‘డోంట్ స్లీప్’ టీజర్ పై కమల్ హాసన్ ప్రశంసలు
ఇంద్ర రామ్ హీరోగా షామ్‌దత్ దర్శకత్వంలో రూపొందుతున్న సైకలాజికల్ థ్రిల్లర్ ‘డోంట్ స్లీప్’ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. మమ్ముట్టి నటించిన మలయాళం–తమిళ ద్విభాషా థ్రిల్లర్ ‘స్ట్రీట్ లైట్స్’తో దర్శకుడిగా పరిచయమైన సినిమాటోగ్రాఫర్ షామ్‌దత్ .. ఈ చిత్రంతో తెలుగులో దర్శకుడిగా అడుగుపెడుతున్నారు. ‘చౌర్య పాఠం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఇంద్ర రామ్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. వీ డ్రీమ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై వీ చుడామణి నిర్మిస్తున్న ఈ చిత్రం ఆ సంస్థకు ప్రొడక్షన్ నంబర్ 2. ఇటీవలే విడుదలైన టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ఉలగనాయగన్ కమల్ హాసన్ #DontSleep టీజర్‌ను అభినందించి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. విభిన్నమైన కథాంశం, విజువల్స్, ఉత్కంఠభరితమైన కథనంతో ‘డోంట్…
