Skip to content

కమల్ హాసన్ సమక్షంలో ఘనంగా ప్రారంభమైన శివకార్తికేయన్ ‘సెయాన్’ షూటింగ్

కమల్ హాసన్ సమక్షంలో ఘనంగా ప్రారంభమైన శివకార్తికేయన్ ‘సెయాన్’ షూటింగ్ Telugu News

వెర్సటైల్ స్టార్ శివకార్తికేయన్, కమల్ హాసన్, ఆర్ మహేంద్రన్ నిర్మిస్తున్న ‘సెయాన్” ప్రాజెక్ట్ కోసం దర్శకుడు శివకుమార్ మురుగేశన్‌తో చేతులు కలిపారు. బాక్సాఫీస్ వద్ద ఘన విజయం అందుకున్న ‘అమరన్’ తర్వాత రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌లో శివకార్తికేయన్ చేస్తున్న చిత్రమిది. శివకార్తికేయన్ పుట్టినరోజున విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌కు అద్భుతమైన స్పందన లభించింది.

ఈ రోజు నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ విషయాన్ని మేకర్స్ ఓ ఇంటెన్స్ పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. పోస్టర్‌లో శివకార్తికేయన్ రా అండ్ పవర్‌ఫుల్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఆయన కళ్లలో కనిపిస్తున్న ఆగ్రహం క్యారెక్టర్ పవర్ ని చూపిస్తున్నాయి. ఈ పోస్టర్ సినిమా ఆధ్యాత్మికతతో పాటు మాస్ యాక్షన్ ఎలిమెంట్స్‌ను కూడా కలిగి ఉంటుందనే సంకేతాలు ఇస్తోంది.

ఈ చిత్రాన్ని భారీ రూరల్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. ఎమోషన్స్, మాస్ అప్పీల్, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే ఎంటర్టైనర్ గా సినిమా రూపొందనుంది.

ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. వివేక్ విజయకుమార్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తుండగా, షాన్ లోకేష్ ఎడిటింగ్ చేస్తున్నారు. యాక్షన్ డైరెక్టర్‌గా సుప్రీమ్ సుందర్ పని చేస్తున్నారు. ప్రొడక్షన్ డిజైన్‌ను అరుణ్ వెంకటరామూడి రూపొందిస్తున్నారు.

ఇతర నటీనటుల వివరాలను త్వరలో ప్రకటించనున్నారు.

తారాగణం: శివకార్తికేయన్

సాంకేతిక సిబ్బంది:
రచన & దర్శకత్వం: శివకుమార్ మురుగేశన్
సమర్పణ: కమల్ హాసన్
నిర్మాతలు: కమల్ హాసన్ & ఆర్ మహేంద్రన్
బ్యానర్లు: రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, టర్మరిక్ మీడియా
సహ నిర్మాత: S. డిస్నీ
సంగీతం: సంతోష్ నారాయణన్
DOP: వివేక్ విజయకుమార్
ఎడిటర్: శాన్ లోకేష్
యాక్షన్ కొరియోగ్రఫీ: సుప్రీమ్ సుందర్
ప్రొడక్షన్ డిజైన్: అరుణ్ వెంజరమూడు
PRO: వంశీ-శేఖర్

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.