2027 సంక్రాంతి రిలీజ్ కు వస్తున్న “వేట్టువం” మూవీ
సరికొత్త కథా నేపథ్యాలతో అద్భుతమైన మేకింగ్ తో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసే దర్శకుడు పా. రంజిత్ "వేట్టువం" టైటిల్ తో మరో భారీ యాక్షన్ చిత్రాన్ని మన ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమాలో ఆర్య, వి.ఆర్. దినేష్, శోభిత ధూళిపాళ్ల, కలైయరాసన్, మైమ్ గోపి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. "వేట్టువం" సినిమాను లెర్న్ అండ్ టీచ్ ప్రొడక్షన్, నీలమ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై ప్రొడ్యూసర్స్ ఎస్. సాయి దేవానంద్, ఎస్. సాయి వెంకటేశ్వరన్, పా.రంజిత్ నిర్మిస్తున్నారు. భారీ పాన్ ఇండియా యాక్షన్ మూవీగా "వేట్టువం" తెరకెక్కుతోంది. ఈ రోజు మేకర్స్ ఈ సినిమా రిలీజ్ అనౌన్స్ మెంట్ చేశారు. వచ్చే సంక్రాంతి పండక్కి ఈ సినిమాను వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు…
