ఇండియన్ సినిమాలో యాక్షన్ హీరో అంటే ఇకపై విజయ్ దేవరకొండ గురించే చెప్పుకుంటారని అన్నారు సెన్సేషనల్…
‘స్లమ్ డాగ్’ షూటింగ్ పూర్తి.. త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్
డైనమిక్ ఫిల్మ్‌మేకర్ పూరి జగన్నాథ్, వెర్సటైల్ హీరో విజయ్ సేతుపతి పాన్-ఇండియా యాక్షన్ డ్రామా ‘స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్’ షూటింగ్ పూర్తయింది. హైదరాబాద్‌లో ఈరోజు జరిగిన చివరి షెడ్యూల్‌తో సినిమా చిత్రీకరణ మొత్తం ముగిసింది. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై రూపొందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌తో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి బజ్ ఏర్పడింది.
పవర్ ఫుల్ కథలు, తనదైన స్క్రీన్ ప్రజెంటేషన్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పూరి జగన్నాథ్.. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. ఇప్పటివరకు విడుదలైన పాత్రల పరిచయ వీడియోలు సినిమాలోని విభిన్న పాత్రల స్వభావాలను పరిచయం చేశాయి.
త్వరలోనే సినిమాను థియేటర్లలోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్న మేకర్స్.. ప్రమోషనల్ కార్యక్రమాలను మరింత వేగవంతం చేయనున్నారు. సినిమా విడుదల తేదీని కూడా త్వరలో ప్రకటించనున్నారు.
ఈ చిత్రంలో సంయుక్త కథానాయికగా నటిస్తుండగా, టబు, దునియా విజయ్, జరీనా వహాబ్, బ్రహ్మాజీ, వీటీవీ గణేశ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌ను బట్టి సినిమాలో ప్రతి పాత్రకు ప్రత్యేక ప్రాధాన్యం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ బాధ్యతలను సామ్ కె. నాయుడు నిర్వహిస్తుండగా, హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. సంతోష్ నూజిల్లా ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. అనిల్ పడూరి విజువల్ ఎఫెక్ట్స్ పర్యవేక్షిస్తున్నారు.
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.
తారాగణం: విజయ్ సేతుపతి, సంయుక్త, టబు, జరీనా వహాబ్, దునియా విజయ్ కుమార్, బ్రహ్మాజీ, VTV గణేష్
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: పూరి జగన్నాధ్
నిర్మాతలు: పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్
సమర్పణ: ఛార్మీ కౌర్
బ్యానర్: పూరి కనెక్ట్స్
సీఈఓ: విషు రెడ్డి
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్
DOP: సామ్ కె నాయుడు
ఎడిటింగ్: సంతోష్ నూజిల్లా
VFX: అనిల్ పాదూరి
PRO: వంశీ-శేఖర్
మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా

