గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘దాదా’ షూటింగ్ దాదాపు…
దిల్ రాజుకు డబుల్ ఎనర్జీ ఇచ్చిన ‘రామాయణం’, ‘సీన్’ విజయాలు..
భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రతిష్ఠాత్మక చిత్రం ‘రామాయణం’కు దేశవ్యాప్తంగా అద్భుతమైన స్పందన లభిస్తోంది. నితేశ్ తివారీ దర్శకత్వంలో నమిత్ మల్హోత్రా నిర్మించిన ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్, యశ్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించారు. గ్రాండ్ విజువల్స్, నటీనటుల పెర్ఫార్మెన్స్లు, అత్యున్నత సాంకేతిక విలువలపై ప్రశంసలు కురుస్తున్నాయి. తాజాగా ‘రామాయణం’ ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్ల వసూళ్లు సాధించి కొత్త బెంచ్‌మార్క్‌ను క్రియేట్ చేసింది.
మరోవైపు హీరో సూర్య, జీతూ మాధవన్ కలయికలో వచ్చిన యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ ‘సీన్’ కూడా బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. జ్యోతిక, సూర్య తమ అగరం స్టూడియోస్, 2డీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘రామాయణం’, ‘సీన్’ చిత్రాలను తెలుగు రాష్ట్రాల్లో ఎస్వీసీ విడుదల చేసిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ రెండు సినిమాల విజయాల సందర్భంగా సక్సెస్ ప్రెస్‌మీట్ నిర్వహించారు.
ప్రెస్మీట్లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ..‘రామాయణం’ ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్ల కలెక్షన్స్ సాధించి ఒక ట్రెండ్ సెట్ చేసింది. ఇంత అద్భుతమైన విజయం అందుకోవడం, ఆ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ప్రతి సక్సెస్ ఒక కొత్త ఎనర్జీని ఇస్తుంది. సక్సెస్ నుంచి మనం నేర్చుకోవాలి, దాని నుంచి ఎనర్జీ తెచ్చుకోవాలి. అదే నా ఫార్ములా.
మా నిర్మాత నమిత్ మల్హోత్రా గారికి ధన్యవాదాలు. అలాగే యష్ గారికి థాంక్స్. ఆయన ‘రాజుగారు అంటే మా ఫ్యామిలీ’ అని చెబుతుంటారు. మా ద్వారానే ‘రామాయణం’ను రిలీజ్ చేయించడం మాకు చాలా ఆనందంగా ఉంది. రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి సహా అందరూ అద్భుతంగా నటించారు. సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ‘రామాయణం’ అనేది కేవలం ఒక సినిమా మాత్రమే కాదు. ప్రతి ఒక్కరూ ఈ సినిమాను చూసినప్పుడే అందులో ఉన్న ఇతివృత్తం మన తరతరాలకు అర్థమవుతుంది.
సినిమా విడుదలకు రెండు రోజుల ముందు నేను, శిరీష్ కలిసి బొంబాయిలో ఈ సినిమా చూశాం. అప్పుడు సినిమా చూసినప్పుడు కలిగిన అనుభూతి మామూలుగా లేదు. ఆ సమయంలో నాకు కలిగిన అనుభూతిని సెల్ఫి తీసుకొని మీతో పంచుకున్నాను. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సినిమా చూస్తున్న ప్రేక్షకులకు కూడా అదే అనుభూతి కలుగుతోంది. మన జడ్జిమెంట్ కరెక్ట్ అయినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. ఇంత గొప్ప సక్సెస్‌ను అందించిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు.
దాంతోపాటు ఆరో తేదీన విడుదలైన ‘సీన్’ సినిమా విజయం కూడా మరింత ఆనందాన్ని ఇచ్చింది. తిరుపతి ప్రసాద్ గారు తెలుగు రాష్ట్రాల రైట్స్ తీసుకుని, మా ద్వారా నైజాంలో రిలీజ్ చేయించినందుకు ఆయనకు కూడా ధన్యవాదాలు. మా బ్యానర్ పెట్టినప్పటి నుంచి ప్రసాద్ గారు మాకు సపోర్ట్ చేస్తున్నారు. మేము ఈరోజు ఈ స్థాయిలో ఉండటానికి ఆయన కూడా ఒక ముఖ్యమైన కారణం. ప్రసాద్ గారు ఈ సినిమాను మా దగ్గరకు తీసుకొచ్చి నైజాంలో రిలీజ్ చేయించారు. అది మా అదృష్టం. ఈ రెండు సినిమాలు బ్లాక్‌బస్టర్ కావడం మాకు డబుల్ పాటు కొత్త ఎనర్జీని కూడా ఇచ్చింది.
‘సీన్’ సినిమా చూస్తున్నప్పుడు థియేటర్లో ఒక కొత్త ఎక్స్పీరియన్స్ కలిగింది. థియేటర్లలో ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే మైండ్ బ్లోయింగ్‌గా అనిపించింది. ప్రతి పది నిమిషాలకు ఆడిటోరియంలో విజిల్స్ పడుతున్నాయి. జీతూ మాధవన్ చేసిన స్క్రీన్‌ప్లే ఎక్స్ట్రార్డినరీగా వర్కౌట్ అయింది. అలాగే సూర్య గారి పెర్ఫార్మెన్స్ను ప్రేక్షకులందరూ ఆస్వాదిస్తున్నారు. అందరూ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారు.
సూర్య గారి కెరీర్లోనే ఈ సినిమా హయ్యెస్ట్ రెవెన్యూ క్రియేట్ చేయబోతోంది. ఈ సినిమాతో ఆయన హ్యాట్రిక్ బ్లాక్‌బస్టర్ అందుకున్నారు.
ఒక మంచి కథ రాసుకుని, ఎంత కాంపాక్ట్‌గా సినిమా తీసి హిట్ కొట్టవచ్చో ‘సీన్’ సినిమా ద్వారా నేర్చుకున్నాం. ఈ సినిమా నాకు చాలా మంచి విషయాలు నేర్పించింది. ప్రేక్షకులను ఎంగేజ్ చేయడానికి భారీ బడ్జెట్ సినిమాలే అవసరం లేదు. ఒక మంచి కథతో కూడా ప్రేక్షకులను ఎలా అలరించవచ్చో ‘సీన్’ సినిమా మాకు నేర్పించింది.
నేను ఇండస్ట్రీకి 30 ఏళ్లు అవుతోంది. విజయాలు చూశాం, అపజయాలు చూశాం. నేను ఎప్పుడూ ఫెయిల్యూర్స్‌కు కుంగిపోను, సక్సెస్‌కు పొంగిపోను. ఎప్పుడూ బ్యాలెన్స్డ్గా ఉంటాను. ఇండస్ట్రీలో ఉన్నన్ని రోజులు మంచి చేస్తూ, మంచి సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తాను. ఈ రెండు సినిమాల విజయాలు మాకు గొప్ప ఆనందాన్ని ఇచ్చాయి.

