Skip to content

‘సపర్య’ ప్రాజెక్ట్‌ను ప్రక‌టించిన కాదంబరి కిరణ్

▪️అనాథలు, ఒంటరి వృద్ధులు, పేదలకు అండగా ‘వుయ్ కేర్ ఫర్ అన్ కేర్డ్’ ▪️ పేద సినీ క‌ళాకారుల కోసం అనేక సేవ కార్యక్ర‌మాలు ▪️ సినీ కార్మికుల పిల్లలకు ఉచిత నీట్, ఐఐటీ శిక్షణ ▪️ 'మనంసైతం' సేవ‌ల‌కు 13 వ‌సంతాలు పూర్తి హైదరాబాద్: ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం.. ఆర్థికంగా వెనుకబడిన వారికి భరోసా ఇవ్వడం.. ఒంటరిగా మిగిలిన వృద్ధులకు తోడుగా నిలవడం.. సేవను ఒక కార్యక్రమంగా కాకుండా బాధ్యతగా భావిస్తూ ముందుకు సాగుతున్న ‘మనం సైతం’ ఫౌండేషన్ మరో బృహత్తర సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘సపర్య – వుయ్ కేర్ ఫర్ అన్ కేర్డ్’ పేరుతో నూతన ప్రాజెక్టును ప్రారంభిస్తున్నట్లు ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, నటుడు కాదంబరి కిరణ్…

Read more

కన్నడ స్టార్ విజయ్ రాఘవేంద్ర హీరోగా ‘ఆన్ డ్యూటీ’

హైదరాబాద్: క్రైమ్, యాక్షన్, థ్రిల్‌తో కూడిన విభిన్న కథలను తెరపై ఆవిష్కరించడంలో తనదైన ముద్ర వేసుకున్న క్రియేటివ్ డైరెక్టర్ సంజీవ్ మేగోటి మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. తెలుగులో వరలక్ష్మి శరత్‌కుమార్, నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన ‘పోలీస్ కంప్లైంట్’ మూవీతో హిట్ కొట్టిన‌ ఆయన.. ఇప్పుడు కన్నడలో తన అప్‌క‌మింగ్ మూవీ రూపొందించబోతున్నారు. 'ఆన్ డ్యూటీ' టైటిల్‌తో తెర‌కెక్క‌నున్న ఈ మూవీ కన్నడ కంఠీరవ డాక్టర్ రాజ్‌కుమార్ కుటుంబానికి చెందిన ప్రముఖ హీరో విజయ్ రాఘవేంద్ర కథానాయకుడిగా నటించనున్నాడు. ఇప్పటికే క్రైమ్, సస్పెన్స్, యాక్షన్ జానర్‌లో పలు విభిన్న చిత్రాల్లో నటించిన విజయ్ రాఘవేంద్ర.. సంజీవ్ మేగోటి చెప్పిన ఈ సరికొత్త కథకు ఓకే చెప్పడం…

Read more

ఘనంగా జరిగిన ‘జై గౌరీపుత్ర గణేశా’ ఆడియో మరియు ట్రైలర్ లాంచ్ ఈవెంట్

విద్యార్థులపై విద్యా ఒత్తిడి.. మానసిక సమస్యలు, ఆత్మహత్యల నివారణే చిత్ర ప్రధానాంశం హైదరాబాద్: శ్రీ వాత్సల్య ఆడియో అండ్ వీడియో ఇల్లస్ట్రేషన్స్ పతాకంపై రూపొందిన తొలి చిత్రం ‘జై గౌరీపుత్ర గణేశా’ ఆడియో, ట్రైలర్ విడుదల వేడుక హైదరాబాద్‌లోని తెలుగు ఫిలిం చాంబర్ ప్రీవ్యూ హాల్‌లో ఘనంగా జరిగింది. చిత్ర రచయిత, దర్శకుడు, నిర్మాత స్వామి శ్రీవాత్సల్య ధర్మ వీర ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు సినీ, రాజకీయ, ఆధ్యాత్మిక ప్రముఖులు పాల్గొన్నారు. స్వామి శ్రీవాత్సల్య ధర్మ వీర మాట్లాడుతూ.. గత 26 సంవత్సరాలుగా తిరువన్నామలైలో వైదిక ధర్మశాస్త్రాలను అధ్యయనం చేసిన తాను, నేటి యువతలో నైతిక విలువలు, మానవతా దృక్పథాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టినట్లు తెలిపారు. ‘జై…

