Skip to content

‘అలియాస్ రుక్మిణి’ నుంచి క్యాచీ సాంగ్ పిచ్చి ప్రేమలో రిలీజ్

నేచురల్ స్టార్ నాని యునానిమస్ ప్రొడక్షన్స్, నితిన్ హీరోగా ‘అలియాస్ రుక్మిణి’ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ‘దండోరా’ ఫేమ్ మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వం వహిస్తున్న ఈ దీప్తి గంట నిర్మిస్తున్నారు. రొమాన్స్, హ్యూమర్ కలగలిసిన ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘రుక్మిణి’కి మంచి రెస్పాన్స్ రావడంతో, తాజాగా ఈ సినిమా నుంచి రెండో పాట ‘పిచ్చి ప్రేమలో’ను మేకర్స్ విడుదల చేశారు.

విజయ్ బుల్గానిన్ కంపోజ్ చేసిన ఈ పాట మంచి మెలోడీగా ఆకట్టుకుంటోంది. అద్భుతమైన ఆర్కెస్ట్రేషన్, వినసొంపైన స్ట్రింగ్స్ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్తీక్ తన వాయిస్‌తో పాటను మరింత బాగుండేలా చేశారు. కృష్ణకాంత్ అందించిన లిరిక్స్ హీరో తన భార్యపై చూపించే ప్రేమను చాలా అందంగా తెలియజేస్తున్నాయి.

తన భార్య అందంగా ఉండటమే కాకుండా, అల్లరి చేసే స్వభావం, అప్పుడప్పుడు మారాం చేయడం, చిన్న చిన్న విషయాలకు అలగడం తనకు మరింత ప్రత్యేకంగా అనిపిస్తుందని హీరో ఈ పాటలో చెబుతాడు. ఆమె ప్రేమలో పూర్తిగా మునిగిపోయిన అతను ప్రతిరోజూ కొత్తగా ఆమె ప్రేమలో పడుతుంటాడు. తన ప్రేమను ఎంతగా వ్యక్తం చేసినా, తన మనసులో ఉన్న భావాలను, ఆమె తన జీవితంలో తీసుకొచ్చిన ఆనందాన్ని మాటల్లో పూర్తిగా చెప్పలేనని భావిస్తాడు. ఈ పాటకు ఈశ్వర్ పెంటి అందించిన కొరియోగ్రఫీ కూడా చక్కగా కుదిరింది.

‘పిచ్చి ప్రేమలో’ పాట కొత్తగా పెళ్లైన జంట మధ్య ఉండే ప్రేమను, అనుబంధాన్ని చాలా సహజంగా చూపిస్తుంది. ఇద్దరూ కలిసి బయటకు వెళ్లడం, భర్త తన భార్యను స్కూల్ దగ్గర డ్రాప్ చేయడం వంటి చిన్న చిన్న సందర్భాలు వైవాహిక జీవితంలోని అందమైన క్షణాలను గుర్తుచేస్తాయి. ఒక సాధారణ మిడిల్ క్లాస్ భర్త పాత్రలో నితిన్ చాలా సహజంగా కనిపించగా, సంప్రదాయ దుస్తుల్లో ఆఫియా సయ్యద్ అందంగా కనిపించారు. లీడ్ పెయిర్ మధ్య ఉన్న సహజమైన కెమిస్ట్రీ పాటకు మరింత ఆకర్షణ తీసుకొచ్చింది.

మొత్తంగా ‘పిచ్చి ప్రేమలో’ పాట మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకునే అన్ని అంశాలతో రూపొందింది. ఈ ఆల్బమ్ నుంచి మరో ఫేవరెట్ సాంగ్‌గా నిలవడంతో పాటు మ్యూజిక్ చార్ట్స్‌లో కూడా టాప్ ప్లేస్‌కు చేరనుంది

ఈ సినిమాకు జోమోన్ టి. జాన్ ISC సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. విజయ్ బుల్గానిన్ సంగీతం సమకూరుస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలు నిర్వహిస్తుండగా, సృజన ఆదుసుమిల్లి ఎడిటింగ్ చేస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 4న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.

నటీనటులు:నితిన్, ఆఫియా సయ్యద్, సాయి కుమార్, హర్షవర్ధన్

టెక్నికల్ టీం:
ప్రెజెంటర్: నేచురల్ స్టార్ నాని
ప్రొడక్షన్ బ్యానర్: యునానిమస్ ప్రొడక్షన్స్
రచన, దర్శకత్వం: మురళీకాంత్ దేవసోత్
నిర్మాత: దీప్తి గంటా
సినిమాటోగ్రఫీ: జోమోన్ టి. జాన్ ISC
సంగీతం: విజయ్ బుల్గానిన్
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
ఎడిటర్: సృజన ఆదుసుమిల్లి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ప్రశాంత్ మండవ
కాస్ట్యూమ్ డిజైనర్: రేఖ బొగ్గారపు
పబ్లిసిటీ డిజైనర్: భరణీధరన్
మార్కెటింగ్: ఫస్ట్ షో
పీఆర్వో: వంశీ-శేఖర్

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.