Skip to content

‘ఆదర్శ కుటుంబం’ లో మా పాట వాడేయడం వల్ల నష్టపోతాం: నిర్మాత మంచి వెంకట్

▪️‘పర్ణశాల’ సినిమాలోని ‘జిమ్ జిమ్ తార’ పాట
▪️ చిన్న సినిమాను బ‌తికించండి అంటూ ‘పర్ణశాల’ నిర్మాత ఆవేద‌న‌
▪️ ‘ఆదర్శ కుటుంబం’లో 15 సెకన్ల పాట వినియోగంపై అభ్యంతరం
▪️ త్వరలో ప్రేక్షకుల ముందుకు ‘పర్ణశాల’ సినిమా

విడుదలకు సిద్ధమవుతున్న ‘పర్ణశాల’ సినిమాలోని ‘జిమ్ జిమ్ తార’ పాటను ‘ఆదర్శ కుటుంబం’ చిత్రంలో ఉపయోగించడంపై ‘పర్ణశాల’ నిర్మాత మంచి వెంకట్ అభ్యంతరం వ్యక్తం చేశారు. హీరో వెంకటేష్‌కు సంబంధించిన ఓ సన్నివేశంలో తమ సినిమా పాటను వినియోగించారని, మా సినిమా రిలీజ్ కాకముందే ఇలా మా సినిమాలోని పాటను వాడటం చిన్న సినిమాకు అన్యాయం చేయడమే అని ఆయన పేర్కొన్నారు. చిన్న సినిమాను బ‌తికించండి అంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఈ విషయంపై మీడియాతో మాట్లాడిన ‘పర్ణశాల’ నిర్మాత‌ మంచి వెంకట్.. ఇప్పటికే ఆదిత్య మ్యూజిక్ ద్వారా అధికారికంగా విడుదల చేసిన తమ సినిమా పాటను అనుమతి లేకుండా మరో చిత్రంలో ఉపయోగించడం వల్ల ‘పర్ణశాల’ సినిమాకు నష్టం వాటిల్లే అవకాశం ఉందన్నారు. ఇలాంటి చర్యలు చిన్న సినిమాల మనుగడకు ఇబ్బందికరంగా మారుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఒక్కసారిగా మరోసారి పర్ణశాల సినిమాలోని ‘జిమ్ జిమ్ తార’ పాట జనాల్లో చర్చల్లో నిలిచింది.

ఎస్‌ఎల్‌టీ ఫిలిమ్స్ బ్యానర్‌పై మంచి వెంకట్ నిర్మిస్తున్న ‘పర్ణశాల’ చిత్రానికి వై.జి. భరత్ దర్శకత్వం వహిస్తున్నారు. హారర్ కామెడీ, సస్పెన్స్ థ్రిల్లర్ అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సినిమా ప్రమోషన్లలో భాగంగా ‘జిమ్ జిమ్ తార’ పాటను లక్ష్మీదేవితో పాడించి చిత్ర బృందం వినూత్నంగా ప్రచారం చేపట్టింది. ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన ఈ పాట ఇప్పటికే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. వినూత్న ప్రచారంతో టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన ‘పర్ణశాల’ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.