కమల్ హాసన్ సమక్షంలో ఘనంగా ప్రారంభమైన శివకార్తికేయన్ ‘సెయాన్’ షూటింగ్
వెర్సటైల్ స్టార్ శివకార్తికేయన్, కమల్ హాసన్, ఆర్ మహేంద్రన్ నిర్మిస్తున్న 'సెయాన్'' ప్రాజెక్ట్ కోసం దర్శకుడు శివకుమార్ మురుగేశన్‌తో చేతులు కలిపారు. బాక్సాఫీస్ వద్ద ఘన విజయం అందుకున్న 'అమరన్' తర్వాత రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌లో శివకార్తికేయన్ చేస్తున్న చిత్రమిది. శివకార్తికేయన్ పుట్టినరోజున విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. ఈ రోజు నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ విషయాన్ని మేకర్స్ ఓ ఇంటెన్స్ పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. పోస్టర్‌లో శివకార్తికేయన్ రా అండ్ పవర్‌ఫుల్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఆయన కళ్లలో కనిపిస్తున్న ఆగ్రహం క్యారెక్టర్ పవర్ ని చూపిస్తున్నాయి. ఈ పోస్టర్ సినిమా ఆధ్యాత్మికతతో పాటు మాస్…
