Skip to content

‘స్లమ్ డాగ్’ నుంచి జుబైదాగా జరీనా వహాబ్ ఫస్ట్ లుక్ రిలీజ్

డైనమిక్ ఫిల్మ్‌మేకర్ పూరి జగన్నాథ్, వెర్సటైల్ హీరో విజయ్ సేతుపతి పాన్-ఇండియా యాక్షన్ డ్రామా ‘స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్’. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ తమ పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై జేబీ నారాయణరావు కొండ్రొల్లా జేబీ మోషన్ పిక్చర్స్ తో కలిసి ఈ చిత్రాన్ని గ్రాండ్ రూపొందిస్తున్నారు. ఫస్ట్ లుక్, టీజర్ అద్భుతమైన రెస్పాన్స్ తో సినిమాపై అంచనాలను పెంచింది.

ఈ చిత్రంలో వెటరన్ నటి జరీనా వహాబ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆమె పాత్రను జుబైదాగా మేకర్స్ పరిచయం చేశారు. ప్రేమతో కూడిన హృదయం.. పోరాటాలతో నిండిన జీవితం అంటూ రివిల్ చేసిన ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకుంది.

ఈ చిత్రంలో సంయుక్త హీరోయిన్‌గా నటిస్తుండగా, టబు పవర్ ఫుల్ రోల్ చేస్తున్నారు. దునియా విజయ్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారు. బ్రహ్మాజీ, వీటీవీ గణేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సామ్ కె. నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం సమకూరుస్తున్నారు. సంతోష్ నూజిల్లా ఎడిటింగ్.

తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్-ఇండియా స్థాయిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

నటీనటులు: విజయ్ సేతుపతి, సంయుక్త, టబు, జరీనా వహాబ్, దునియా విజయ్ కుమార్, బ్రహ్మాజీ, విటివి గణేష్

సాంకేతిక బృందం:
రచన, దర్శకత్వం: పూరీ జగన్నాథ్
నిర్మాతలు: పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్, జెబి నారాయణ్ రావు కొండ్రోళ్ల
సమర్పణ: ఛార్మీ కౌర్
బ్యానర్: పూరీ కనెక్ట్స్
CEO: విష్ణు రెడ్డి
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్
DOP: సామ్ కె నాయుడు
ఎడిటింగ్: సంతోష్ నూజిళ్ల
VFX: అనిల్ పదురి
PRO: వంశీ-శేఖర్
మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.