శకుడు శ్రీధర్ గాదె బర్త్ డే సందర్భంగా మేకర్స్ ఈ చిత్రానికి “కొరివి” అనే టైటిల్ అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. మాయా నది ప్రాంతం లో ఉన్న నిధికి కాపు కాసే ఓ కొరివి ఆ దెయ్యం కథ ఇది.. ఈ కొరివి..బిగ్ స్క్రీన్ మీద ఆడియెన్స్ కు థ్రిల్లింగ్ ఎక్సిపీరియన్స్ ఇవ్వబోతోంది. ఈ టైటిల్ గ్లింప్స్ లో ఇంట్రెస్టింగ్ మేకింగ్ విజువల్స్ చూపించడం విశేషం. టైటిల్ అనౌన్స్ మెంట్, ఈ గ్లింప్స్ తో “కొరివి” మూవీ టీమ్ డైరెక్టర్ శ్రీధర్ గాదెకు బర్త్ డే విశెస్ తెలియజేసింది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ యూనిక్ హారర్ మూవీని సరికొత్త కథా కథనాలతో దర్శకుడు శ్రీధర్ గాదె తెరకెక్కిస్తున్నారు.
నటీనటులు – ఈశ్వర్ రాచి రాజు, నందు మురళీధర్, లిఖిత, పూజిత పొన్నాడ, సింధు కాసారం, సురేష్ గురు, రాయల్ శ్రీ, మట్టా శివకుమార్, విహా దీకొండ, సునీత మనోహర్, అమ్మ రామచంద్రయ్య, తదితరులు
టెక్నీషియన్స్
——————-
మేకప్ – ఖారిడు గోపీనాయుడు
కాస్ట్యూమ్ డిజైనర్ – భవాని అద్దంకి
కో రైటర్ – టి.ఎన్. సుబ్రహ్మణ్యం
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – విప్లవ్
యాక్షన్ – దిలీప్
ప్రొడక్షన్ డిజైనర్ – నాని దేవరపల్లి
ఎడిటింగ్ – శ్రీధర్, వి.బి.జె.
మ్యూజిక్ – సాయి కార్తీక్
డీవోపీ – సతీష్ రెడ్డి మాసం
పీఆర్ఓ – గాండ్ల శ్రీనివాస్ (జి.ఎస్. మీడియా)
ప్రొడ్యూసర్ – వెంకట్ తలారి
స్క్రిప్ట్, డైరెక్టర్ – శ్రీధర్ గాదె



