Skip to content

‘స్లమ్ డాగ్’ నుంచి విజయ్ సేతుపతి గ్లింప్స్‌ రిలీజ్

డైనమిక్ ఫిల్మ్‌మేకర్ పూరి జగన్నాథ్, వెర్సటైల్ హీరో విజయ్ సేతుపతి పాన్-ఇండియా యాక్షన్ డ్రామా ‘స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్’. ఈ చిత్రం ప్రమోషనల్ మెటీరియల్ ఇప్పటికే సంచలనం సృష్టించింది. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ తమ పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై జేబీ నారాయణరావు కొండ్రొల్లా జేబీ మోషన్ పిక్చర్స్ తో కలిసి ఈ చిత్రాన్ని గ్రాండ్ రూపొందిస్తున్నారు. ఇందులో టబు పవర్ ఫుల్ పోలీస్ అధికారిణి పాత్రను పోషిస్తున్నారు. ఆమె పాత్ర గ్లింప్స్‌కు కూడా మంచి స్పందన లభించింది.

తాజాగా చిత్ర బృందం హార్ట్ టచింగ్ గ్లింప్స్‌ను విడుదల చేసింది. ఇందులో విజయ్ సేతుపతి అమ్మ జుబైదాగా జరీనా వహాబ్ పాత్రను పరిచయం చేశారు. తన జీవితంలో ఎదురైన అత్యంత బాధాకరమైన సంఘటనను జుబైదా గుర్తుచేసుకునే ఎమోషనల్ ఎపిసోడ్‌ను ఈ గ్లింప్స్‌లో చూపించారు. ఓ రైల్వే స్టేషన్‌లో చనిపోవాలని అనుకున్నానని.. కానీ ఆకలి వేధించడంతో చివరికి అడుక్కోవాల్సి వచ్చిందని ఆమె చెప్పే సన్నివేశం హృదయాన్ని హత్తుకునేలా ఉంది.

ఒక బిచ్చగాడి జీవితంలో ఎదురయ్యే కఠినమైన, బయట ప్రపంచానికి పెద్దగా తెలియని వాస్తవాలను ఈ సన్నివేశం ఆవిష్కరిస్తుంది. అదే సమయంలో సినిమా కథలోని ప్రధాన భావోద్వేగాన్ని కూడా పరిచయం చేస్తుంది. బతుకు పోరాటం, ఆత్మగౌరవం, ఒక తల్లి భావోద్వేగ ప్రయాణాన్ని ఎంతో సహజంగా, మానవీయంగా చూపించిన ఈ సన్నివేశం ప్రేక్షకుల మనసును తాకేలా ఉంది.

డిఫరెంట్ స్టొరీ టెల్లింగ్, డైనమిక్ ప్రజెంటేషన్‌ తో కట్టిపడేసే పూరి జగన్నాథ్ ..తన కెరీర్‌లో ఇంటెన్స్ ఎమోషన్స్‌ను కూడా అంతే బలంగా హ్యాండిల్ చేశారు. జుబైదా పాత్ర పరిచయం కూడా రచయితగా, దర్శకుడిగా పూరి జగన్నాథ్ బలాన్ని మరోసారి చూపిస్తోంది. ఎంతో ఆకట్టుకునే సిట్యుయేషన్ ద్వారా భావోద్వేగాలతో కూడిన పాత్రను పరిచయం చేశారు.

జరీనా వహాబ్ జుబైదా పాత్రలో అద్భుతమైన నటనను కనబరిచారు. పాత్రకు అవసరమైన డెప్త్, ఎమోషన్‌ను ఆమె తన నటనతో తీసుకొచ్చారు. ఈ పాత్ర కథకు బలమైన ఎమోషనల్ లేయర్‌ను యాడ్ చేస్తోంది. ఈ గ్లింప్స్‌లో విజయ్ సేతుపతితో పాటు ఇతర ప్రముఖ నటీనటులు కూడా కనిపించారు.

సంయుక్త హీరోయిన్‌గా నటిస్తుండగా.. దునియా విజయ్, బ్రహ్మాజీ, వి.టి.వి. గణేష్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సామ్ కె. నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం సమకూరుస్తున్నారు. సంతోష్ నూజిలా ఎడిటింగ్.

‘స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్’ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్-ఇండియా రిలీజ్‌కు సిద్ధమవుతోంది.

తారాగణం: విజయ్ సేతుపతి, సంయుక్త, టబు, జరీనా వహాబ్, దునియా విజయ్ కుమార్, బ్రహ్మాజీ, VTV గణేష్

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: పూరి జగన్నాధ్
నిర్మాతలు: పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్, జెబి నారాయణరావు కొండ్రోళ్ల
సమర్పణ: ఛార్మీ కౌర్
బ్యానర్: పూరి కనెక్ట్స్
సీఈఓ: విషు రెడ్డి
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్
DOP: సామ్ కె నాయుడు
ఎడిటింగ్: సంతోష్ నూజిల్లా
VFX: అనిల్ పాదూరి
PRO: వంశీ-శేఖర్
మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.