‘రామాయణం’ సినిమా పై ప్రశంసలు కురిపించిన ఎస్ ఎస్ రాజమౌళి
‘రామాయణం’ థియేటర్లలోకి రావడంతో ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల నుంచి అద్భుతమైన స్పందనను అందుకుంటోంది. గ్రాండ్ స్టోరీటెల్లింగ్, నటీనటుల అద్భుతమైన పెర్ఫార్మెన్స్లు, సాంకేతిక విలువలపై ప్రేక్షకులు, విమర్శకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ఈ సినిమాపై ప్రశంసలు కురిపించడం చిత్రానికి మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది. భారతీయ సినిమాను తనదైన భారీ కథాకథనాలతో కొత్త స్థాయికి తీసుకెళ్లిన రాజమౌళి.. నితేశ్ తివారీ తెరకెక్కించిన ఈ ప్రతిష్ఠాత్మక ఎపిక్ చిత్రాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ముఖ్యంగా సినిమా భారీ స్థాయి, బిగ్ స్క్రీన్‌పై విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. ఈ సినిమా అందించే గ్రాండ్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను కొనియాడుతూ ఎక్స్ వేదికగా…