Read more

తెలుగు చిత్ర నిర్మాతల మండలి ఎన్నికల్లో వైస్ ప్రెసిడెంట్ గా మోహన్ వడ్లపట్ల

▪️ఉపాధ్యక్ష పదవికి నలుగురు పోటీ పడగా మోహన్ వడ్లపట్లకు అత్యధిక మెజార్టీ ▪️ ‘మన ప్యానెల్’ ప్రభంజనం హైదరాబాద్: తెలుగు చిత్ర నిర్మాతల మండలి (TFPC) 2026 ఎన్నికల్లో ‘మన ప్యానెల్’ ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో ఉపాధ్యక్ష (వైస్ ప్రెసిడెంట్) పదవి కోసం నలుగురు అభ్యర్థులు—మోహన్ వడ్లపట్ల, జీవిత, దామోదర్ ప్రసాద్, భరత్ చౌదరి పోటీ పడ్డారు. వీరిలో ‘మన ప్యానెల్’ తరఫున నిలబడిన మోహన్ వడ్లపట్ల అందరికంటే అత్యధిక మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఎగ్జిక్యూటివ్ కమిటీకి సంబంధించి మొత్తం 15 స్థానాల్లో ‘మన ప్యానెల్’కు చెందిన 12 మంది అభ్యర్థులు విజయం సాధించారు. మొత్తంగా నిర్మాతల మండలి ఎన్నికల్లో ‘మన ప్యానెల్’ ఆధిపత్యం స్పష్టంగా కనిపించగా, నలుగురి…

Read more

కృష్ణాష్టమి కానుకగా ‘కృష్ణంభ‌జే’ ఫస్ట్ లుక్ లాంచ్

▪️సోష‌ల్ మీడియాలో లాంచ్ చేసిన బ్రహ్మాజీ ▪️ భక్తిరస చిత్రంలో మార్కండేయుడిగా బ్రహ్మాజీ ▪️ శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న 'కృష్ణంభ‌జే' మూవీ హైదరాబాద్‌: జయశ్రీ మీడియా సమర్పణలో తెరకెక్కుతున్న భక్తిరస చిత్రం ‘కృష్ణంభజే’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. కలాల్ శ్రీనివాస్ నిర్మాణంలో నాగరాజ్ కొట్టే ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో ప్రముఖ సీనియ‌ర్ న‌టుడు బ్రహ్మాజీ మార్కండేయ పాత్రను పోషిస్తున్నారు. కృష్ణాష్టమి కానుకగా బ్రహ్మాజీ 'కృష్ణంభ‌జే' ఫస్ట్ లుక్‌ను సోష‌ల్ మీడియాలో లాంచ్ చేశారు. పోస్ట‌ర్‌లో బ్రహ్మాజీ లుక్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. బ్రహ్మాజీ మార్కండేయుడి గెటప్‌లో సంప్రదాయ ఆధ్యాత్మిక రూపంలో కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు. కాషాయ వస్త్రధారణ, రుద్రాక్ష మాలలు, నుదుటిపై విభూతి, చేతిలో ఆయుధంతో ఆయన లుక్‌ ప్రత్యేకంగా నిలుస్తోంది. భక్తి,…

Read more

టాలీవుడ్ పెద్దలపై ‘ఓ అందాల రాక్షసి’ దర్శకుడి న్యాయ పోరాటం

▪️దిల్ రాజు, సురేష్ బాబు, ఫిల్మ్ ఛాంబర్ వైస్ ప్రెసిడెంట్లు నాగవంశీ, భరత్ భూషణ్, సెక్రటరీ అశోక్ కుమార్, ట్రెజరర్ ప్రసన్న కుమార్‌లకు ఫైనల్ లీగల్ నోటీసులు ▪️ PVR INOXకు చెందిన అజయ్ బిజిలీ, మేనేజర్ మహేష్‌, ఏసియ‌న్ సినిమాస్ (Asian Cinemas) ఎండీ సునీల్ నారాజ్, మేనేజ‌న్ ప్ర‌శాంత్లకు కూడా ఫైనల్ లీగల్ నోటీసులు ▪️ ముఖ్య‌మంత్రికి ఫిర్యాదు చేసిన షిరాజ్ మెహది ▪️ చిన్న సినిమాలను బతకనివ్వడం లేదు.. ▪️ వంద‌లో 2-3 సినిమాలనే ప్రొజెక్ట్ చేస్తున్నారు ▪️ నా సినిమా వరకు నేను ఓడిపోను.. ▪️ న్యాయం జరిగే వరకు పోరాటం ఆపను’: షిరాజ్ మెహది హైదరాబాద్‌: తెలుగు సినీ పరిశ్రమలో చిన్న సినిమాలకు ఎదురవుతున్న ఇబ్బందులు,…

