Skip to content

‘డోంట్ స్లీప్’ టీజర్ పై కమల్ హాసన్ ప్రశంసలు

ఇంద్ర రామ్ హీరోగా షామ్‌దత్ దర్శకత్వంలో రూపొందుతున్న సైకలాజికల్ థ్రిల్లర్ ‘డోంట్ స్లీప్’ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. మమ్ముట్టి నటించిన మలయాళం–తమిళ ద్విభాషా థ్రిల్లర్ ‘స్ట్రీట్ లైట్స్’తో దర్శకుడిగా పరిచయమైన సినిమాటోగ్రాఫర్ షామ్‌దత్ .. ఈ చిత్రంతో తెలుగులో దర్శకుడిగా అడుగుపెడుతున్నారు. ‘చౌర్య పాఠం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఇంద్ర రామ్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. వీ డ్రీమ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై వీ చుడామణి నిర్మిస్తున్న ఈ చిత్రం ఆ సంస్థకు ప్రొడక్షన్ నంబర్ 2.

ఇటీవలే విడుదలైన టీజర్‌ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ఉలగనాయగన్ కమల్ హాసన్ #DontSleep టీజర్‌ను అభినందించి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

విభిన్నమైన కథాంశం, విజువల్స్, ఉత్కంఠభరితమైన కథనంతో ‘డోంట్ స్లీప్’ టీజర్ సినిమాపై అంచనాలను పెంచుతోంది. వినూత్నమైన కాన్సెప్ట్‌తో పాటు సాంకేతికంగా ఉన్నత ప్రమాణాలతో రూపొందుతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు ఆసక్తికరమైన థియేట్రికల్ అనుభూతిని అందించనుంది.

నటీనటులు: ఇంద్ర రామ్, రవీంద్ర విజయ్, తబా రీమా, జోయీతా బెనర్జీ, సునీల్ థాపా, ఆడుకలం నరేన్, కల్పలత, అనీష్ కురువిల్లా, వెన్నెల కిశోర్, నాగి జబర్దస్త్, డాక్టర్ భద్రం, రఘుబాబు

సాంకేతిక బృందం:
దర్శకత్వం, డీవోపీ: షామ్‌దత్ ఐఎస్‌సీ
కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్: సజీర్ బాబా, లూనా జబిన్
నిర్మాత: వీ చుడామణి
నిర్మాణ సంస్థ: వీ డ్రీమ్ ఫిలిమ్స్
సంగీతం: గోకుల్ హర్షన్
ప్రొడక్షన్ డిజైన్: మోనికా రామకృష్ణ
పీఆర్వో: వంశీ-శేఖర్

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.