‘సెయాన్’ లో హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సే- డివైన్ ఫస్ట్ లుక్ రిలీజ్
వెర్సటైల్ స్టార్ శివకార్తికేయన్, దర్శకుడు శివకుమార్ మురుగేశన్ దర్శకత్వంలో, కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ నిర్మిస్తున్న 'సెయాన్' కోసం చేతులు కలిపారు. బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన అమరన్ తర్వాత శివకార్తికేయన్ మరోసారి రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్‌తో కొలాబరేట్ కావడం విశేషం. విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్ విజయాన్ని అందుకున్న ఆ చిత్రంతో ఏర్పడిన క్రియేటివ్ జర్నీ ఇప్పుడు మరింత బలపడింది. గ్రాండ్ రూరల్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్.. ట్రెడిషన్, డివైన్ వైబ్ మేళవింపుగా ఆకట్టుకుంటోంది. గాజుల షాప్ బ్యాక్‌డ్రాప్‌లో ఆమె కనిపించిన తీరు పాత్రలోని ధైర్యం,…