Read more

‘మై లవ్’ సినిమా ఫస్ట్ లుక్ విడుదల

హైదరాబాద్: జోష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో రూపొందుతున్న ‘మై లవ్’ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను ఆగస్టు 22న హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ ప్రసాద్ ఆడిటోరియంలో ఘనంగా విడుదల చేశారు. అదే వేదికపై జోష్ ఎంఆర్ఎస్ హైదరాబాద్ అవార్డ్స్–2026 కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఈ సందర్బంగా మై లవ్ హీరో సంజోష్ తగరం మాట్లాడుతూ, మీ ఫాస్ట్ లో కానీ ఫ్యూచర్ లో కానీ ఎదో ఒక అమ్మాయిని ప్రేమించే ఉంటారు. మళ్ళీ ఆ అమ్మాయిని గుర్తుకు తెచ్చే సినిమా "మై లవ్ ' ఇదొక ఫీల్ గుడ్ సినిమా లవ్ ఎంటర్టన్మెంట్ డివోషనల్ కాన్సెప్ట్ తో ఇప్పటి వరకు ఎవరు టచ్ చేయని కొత్త పాయింట్ తో ఈ సినిమా చేస్తున్నాం…

Read more

ఘనంగా ‘శివ గాడి జింద‌గీ’ మూవీ టైటిల్, సాంగ్ లాంచ్!

ఐశ్వర్య సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై సింధుసూర్య నిర్మిస్తున్న నూతన చిత్రం 'శివ గాడి జింద‌గీ'. సచిన్ రామ్ ప్రతాప్, హాసిని దేవరకొండ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి వినయ్ రెడ్డి చందుపట్ల దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌ను నిర్మాత సురేష్‌బాబు లాంచ్ చేశారు. సాంగ్‌ను అతిథులుగా పాల్గొన్న‌ రీల్ఆన్ సీఈఓ దాశరథం బిట్ల, రాయల్ ఎన్‌ఫీల్డ్ డీలర్ ప్రిన్సిపల్ పూల సందీప్ కుమార్ నాయుడు, ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్టు శివ మ‌ల్లాల‌ విడుద‌ల చేశారు. చిత్ర యూనిట్‌కు తమ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి సగటు మనిషి జీవితానికి ప్రతిరూపం! కామెడీ, ఎమోషన్, డ్రామా, ఫ్రెండ్‌షిప్, లవ్ వంటి అన్ని రకాల వినోద అంశాలతో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఒక…

Read more

నేటి నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ‘పోలీస్ కంప్లైంట్’ స్ట్రీమింగ్

▪️తెలుగు, కన్నడ భాష‌ల్లో జూన్‌లో విడుద‌లైన చిత్రం ▪️ 300 థియేట‌ర్‌ల‌లో విడుద‌లై హిట్ టాక్ హారర్-యాక్షన్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న ‘పోలీస్ కంప్లైంట్’ చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. జూన్‌లో థియేటర్లలో విడుదలై మంచి స్పందనతో పాటు సానుకూల సమీక్షలు అందుకున్న ఈ చిత్రం, ఈ శుక్ర‌వారం (జూలై 31) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు, కన్నడ భాష‌ల్లో దాదాపు 300 థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. విడుదలైన తొలి రోజు నుంచే హారర్, యాక్షన్, థ్రిల్లర్ అంశాల సమ్మేళనంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమాకు విమర్శకుల నుంచి ప్రశంసలు లభించాయి…

Read more

భారతీయ సినీ పరిశ్రమకు బల్గేరియా రెడ్ కార్పెట్!

▪️యూరప్‌లో కొత్త ప్రొడక్షన్ హబ్‌గా బల్గేరియా ▪️ భారతీయ చిత్ర నిర్మాతలకు సువ‌ర్ణ‌వ‌కాశం ▪️ 'ఆర్ఆర్ఆర్' బల్గేరియా నిర్మాత టోడర్ లాజరోవ్ జుజి ఆహ్వానం హైదరాబాద్: భారతీయ సినిమా ప్రపంచవ్యాప్తంగా తన మార్కెట్‌ను విస్తరించుకుంటున్న వేళ.. యూరప్‌లోని బల్గేరియా దేశం భారతీయ సినీ పరిశ్రమకు కొత్త ప్రొడక్షన్ హబ్‌గా అవతరించేందుకు సిద్ధమవుతోంది. తక్కువ నిర్మాణ వ్యయం, ఆకర్షణీయమైన ఆర్థిక ప్రోత్సాహకాలు, అత్యాధునిక చిత్రీకరణ సదుపాయాలు, అనుభవజ్ఞులైన సాంకేతిక నిపుణులు, విభిన్న సహజ-చారిత్రక లొకేషన్లతో బల్గేరియా భారతీయ చిత్ర నిర్మాతలను ఆహ్వానిస్తోంది. ఈ కార్యక్రమానికి ముందుండి నాయకత్వం వహిస్తున్న టీఎల్ ప్రొడక్షన్ వ్యవస్థాపకుడు, 'ఆర్ఆర్ఆర్' సినిమా బల్గేరియా షెడ్యూల్ నిర్మాత, లైన్ ప్రొడ్యూసర్ టోడర్ లాజరోవ్ జుజి భారతీయ చిత్ర పరిశ్రమతో దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని…

Read more