Skip to content

‘ఓం’ మూవీలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా సాయిపల్లవి

వెర్స‌టైల్ స్టార్ హీరో ధనుష్ క‌థానాయ‌కుడిగా.. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న‌ భారీ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఓం – చాప్టర్ 1: ఉధిరం – ది బ్లడ్ వుడ్’ నుంచి హీరోయిన్‌ సాయిపల్లవి క్యారెక్టర్ ఇంట్రడక్షన్ వీడియో విడుదలైంది. ఈ సినిమాలో ఆమె నిత్యారెడ్డి అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటివరకు చేయని విభిన్నమైన పాత్రలో సాయిపల్లవి ఆకట్టుకుంటున్నారు. పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ఆమె తనదైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నారు.

సాయి ప‌ల్ల‌వి పాత్ర విష‌యానికి వ‌స్తే.. నిత్యారెడ్డి తెలివితేటలు, నిజాయతీ, అనుభవం ఉన్న యువ పోలీస్ ఆఫీసర్‌గా పరిచయమైంది. గతంలో సీబీఐ, ఇంటర్‌పోల్‌లో పనిచేసిన ఆమె.. ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు చేపట్టిన ‘ఆపరేషన్ ఓం’ను ఆమె లీడ్ చేస్తుంది. ఈ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ వీడియోలో సాయిపల్లవి పవర్‌ఫుల్, ఇంటెన్స్ లుక్‌లో ఆకట్టుకున్నారు. అధికారాన్ని ప్రతిబింబించే బాడీ లాంగ్వేజ్, లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదలతో పాటు నిత్యారెడ్డి పాత్రలోని విభిన్న కోణాలను ఈ వీడియోలో చూపించారు. సహజమైన నటన, హావభావాలతో ప్రేక్షకులను మెప్పించే సాయిపల్లవి.. నిత్యా రెడ్డి పాత్రతో మరో కొత్త సవాల్‌ను స్వీకరించారు. ఈ పాత్ర కోసం ఆమె చేసిన అద్భుతమైన మేకోవర్, పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ధనుష్ ‘ఓం ఫస్ట్ స్ట్రైక్’, మమ్ముట్టి ‘బర్మా కార్తికేయన్’ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ వీడియోలకు అభిమానుల నుంచి ట్రెమెండస్ రెస్పాన్స్‌ వచ్చింది. అలాగే ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్‌తో పాటు ఇటీవల వచ్చిన రెండో పాట ‘వీళా వీరా’ కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. సాయి అభ్యంకర్ స్వరపరిచి, ఆలపించిన ఈ పాటకు టిప్పు స్వ‌రం కూడా మ‌రింత ప్ల‌స్ అయ్యింది. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఈ పాటను విడుదల చేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా సాయిపల్లవి క్యారెక్టర్ ఇంట్రడక్షన్ వీడియో విడుదల కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరుగుతోంది.

ఆర్ టేక్‌ స్టూడియోస్‌ బ్యానర్‌పై శ్రద్ధా అగర్వాల్ నిర్మిస్తోన్న‌ ఈ సినిమాను ధనుష్‌కు చెందిన వండర్‌బార్ ఫిల్మ్స్‌తో కలిసి రూపొందిస్తున్నారు. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ధనుష్, మమ్ముట్టి, సాయిపల్లవి, శ్రీలీల, నసీరుద్దీన్ షా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. కె. ఎళిల్ అరసు సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తుండగా, ఆర్. కళైవాన‌న్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఎ. పన్నీర్‌సెల్వం ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. యానిక్ బెన్, కేచా ఖంపక్డీ యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రఫీ అందించారు.

భారీ తారాగణం, పవర్‌ఫుల్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ వీడియోలు, ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుతున్న పాటలతో ‘ఓం – చాప్టర్ 1: ఉధిరం – ది బ్లడ్ వుడ్’ ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా యాక్షన్ చిత్రాల్లో ఒకటిగా నిలుస్తోంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 20, 2026న థియేటర్లలో విడుదల కానుంది.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.