ఒక్క పాటతో సోషల్ మీడియాను షేక్ చేసిన ‘పర్ణశాల’ టీమ్
హైదరాబాద్: సినిమా విడుదలకు ముందే ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించాలంటే భారీ ప్రమోషన్ బడ్జెట్.. స్టార్ హీరోలు.. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు.. వరుసగా రీల్స్, ఈవెంట్స్ అవసరమని భావించే రోజుల్లో ఓ చిన్న సినిమా టీమ్ మాత్రం అందుకు పూర్తి భిన్నమైన దారిని ఎంచుకుంది. ఒక్క క్రియేటివ్ ఐడియాతో భారీ ప్రమోషన్ ఖర్చును తగ్గించడమే కాకుండా.. తమ సినిమాను జనాల్లోకి బలంగా తీసుకెళ్లింది. SLT ఫిలిమ్స్ బ్యానర్ నుంచి తెరకెక్కిన అదే ‘పర్ణశాల’ టీమ్ వేసిన మాస్టర్ ప్లాన్! హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలోని ‘జిమ్ జిమ్ తార’ పాట ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారుతోంది. సినిమా ప్రమోషన్లో భాగంగా చిత్ర బృందం చేసిన ఓ వినూత్న ప్రయత్నం అనూహ్యమైన…
