Skip to content

కన్నడ స్టార్ విజయ్ రాఘవేంద్ర హీరోగా ‘ఆన్ డ్యూటీ’

హైదరాబాద్: క్రైమ్, యాక్షన్, థ్రిల్‌తో కూడిన విభిన్న కథలను తెరపై ఆవిష్కరించడంలో తనదైన ముద్ర వేసుకున్న క్రియేటివ్ డైరెక్టర్ సంజీవ్ మేగోటి మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. తెలుగులో వరలక్ష్మి శరత్‌కుమార్, నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన ‘పోలీస్ కంప్లైంట్’ మూవీతో హిట్ కొట్టిన‌ ఆయన.. ఇప్పుడు కన్నడలో తన అప్‌క‌మింగ్ మూవీ రూపొందించబోతున్నారు. ‘ఆన్ డ్యూటీ’ టైటిల్‌తో తెర‌కెక్క‌నున్న ఈ మూవీ కన్నడ కంఠీరవ డాక్టర్ రాజ్‌కుమార్ కుటుంబానికి చెందిన ప్రముఖ హీరో విజయ్ రాఘవేంద్ర కథానాయకుడిగా నటించనున్నాడు.

ఇప్పటికే క్రైమ్, సస్పెన్స్, యాక్షన్ జానర్‌లో పలు విభిన్న చిత్రాల్లో నటించిన విజయ్ రాఘవేంద్ర.. సంజీవ్ మేగోటి చెప్పిన ఈ సరికొత్త కథకు ఓకే చెప్పడం సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. విజయ్ రాఘవేంద్ర ఫిల్మోగ్రఫీలో కూడా క్రైమ్, థ్రిల్లర్, యాక్షన్ కథలు కనిపిస్తాయి. విజయ్ రాఘవేంద్ర ఇటీవ‌ల న‌టించిన‌ ‘సెకండ్ కేస్ ఆఫ్ సీతారాం’ (Second Case of Seetharam) మూవీ ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతూ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.

ఇక క్రియేటివ్ డైరెక్ట‌ర్ సంజీవ్ మేగోటి తెరకెక్కించిన‌ ‘పోలీస్ కంప్లైంట్’ మూవీ సినిమా క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలతో రూపొంది సూప‌ర్ హిట్ అయింది. వరలక్ష్మి శరత్‌కుమార్, నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో రూపొందిన ‘పోలీస్ కంప్లైంట్’కు థియేట‌ర్‌లో ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. తాజాగా అమెజాన్ ప్రైమ్‌లో కూడా ట్రెండింగ్‌లో కొన‌సాగుతోంది.

ఈ నేపథ్యంలో ఇటీవ‌ల త‌మత‌మ సినిమాల‌తో సూప‌ర్ హిట్ కొట్టిన హీరో విజయ్ రాఘవేంద్ర, డైరెక్ట‌ర్ సంజీవ్ మేగోటి క‌లిసి రూపొందించ‌బోయే ప్రాజెక్టు ఇప్పుడు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ హిట్ కాంబినేష‌న్‌పై అప్పుడే భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

పుష్క‌ర కాలం విరామం తర్వాత కన్నడ చిత్ర పరిశ్రమలో మళ్లీ దర్శకత్వం వహిస్తున్న సంజీవ్ మేగోటి, ఈసారి క్రైమ్ అండ్ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో సరికొత్త కథాంశంతో సినిమా తెరకెక్కించనున్నారు. మరింత భారీ స్థాయిలో, కొత్త కథనం, విభిన్న స్క్రీన్‌ప్లేతో తెరకెక్కించేందుకు ఈ క్రియేటివ్ డైరెక్ట‌ర్ సిద్ధమవుతున్నారు. ఇప్పటివరకు ప్రేక్షకులు చూసిన కథలకు భిన్నంగా, నెవర్ బిఫోర్ అనే రీతిలో కొత్త స్క్రీన్‌ప్లేతో ఈ చిత్రాన్ని రూపొందించేందుకు ఆయన సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

విజయ్ రాఘవేంద్ర వంటి స్టార్ హీరో.. సంజీవ్ మేగోటి వంటి విభిన్న కథలను తెరకెక్కించే దర్శకుడు.. క్రైమ్ అండ్ యాక్షన్ బ్యాక్‌డ్రాప్.. సరికొత్త స్క్రీన్‌ప్లే.. ఈ కాంబినేషన్‌పై కన్నడ సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు, నిర్మాణ సంస్థ తదితర వివరాలను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.